► యూనియన్ బలోపేతంపై దృష్టి సారించిన అధిష్టానం
► భారీగా చేరనున్న ఇతర సంఘాల నాయకులు
గోదావరిఖని(కరీంనగర్) : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఆకర్ష్ కొనసాగుతుండగా.. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ సైతం దృష్టి సారించింది. జూన్ 28 నాటికి గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తవుతుండగా.. ఆ లోపే యూనియన్‌ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో నా యకత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగం గా కంపెనీ వ్యాప్తంగా ఉన్న వివిధ ఏరియాలకు చెంది న పలు సంఘాల నాయకులను చేర్చుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణిలో జరిగిన ఉద్యమాల్లో కార్మికులను భాగస్వామ్యం చేస్తూ జేఏసీకి కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించిన మాదాసు రామ్మూర్తిని టీబీజీకేఎస్‌లోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.
ఈయనతో పాటు శ్రీరాంపూర్ ఏరియా ఏఐటీయూసీలో కీలకంగా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన ఆరుగురు నాయకుల చేరిక సైతం దాదాపు ఖాయమైంది. ఇక కొత్తగూడెం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాలకు చెందిన రెండు ప్రాంతీయ కార్మిక సంఘాల నుంచి పలువురు నాయకులు టీబీజీకేఎస్‌లోకి రానున్నారు. ప్రస్తుతం మలేషియూలో పర్యటనలో ఉన్న యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈనెల 14న స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత అన్ని ఏరి యాల నుంచి నాయకులను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌కు పిలిపించి యూనియన్‌లో చేర్చుకునే కార్యక్రమం చేపడతామని ఓ నాయకుడు తెలిపారు.
ఇదిలా ఉండగా గుర్తింపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున యూనియన్ ఎక్కడెక్కడ బలహీనం గా ఉందనే విషయమై పరిశీలించి ఆయూ ఏరియూల్లో నాయకులను మార్చే పనిలో అధిష్టానం నిమగ్నమైం ది. ఇప్పటికే పలు గనులలో ఫిట్ కార్యదర్శులను మార్పు చేశారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలోనూ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తమ్మీద ఎన్నికల నాటికి యూనియన్ బలాన్ని పెంచుకుంటూ గెలుపే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతున్నది.
టీబీజీకేఎస్ ఆకర్ష్
Published Tue, Apr 12 2016 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement