
‘వారసత్వం’ పునరుద్ధరించాలి
► ఎస్‌ఎస్‌ఏ సదస్సులో వక్తల డిమాండ్
► జాప్యంతో ఇప్పటికే రెండేళ్ల సర్వీసు నష్టం
► వేల మంది కార్మికులకు అన్యాయం
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి సన్స్ అసోసియేషన్(ఎస్‌ఎస్‌ఏ) ఏర్పాటు చేసిన సమావేశానికి సింగరేణి వ్యాప్తంగా ఉన్న గని కార్మికుల పిల్లలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకుడు హెచ్.రవీందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గని కార్మికుల ఆకాంక్షలు స్వరాష్ట్రంలో నెరవేర డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చిన వెంటనే వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. సర్కారు జాప్యం చేయడం వల్ల ఇప్పటికీ 8వేల మంది రెండేళ్ల సర్వీసు అర్హత కోల్పోయారని, తెలంగాణ వచ్చిన ఆనందం సింగరేణిలో లేదన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల సమయం వచ్చే సరికి మరో సారి కార్మికులను ఇదే డిమాండ్‌తో మోసం చేయాలని కార్మిక సంఘాల నాయకులు చూస్తున్నారని విమర్శించారు. కార్మికుల డిమాండ్ కొత్తదేమీ కాదని, కంపెనీ బతకాలంటే వారసత్వ ఉద్యోగాలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐక్య పోరాటాలు చేయూల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. తక్షణమే ప్రభుత్వంతోపాటు యూజమాన్యం స్పందిం చాలని డిమాండ్ చేశారు. గని కార్మికులందరికీ సొంతింటి పథకం అమలు చేయూలన్నారు. కార్మికుల పిల్లలు ఐక్యంగా ఉండి ఉద్యోగాల సాధనకు పోరాడటం హర్షణీయమని అన్నారు.
ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల ఏర్పాటును అడ్డుకొని సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సంతకాల కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జేఏసీ నాయకులు బాబన్న, శ్రీరాంపూర్ జేఏసీ కన్వీనర్ గోషిక మల్లేశ్, ఎస్‌ఎస్‌ఏ అధ్యక్షుడు కృష్ణకుమార్, ఉపాధ్యక్షులు సిద్ధిక్‌షేక్, ప్రశాంత్, జిల్లా, శ్రీరాంపూర్, సీసీసీ ఇన్‌చార్జీలు హేమచందర్, అనిల్‌కుమార్, శ్రీరాంపూర్, సీసీసీ ఇన్‌చార్జీలు సందీప్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.