opposition concerned
-
పార్లమెంటులో కొనసాగిన మణిపూర్‌పై విపక్షాల ఆందోళన
పార్లమెంటులో కొనసాగిన మణిపూర్‌పై విపక్షాల ఆందోళన -
‘ఆ తీర్పు అత్యంత ప్రమాదకరం’.. 17 విపక్ష పార్టీల ఆందోళన!
న్యూఢిల్లీ: పీఎంఎల్ఏ చట్టం 2002కు 2019లో సవరణలు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించటాన్ని ఇటీవల సమర్థించింది సుప్రీం కోర్టు. ఈడీ అరెస్టులు, సోదాలు సరైనవేనని, దర్యాప్తు అధికారులు పోలీసులు కాదని స్పష్టం చేసింది. అయితే.. సుప్రీం కోర్టు తీర్పును అత్యంత ప్రమాదకరమైన తీర్పుగా అభివర్ణించాయి విపక్ష పార్టీలు. సుమారు 17 విపక్ష పార్టీలు సుప్రీం కోర్టు తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీర్ఘకాలం పాటు దాని ప్రభావం ఉంటుందని, తీర్పును పునఃసమీక్షించాలని కోరాయి. ‘ప్రమాదకరమైన తీర్పు స్వల్ప కాలికంగా ఉంటుందని, త్వరలోనే రాజ్యాంగపరమైన నిబంధనలు అమలులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశాయి. దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి ప్రధాన పార్టీలు సంతకాలు చేశాయి. రాజకీయ ప్రతీకారంతో చట్టాన్ని తప్పుదోవలో వాడుకుంటున్నారని ఇప్పటికే పలు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా.. సుప్రీం కోర్టు తీర్పుపై పునఃసమీక్షించాలని కోరనున్నట్లు పేర్కొన్నాయి. ఈ చట్టంలో చాలా తక్కువ మంది దోషులుగా తేలారని తెలిపాయి. 8 ఏళ్ల మోదీ పాలనలో ఈడీ రైడ్స్ 26 రెట్లు పెరిగాయి. 3,010 మనీలాండరింగ్ కేసులు నమోదు కాగా.. అందులో 23 మంది మాత్రమే దోషులుగా తేలారు. 112 సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేవు. పార్లమెంట్లో మనీలాండరింగ్ చట్ట సవరణ చేసిన విధానాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మనీ బిల్గా ప్రవేశపెట్టిన ఫైనాన్స్ చట్టం కింద వాటిని ఆమోదించారని పేర్కొన్నాయి. మనీ బిల్లు తప్పనిసరిగా కన్సాలిడేటెడ్ ఫండ్, ట్యాక్స్‌ల నుంచి నగదు కేటాయింపులకు వర్తించాలని, కానీ, ఇతర అంశాల్లో చట్టాలు చేసేందుకు ఉపయోగించకూడదని పేర్కొన్నాయి. సవరణలు చేసేందుకు ఆర్థిక చట్టాన్ని ఉపయోగించే విధానం రాజ్యాంగ బద్ధతను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నాయి. 17 Opposition parties, including TMC & AAP, plus one independent Rajya Sabha MP, have signed a joint statement expressing deep apprehensions on long-term implications of the recent Supreme Court judgement upholding amendments to PMLA,2002 and called for its review. The statement: pic.twitter.com/vmhtxRHAnl — Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2022 ఇదీ చదవండి: Yes Bank DHFL Scam: ముంబై బిల్డర్స్‌కు చెందిన రూ.415 కోట్ల ఆస్తులు సీజ్! -
నిఘాపై అట్టుడికిన రాజ్యసభ
న్యూఢిల్లీ: కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులకు అధికారాలిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 2.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కంప్యూటర్ సమాచారంపై నిఘా అంశాన్ని లేవనెత్తారు. దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి తుదిరూపు దిద్దుకుందని ఆయన ఆరోపించారు. వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన నిబంధనలపైనే దొంగ ఏడుపు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, రానురాను పోలీసుల రాజ్యంగా మారుతోందని మండిపడ్డారు. ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా జాతీయ భద్రత, రక్షణ అనే పదం లేదని ఆజాద్ పేర్కొన్నారు. కావేరీ సమస్యపై రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగకపోవడం దారుణం అని ఆజాద్ పేర్కొన్నారు. స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా చూసే బాధ్యత వారిపై ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. కాగా, శుక్రవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే రఫేల్ వివాదంపై కాంగ్రెస్, కావేరీ డ్యాం వివాదంపై అన్నా డీఎంకే పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. ఇకపై లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎంపీలు ఆటోమేటిక్‌గా సస్పెండ్ కానున్నారు. ఉద్దేశపూర్వకంగా వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేపట్టే ఎంపీలపై ఆటోమేటిక్‌గా వేటు పడేలా నిబంధనను సవరించాలని నిబంధనల కమిటీ సిఫార్సు చేసింది. -
కూటమి తప్పదా?
