కడసారిగా ఆర్తీ అగర్వాల్ | Aarthi Agarwal Last Movie Operation Green Hunt | Sakshi
Sakshi News home page

కడసారిగా ఆర్తీ అగర్వాల్

Published Mon, Jun 15 2015 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

కడసారిగా ఆర్తీ అగర్వాల్

కడసారిగా ఆర్తీ అగర్వాల్

ఆర్తీ అగర్వాల్ నటించిన చివరి చిత్రం ‘ఆపరేషన్ గ్రీన్ హట్’. ఎన్.ఎ రహ్మాన్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ- ‘‘చాలా మంది నటీనటులు ఎన్నో ఆశలతో, కోరికలతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెడతారు.
 
 ఇదే జీవితంగా బతుకుతూ ఉంటారు. అవకాశాలు రాకపోతే అగాథంలోకి వెళిపోతారు. ఇదే పరిస్థితి ఆర్తీ అగర్వాల్‌కు ఎదురైంది. చిన్న వయసులోనే పెద్ద హీరో యిన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించు కుంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా మన మధ్యలో లేకపోవడం బాధగా ఉంది’’ అని చెప్పారు. ‘‘తమిళ, మలయాళ వెర్షన్‌ల విషయంలో సెన్సార్ వాళ్లు  కావాలనే జాప్యం చేస్తున్నారు.
 
 దీనిపై పోరాడుతున్నాం. ఈ నెలాఖరులోనే ఢిల్లీలో ఆడియో విడుదల చేయనున్నాం ’’ అని నిర్మాత చెప్పారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా హిందీ వెర్షన్‌ను చూసి, ‘బాగా వచ్చింది. నాకు ిహట్ ఖాయం’ అని ఆర్తీ అగర్వాల్  సంతోషపడ్డారు. కానీ, ఈలోపే ఆమె వెళ్లిపోయారు. ఇలా జరగడం దురదృష్టకరం. ఓ మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది’’ అని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, శివాజీరాజా, సాగరిక తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement