
ఇసుక తరలింపుపై విచార ణ చేపట్టాలి
► సర్పంచ్ సాధనబోయిన కృష్ణ
► ఇసుక లారీల అడ్డగింత
చెన్నూర్ : చెన్నూర్ గోదావరి నది నుంచి జైపూర్‌లో నిర్మిస్తున్న సింగరేణి పవర్ ప్లాంట్‌కు ఇ సుక తరలింపులో అక్రమాలు జరుగుతున్నాయ ని, వీటిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక సర్పంచ్ సాధనబోయిన కృష్ణ డిమాండ్ చేశారు. గోదావరినది నుంచి జైపూర్‌కు ఇసుక తరలిస్తున్న లారీలను గురువారం అడ్డుకున్నారు. లారీ డ్రైవర్ చూపిం చిన వేబిల్లులో ఈ నెల 6 బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఇసుక తీసుకెళ్లాలని ఉం ది. 7వ తేదీన ఇసుక ఎలా తీసుకెళ్తారని ప్ర శ్నించారు. ఈ విషయం తమకు తెలియదని డ్రైవర్లు సమాధానం చెప్పారు.
గడువు ముగిసిన తేదీతో ఇసుక ఎలా తరలిస్తున్నారని సర్పంచ్ ఆ గ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గతంలో చెన్నూర్ గోదావరి నదిలో ఇసుకే లే దని అధికారులు చెప్పినప్పటికీ మళ్లీ చెన్నూర్ గోదావరినదిలో 67 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారని అన్నా రు. అనుమతి పేరుతో ఇసుక కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పొగుల సతీశ్, భీమయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్
గోదావరి నది నుంచి పవర్‌ప్లాంట్‌కు ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పరిశీలించామని తహసీల్దార్ దిలీప్‌కుమార్ అన్నారు. రెండు లారీల వేబిల్లులు సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. ఓవర్‌లోడ్ వెళ్తుందన్న సర్పంచ్ ఆరోపణ మేరకు పంచాయతీ సిబ్బంది, రె వెన్యూ సిబ్బందితో కలసి జైపూర్ మండలం ఇందారం గ్రామం వద్ద వేయింగ్ చేయించామని అన్నారు. రెండు లారీల్లో వేబిల్లులో ప్రకారం ఇసుక తరలిస్తున్నట్లు తేలిందని చెప్పారు. మరో ఇసుక లారీ 6న వెళ్లాల్సి ఉండగా 7న తీసుకెళ్లడం సరికాదని తెలిపారు. ఈ విషయమై విచారణ చేయగా.. 6న లారీ చెడిపోవడంతో 7న తీసుకెళ్తున్నామని డ్రైవర్ చెప్పినట్లు తెలిపారు. జాతీయ రోడ్డుపై సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.