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా నిలిచిన పీటీఐ మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచింది. శుక్రవారం రాత్రి వరకు అధికారికంగా వెల్లడైన 265 స్థానాల ఫలితాల్లో పీటీఐ 118 చోట్ల విజయం సాధించగా.. మరో రెండుచోట్ల ఆధిక్యంలో ఉంది. పీఎంఎల్ ఎన్ 62 స్థానాల్లో, పీపీపీ 43 చోట్ల గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థులు 12 చోట్ల గెలిచారని ఎన్నికల సంఘం వెల్లడించింది. మతతత్వ పార్టీల కూటమి అయిన ఎంఎంఏపీ 11 స్థానాల్లో గెలవగా.. ఎంక్యూఎం 4 చోట్ల గెలిచింది. గెలిచిన ఎంపీ సీట్ల ఆధారంగా మహిళలు, మైనారిటీ సభ్యుల కోటాలో పీటీఐ ఖాతాలోకి మరో 34–35 స్థానాలు దక్కనున్నాయి. మొత్తంగా కలుపుకుంటే పార్లమెంటులో పీటీఐ ఎంపీ సీట్ల సంఖ్య 160 వరకు ఉంటుందని అంచనా. ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మొత్తం 172 స్థానాలు అవసరం. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం పీటీఐ ముఖ్యనేతలతో ఇస్లామా బాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై వీరితో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు దక్కుతుందని, ఆందోళన అవసరం లేదని ఆయన పార్టీ నేతలతో దీమా వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్‌కు వీవీఐపీ ప్రొటోకాల్‌ను అమల్లోకి తెచ్చారు.మరోవైపు, పాక్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. పారదర్శకత లేని ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాతీర్పును ప్రతిబింబించడం లేదని అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించబోమని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో పీటీఐ నవాజ్ షరీఫ్ కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులో తొలిసారిగా పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. 297 అసెంబ్లీ స్థానాల్లో పీఎంఎల్ఎన్ 127 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. 117 స్థానాలు గెలిచిన పీటీఐ.. స్వతంత్రుల (27 సీట్లు)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అటు 140 సీట్లున్న సింధ్ ప్రావిన్స్‌లో 72 చోట్ల గెలిచిన పీపీపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇక్కడ పీటీఐ 20 చోట్ల గెలిచింది. అటు, 99 స్థానాలున్న ఖైబర్–ఫక్తున్ఖ్వా అసెంబ్లీలో పీటీఐ 66 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. బెలూచిస్తాన్ అసెంబ్లీలో 51 స్థానాలుండగా.. కొత్తగా ఏర్పాటైన బెలూచిస్తాన్ అవామీ 13 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. రాజకీయ అస్థిరతపై ఆందోళన పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరు ఫలితాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ దేశ తదుపరి ముఖచిత్రంలో అస్థిరత తప్పదని పాక్ రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు, ముఖ్యనేతలంతా వారి కంచుకోటల్లో ఓడిపోవడం వంటి కారణాలతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు. ప్రజల్లో పీటీఐ పట్ల సానుభూతి లేనప్పటికీ ఈ ఫలితాలు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ రాజకీయాల్లో వచ్చే కొద్ది రోజులు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి’ అని పాక్ రాజకీయ నిపుణుడు ఒమైర్ అలావీ పేర్కొన్నారు. కుట్ర జరిగింది: విపక్షాలు పార్లమెంటులో 68 స్థానాలు గెలవడం, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో 122 స్థానాల్లో గెలవడం తమ పార్టీపై జరిగిన కుట్రేనని పీఎంఎల్–ఎన్ ఆరోపిస్తోంది. అటు పీపీపీ కూడా తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా ఓడిపోయామని.. ఏకంగా పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో కంచుకోట అయిన కరాచీలో ఓడిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలను హైజాక్ చేశారని.. ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ గెలవలేదని.. ఆయన్ను కొందరు (ఆర్మీ, ఎన్నికల సంఘం పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ) గెలిపించారన్నారు. తొలి హిందూ ఎంపీ పాకిస్తాన్లో తొలిసారిగా ఓ హిందువు ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్‌లోని థార్పార్కర్–2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. హిందు రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003–08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు. -
పుతిన్ నాలుగోసారి..
మాస్కో: రష్యాపై సంపూర్ణమైన పట్టు పెంచుకున్న వ్లాదిమిర్ పుతిన్ (65) మరో ఆరేళ్లపాటు అధ్యక్షబాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం నాలుగోసారి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి మార్చిలో రష్యాలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 77 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 2024 వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. దీటైన ప్రత్యర్థి, విపక్షనేత నావన్లీపై అవినీతి ఆరోపణలు మోపటం ద్వారా ఎన్నికల బరిలో దిగకుండా చేయటంతో.. పుతిన్ ఎన్నిక ఏకపక్షమైంది. 1999 నుంచి రష్యా రాజకీయాలను పుతిన్ నియంత్రిస్తున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువకాలం రష్యా అధ్యక్షుడిగా ఉన్న రికార్డును తనపేర రాసుకునే దిశగా దూసుకెళ్తున్నారు. నా బాధ్యత పెరిగింది దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. ‘రష్యా వర్తమానం, భవిష్యత్తు కోసం ఏదైనా చేయటం నా బాధ్యత. నా జీవిత లక్ష్యం కూడా. నాపై నమ్మకంతో విజయాన్నందించిన రష్యన్లకు కృతజ్ఞతలు. దీంతో మన దేశ గౌరవం పెరిగింది. దేశాభివృద్ధిలో నా బాధ్యత మరింత పెరిగిందని బలంగా విశ్వసిస్తున్నాను. దేశాధ్యక్షుడిగా రష్యా కీర్తి, బలం, సుసంపన్నత రెట్టింపయ్యేలా చిత్తశుద్ధితో పనిచేస్తాను’ అని రష్యా రాజ్యాంగంపై పుతిన్ ప్రమాణం చేశారు. క్రెమ్లిన్ పాలెస్ కాంప్లెక్స్‌లోని ఆర్నెట్ ఆండ్రియేవ్ హాల్లో ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. విపక్షాల ఆందోళనలు పుతిన్ విజయంపై విపక్ష నేత అలెక్సీ నావన్లీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో నావన్లీ సహా దేశవ్యాప్తంగా 1600 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను యూరోపియన్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. -
కొద్దిసేపు చర్చ.. ఆపై రసాభాస
న్యూఢిల్లీ: గత మూడు రోజులకు భిన్నంగా పార్లమెంటు ఉభయ సభల్లో గురువారం కొద్ది సేపు ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఏకతాటిపై నిలిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై సభ్యులు తమ వాణి వినిపించారు. లైంగిక దాడుల పట్ల ప్రతిపక్షం ఆందోళన రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే.. మహిళల అంశాలపై దాదాపు గంటపాటు చర్చ సాగింది. మహిళలపై పెరుగుతున్న నేరాల పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు.. మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా ఆమోదం పొందేలా చూడాలని కోరారు. చర్చను చైర్మన్ వెంకయ్య ప్రారంభిస్తూ.. ‘ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు.. