Opposition demand
-
పార్లమెంట్లో మణిపూర్ మంటలు
-
పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా
న్యూఢిల్లీ: సరిహద్దులో భారత్, చైనా జవాన్ల ఘర్షణ, చైనా దురాక్రమణ గురించి పార్లమెంట్లో చర్చించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. లోక్‌సభలో గురువారం సైతం ఇదే అంశాన్ని విపక్ష సభ్యులు లేవనెత్తారు. సభలో ఇతర వ్యవహారాలను పక్కనపెట్టి, చైనా ఆగడాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి, సమాధానం చెప్పాలని, నిరంకుత్వం చెల్లదని నినాదాలు చేశారు. చర్చకు సభాపతి నిరాకరించడంతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఐదుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లోక్‌సభను ఒకేరోజు ఐదుసార్లు వాయిదా ఇదే మొదటిసారి. విపక్షాల నినాదాల హోరు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర వాణిజ్యమంత్రి గోయల్ ‘జన విశ్వాస్ (సవరణ) బిల్లు–2022’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపాలని సిఫార్సు చేశారు. విపక్షాల ఆందోళన కారణంగా సభా వ్యవహారాలేవీ సాగలేదు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినా కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు వినిపించుకోలేదు. సరిహద్దులో ఘర్షణపై చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేస్తున్న సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. చైనా దురాక్రమణపై చర్చించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు బహిష్కరించిన విపక్షాలు సరిహద్దు అంశంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ విపక్షాలన్నీ గురువారం రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాయి. తొలుత ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవద్దంటూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. అయినా నినాదాలు ఆపలేదు. సరిహద్దు వ్యవహారంపై చర్చకు చైర్మన్ అంగీకరించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్పారు. -
పార్లమెంట్లో ఆగని అలజడి
న్యూఢిల్లీ: పెగసస్ నిఘా వ్యవహారంపై సభలో చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని, వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించాయి. వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో పలుమార్లు సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. విపక్షాల నిరసన కొనసాగుతుండగానే లోక్‌సభలో ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు–2021, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లు–2021ను ఆమోదించారు. సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తానని, ప్రతిపక్ష సభ్యులు శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఓంబిర్లా పదేపదే కోరినప్పటికీ వారు లెక్కచేయలేదు. దీంతో స్పీకర్ సాయంత్రం 4 గంటల సమయాని కల్లా మూడుసార్లు సభను వాయిదా వేశారు. అంతకు ముందు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి చేరుకున్నారు. నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయం, రైతుల సంక్షేమంపై కేంద్ర వ్యవసాయ మంత్రిని ప్రశ్నలు అడగాలని స్పీకర్ ఓంబిర్లా సూచించినప్పటికీ వారు నినాదాలు ఆపలేదు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. రాజ్యసభ పలుమార్లు వాయిదా పెగసస్, కొత్త సాగు చట్టాలు తదితర అంశాలపై చర్చ చేపట్టాల్సిందేనని రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నినాదాలు చేస్తూ సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభను చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పలుమార్లు వాయిదా వేశారు. ప్రతిపక్షాల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల సమయం పూర్తయింది. బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతకర వ్యాఖ్యలను మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తప్పుపట్టారు. పార్లమెంట్లో బిల్లులను ఆమోదిస్తున్నారా? లేక పాప్డీ చాట్ తయారు చేస్తున్నారా?అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సభ సజావుగా సాగాలని రాజ్యసభలో మెజార్టీ సభ్యులు కోరుకుంటున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రతిపక్షాలు నిర్దేశించలేవని స్పష్టం చేశారు. -
సాధ్వి రాజీనామా చేయాల్సిందే
* పార్లమెంటులో విపక్షాల నిరసన * నినాదాలతో బుధవారం కూడా దద్దరిల్లిన ఉభయ సభలు * ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం * కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాల వాకౌట్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి రాజీనామా చేయాల్సిందేనని పార్లమెంటులో విపక్షాలు పట్టుబట్టాయి. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు, నినాదాలతో బుధవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లాయి. సాధ్వి రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆమె క్షమాపణ చెప్పినందున రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక సభలో సాధ్వి మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది రాముడి సంతానమా? లేక అక్రమ సంతానమా? అన్నది తేల్చాల్సింది మీరే..’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై నిరసన వెల్లువెత్తడంతో సాధ్వి మంగళవారం లోక్‌సభలో క్షమాపణ చెప్పారు. అయినా విపక్షాలు తమ పట్టు వీడలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కాగానే... ఇరు సభల్లో ప్రతిపక్షాల సభ్యులు మళ్లీ నిరసన ప్రారంభించారు. తొలుత లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెకు పదవిలో కొనసాగే అర్హత లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మిగతా కాంగ్రెస్ సభ్యులు, తృణమూల్, సమాజ్‌వాదీ, ఆమ్ఆద్మీ తదితర పార్టీల సభ్యులు జత కలిశారు. సాధ్విని మంత్రిగా కొనసాగించడంలో అర్థం లేదని.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ.. రికార్డులను పరిశీలిస్తే చాలా మంది సభ్యులు తమ వ్యక్తిగత జీవితంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతోందన్నారు. సభ కొనసాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా విపక్షాలు శాంతించలేదు. దీనిపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలన్న విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించడంతో... కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, ఎన్సీపీ, ఏఏపీ, ఆర్ఎస్పీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సాధ్వి వ్యాఖ్యల అంశంపై రాజ్యసభలోనూ విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. ఆమె రాజీనామా డిమాండ్‌తో సభను హోరెత్తించాయి. ప్రధాని వివరణకు పట్టుపట్టడంతో సభ ఆరుసార్లు వాయిదా పడింది. దేశం కోసమే మోదీ విదేశీ పర్యటనలు అంతర్జాతీయ సంబంధాలను పునర్నిర్మించుకోవాలన్న సంకల్పంతో, కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకుంటూ విదేశాంగ విధానంలో ప్రభుత్వం శరవేగంతో దూసుకుపోతోందని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సురక్షిత, సుస్థిర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు దోహదపడ్తాయన్నారు. వ్యవహారం ముగిసిపోయింది ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఒక కేంద్ర మంత్రి వాజ్‌పేయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ క్షమాపణ చెప్పిన అంశాన్ని, తృణమూల్ ఎంపీ తపస్‌పాల్ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని గుర్తుచేసి... ఆయా పార్టీలు కొంత వెనక్కితగ్గేలా చేయగలిగారు. సాధ్వి క్షమాపణ చెప్పినందున ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోయిందని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. 520 మంది ఉన్న సభపై 20 మంది ప్రతిపక్ష సభ్యులు వారి ఇష్టాన్ని రుద్దాలని చూస్తే మిగతా సభ్యులు ఊరుకోబోరన్నారు.