
శేషయ్య
అనంతపురం: ఏపిసిఎల్సి(ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం) నేతలు పలువురిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తిరుపతిలో జరిగే ఆపరేషన్ గ్రీన్హంట్ సదస్సుకు వారు హాజరుకాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సదస్సును వాయిదావేస్తున్నట్లు ఎపిసిఎల్సి నేతలు ప్రకటించారు.
గృహనిర్బంధంలో ఉంచినవారిలో ఏపిసిఎల్సి రాష్ట్ర అధ్యక్షుడు శేషయ్య, హరినాథరెడ్డి, విజయకుమార్ ఉన్నారు.కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల అడవులను నాశనం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను తక్షణం ఆపివేయాలని ఎపిసిఎల్సి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
**