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో రిజర్వేషన్లతో పాటు దేశం వేగంగా పురోగమించేందుకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది’ అని అన్నారు. అనంతరం వివిధ పార్టీల మహిళా ఎంపీలు ప్రసంగించారు. ప్రధాని సమాధానానికి కాంగ్రెస్ పట్టు అనంతరం చర్చ పూర్తి కాగానే విపక్షాలు నిరసన కొనసాగించాయి. బ్యాంకింగ్ కుంభకోణాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభను హోరెత్తించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రతిపక్షాల తీరుపై వెంకయ్య∙అసహనం వ్యక్తం చేస్తూ.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేశారు. అనంతరం సమావేశమయ్యాక బ్యాంకింగ్ కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోరుతూ కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలతో పాటు ఇతర అంశాలపై ప్రాంతీయ పార్టీలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ శుక్రవారానికి వాయిదా వేశారు. రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే స్పీకర్ మహాజన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ..రెట్టించిన శక్తి, ఆత్మ విశ్వాసంతో మహిళలు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారత ఎంతో అవసరమని... అయితే దాన్ని సాధించడమే అతి పెద్ద సవాలన్నారు. స్పీకర్ ప్రసంగం ముగియగానే.. విపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన కొనసాగించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీ ఎంపీల ఆందోళన కొనసాగించడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం సభ మళ్లీ సమావేశమైనా.. అదే పరిస్థితి ఉండడంతో శుక్రవారానికి వాయిదా పడింది. -
చక్కర్లు కొట్టిన మమత విమానం
పట్నా నుంచి కోల్‌కతా వస్తుండగా ఘటన ► ఇంధనం అయిపోతోందన్నా ల్యాండింగ్‌కు అనుమతి జాప్యం ►మమత భద్రతపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు 15 నిమిషాలు ఆలస్యంగా అనుమతివ్వడం కలకలం రేపింది. బిహార్‌లో బుధవారం ఓ ర్యాలీలో పాల్గొన్న మమత సాయంత్రం 7.30కు పట్నా నుంచి ఇండిగో విమానంలో తిరుగుపయనమయ్యారు. కోల్‌కతాకు 200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడే.. ల్యాండింగ్ వరుసలో మమత విమానం 8వ స్థానంలో ఉందని ఏటీసీ నుంచి పైలట్‌కు సందేశం వచ్చింది. అయితే ఈ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని, అత్యవసరంగా ల్యాండింగ్‌కు అవకాశం ఇవ్వాలని పైలట్ తెలపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే మరో మూడు విమానాలు ఇంధనం తక్కువుందని చెప్పటంతో 15 నిమిషాల తర్వాత మమత విమానానికి ఏటీసీ క్లియరెన్సు ఇచ్చింది. అయితే నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతను మట్టుబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందనే అనుమానాన్ని ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు లేవనెత్తారు. కాగా ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. మమత ప్రయాణించిన ఇండిగో తోపాటు మరో రెండు విమానాల్లోనూ ఇంధన కొరత ఏర్పడినట్లు సమాచారం వచ్చిందని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటుకు తెలిపారు. మమత విమానం క్షేమంగానే ల్యాండ్ అయిందన్నారు. 3 విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కోరటంతోనే మమత విమానం రావటం 13 నిమిషాలు ఆలస్యమైందని మంత్రి తెలిపారు. ఈ వివాదంపై డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపింది.