Operation Green Hunt
-
ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఆపివేయాలి
నెల్లూరు(పొగతోట): ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఆపివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు పార్థసారథి, ఎల్లంకి వెంకటేశ్వర్లు, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్ డిమాండ్ చేశారు. బెజ్జంగి ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ శనివారం నగరంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు ఐదు రోజులగా విశాఖ మాన్యం, ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్లో ఎన్కౌంటర్ పేరుతో నిరంతరం జరుగుతున్న హత్యలు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బాక్సైట్‌పై కన్నేసిన బహుళజాతి కంపెనీలు దళారీ పాలకులతో ఒప్పందం చేసుకుని దేశ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపైకి సాయుధ బలగాలను దింపి అరచాకం చేస్తున్నారని తెలిపారు. గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై యుద్ధం ప్రకటించి ప్రజలు జీవించే హక్కు కాలరాస్తున్నారన్నారు. ఈ నెల 24వ తేదీ 33 మందిని కాల్చిచంపరన్నారు. ఎన్కౌంటర్ పేరుతో ప్రభుత్వం పోలీసులతో హత్యలు చేయిస్తోందన్నారు. అటవీ ప్రాంతాల నుంచి సాయుధబలగాలను వెనక్కు రప్పించాలన్నారు. అనంతరం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. -
ఎంఎన్సీలకు దోచిపెట్టేందుకే గ్రీన్‌హంట్
-ప్రొఫెసర్ హరగోపాల్ న్యూశాయంపేట : ఆదివాసీల హక్కులను కాలరాసి మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు గ్రీన్‌హంట్ పేరిట ప్రభుత్వాలు ఆదివాసీల నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో మంగళవారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరిగోపాల్ మాట్లాడారు. ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీలను పోలీస్ బలగాలు అడవుల నుంచి బయటకు గెంటివేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో ఇలాంటి చర్యలు తగవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నష్టం జరుగుతోందని, ఆంధ్రా వాళ్లు తమ సంపదను కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతోనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అధికారంలోకి రాకముందు తమది నక్సల్స్ ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. నేడు ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై నిర్బంధాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల సమస్యల కోసం సభ పెట్టుకుంటే చివరికి న్యాయవ్యవస్థ జోక్యం తీసుకుని అనుమతి ఇచ్చాక కూడా, పోలీసు నిర్బంధాల మధ్య సభ నిర్వహించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మానవీయ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీఎఫ్ నాయకులు రవీంధ్రనాధ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి ఇంత నిర్బంధం ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్త మాట్లాడుతూ భారత దేశంలో హిందూ ముస్లింల మధ్య సమైక్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో విరసం నేత వరవరరావు, ఆచార్య జిఎన్ సాయిబాబా, టీడీఎఫ్ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, నాయకులు నారాయణరావు, చిక్కుడు ప్రభాకర్, కోట శ్రీనివాసరావు, రవీందర్రావు, నలమాస కృష్ణ, జనగాం కుమారస్వామి, బాసిత్, రమాదేవి, నల్లెల రాజయ్య పాల్గొన్నారు. సభలో చేసిన తీర్మానాలివే.. -ఆదివాసీలను మట్టు పెట్టెందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మూడవ దశ గ్రీన్‌హంట్ మారణకాండను వెంటనే నిలిపి వేయాలి -దేశ వ్యాప్తంగా దళిత మైనారిటీలపై ఫాసిస్టు దాడులను నిలిపివేయాలి. -ఖనిజ నిక్షేప ఒప్పందాలను రద్దుచేయాలి. -బహిరంగ సభకు వస్తుండగా నిర్బంధించిన ఆదివాసీలను విడుదల చేయాలి. -వేముల రోహిత్ హంతకులను శిక్షించాలి నిర్బంధం మధ్య బహిరంగ సభ.. అనేక నిర్బంధాల మద్య టీడీఎఫ్ బహిరంగ సభ జరిగింది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు మాత్రమే సభ నిర్వహించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు ఒంటరిగా రావాలని, ర్యాలీలు, నినాదాలు చేయవద్దని పోలీసులు కట్డడి చేశారు. సభను, హంటర్‌రోడ్ ప్రధాన రాహదారి వద్ద సభకు వచ్చే వారిని వీడియో ద్వారా చిత్రీకరించారు. బహిరంగసభలో ఏడుగురు ముఖ్య వ్యక్తులలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే మాట్లాడారు. ప్రధాన వక్త అయిన విరసం నేత వరవరరావు స్టేజీపై కాకుండా ప్రజల మధ్యనే ఉండాల్సి వచ్చింది. ఇంత నిర్బంధం విధించినా బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం గమనార్హం. -
గోదావరి జిల్లాలో మావోయిస్టుల అలజడి
గోదావరి జిల్లాలో మావోయిస్టుల అలజడి మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగ గ్రామాల నడుమ రహదారిపై మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి మూడుచోట్ల కందకాలు తవ్వారు. సుమారు 20 చెట్లను నరికి రహదారికి అడ్డంగా పడేశారు. మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో పలుచోట్ల పోస్టర్లు, కరపత్రాలను వదిలి వెళ్లారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పేగ, అల్లిగూడెం, మల్లంపేట గ్రామాలకు ఏడుగురాళ్లపల్లి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నెల్లిపాక, చింతూరు జాతీయ రహదారిలోని కాటుకపల్లి వద్ద కూడా మావోయిస్టులు పోస్టర్లు వెలిశాయి. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మావోయిస్టు సెంట్రల్ రీజనల్ బ్యూరో (సీఆర్బీ) మే 4, 5 తేదీల్లో తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ప్రజలపై, విప్లవోద్యమాలపై ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు కరపత్రాల్లో మావోయిస్టు పార్టీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుల నిర్వాసిత మండలాల పీడిత ప్రజలకు అన్యాయం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. కూంబింగ్ ముమ్మరం మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారి తవ్వకాల విషయాన్ని తెలుసుకున్న అధికారులు రోడ్లపై ఉన్న చెట్లను తొలగించి, కందకాలను పూడ్చారు. దీంతో ఈ దారిలో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. మరోవైపు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు చింతూరు సీఐ దుర్గారావు తెలిపారు. -
కడసారిగా ఆర్తీ అగర్వాల్
ఆర్తీ అగర్వాల్ నటించిన చివరి చిత్రం ‘ఆపరేషన్ గ్రీన్ హట్’. ఎన్.ఎ రహ్మాన్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ- ‘‘చాలా మంది నటీనటులు ఎన్నో ఆశలతో, కోరికలతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఇదే జీవితంగా బతుకుతూ ఉంటారు. అవకాశాలు రాకపోతే అగాథంలోకి వెళిపోతారు. ఇదే పరిస్థితి ఆర్తీ అగర్వాల్‌కు ఎదురైంది. చిన్న వయసులోనే పెద్ద హీరో యిన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించు కుంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా మన మధ్యలో లేకపోవడం బాధగా ఉంది’’ అని చెప్పారు. ‘‘తమిళ, మలయాళ వెర్షన్ల విషయంలో సెన్సార్ వాళ్లు కావాలనే జాప్యం చేస్తున్నారు. దీనిపై పోరాడుతున్నాం. ఈ నెలాఖరులోనే ఢిల్లీలో ఆడియో విడుదల చేయనున్నాం ’’ అని నిర్మాత చెప్పారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా హిందీ వెర్షన్‌ను చూసి, ‘బాగా వచ్చింది. నాకు ిహట్ ఖాయం’ అని ఆర్తీ అగర్వాల్ సంతోషపడ్డారు. కానీ, ఈలోపే ఆమె వెళ్లిపోయారు. ఇలా జరగడం దురదృష్టకరం. ఓ మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, శివాజీరాజా, సాగరిక తదితరులు పాల్గొన్నారు. -
ఏపీసీఎల్సీ నేతల గృహ నిర్బంధం
-
ఏపిసిఎల్సి నేతల గృహనిర్బంధం
అనంతపురం: ఏపిసిఎల్సి(ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం) నేతలు పలువురిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తిరుపతిలో జరిగే ఆపరేషన్ గ్రీన్‌హంట్ సదస్సుకు వారు హాజరుకాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సదస్సును వాయిదావేస్తున్నట్లు ఎపిసిఎల్సి నేతలు ప్రకటించారు. గృహనిర్బంధంలో ఉంచినవారిలో ఏపిసిఎల్సి రాష్ట్ర అధ్యక్షుడు శేషయ్య, హరినాథరెడ్డి, విజయకుమార్ ఉన్నారు.కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల అడవులను నాశనం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను తక్షణం ఆపివేయాలని ఎపిసిఎల్సి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. **