Organic sweets
-
అమ్మ చేతి తీపి రుచి
పిల్లల బాధ్యతలు తీరాక అమ్మలకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అది బాగా డబ్బు ఉన్నవారికైనా, మధ్యతరగతి జీవితంతో నెట్టుకొస్తున్నవారికైనా. ఆ విశ్రాంత సమయాన్ని కొందరు మాత్రం ఉపయుక్తంగా, తమ కలలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తుంటారు. వారిలో నీలూ భండారి ఒకరు. 64 ఏళ్ల వయసులో ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో ఆర్గానిక్ స్వీట్లు తయారుచేస్తూ దేశ విదేశాల నుంచి ఆర్డర్లు పొందుతూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం నీలూ భండారీ స్వీట్లు అంటే మక్కువ చూపుతుంటారు. ఐదేళ్లుగా ఆమె చేస్తున్న స్వీట్ జర్నీ గురించి అంతే స్వీట్‌గా చెప్పుకోవచ్చు. స్వీట్లు తయారుచేసే సమయంలో నీలూ భండారీని చూస్తే ఆమె మోముపై ఓ మెరుపు ఉంటుంది. ఆమె పెదవులు దైవ నామం జపిస్తూ ఉంటాయి. స్వీట్ల ద్వారా ఎంతో మందికి చేరవయ్యే అవకాశం ఆ భగవంతుడే తనకు కల్పించాడని, ఆ విధంగా తాను దైవానికి దగ్గరవుతున్నాను అని ఆమె నమ్ముతారు. కమ్మని వాసనల వంటకాలు ‘పిల్లలు బేకరీలలో లభించే జంక్ ఫుడ్‌ని ఇష్టపడుతుంటారు. కానీ, ఆ ఆహారం వల్ల వారి శరీరం బోలుగా తయారవుతుంది. ఊబకాయం వంటి సాధారణ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ఏ వ్యాధి అయినా వారిని సులభంగా చుట్టుముంటే అవకాశం ఉంది. పిల్లల ముందు పాలు, జున్ను, దేశీ ఆవు నెయ్యి.. గురించి మాట్లాడితే వారు ముఖముఖాలు చూసుకుంటారు. అలాంటి పదార్థాల గురించి ఈ తరం వారికి తెలియనే తెలియవు. అదే మన చిన్ననాటి రోజుల్లో చలికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో అవిసె గింజలు, నువ్వులు, శనగపిండితో చేసిన కమ్మని వంటకాల వాసన వస్తుండేది’ అని చెప్పే నీలూ భండారి ఐదేళ్లుగా తన చేత్తో తయారు చేసిన స్వీట్ల వ్యాపారాన్ని ఆమె వృత్తిగా చేసుకున్నారు. ఆ స్వీట్లకు మన దేశంలోనే కాదు విదేశాలలోనూ మంచి డిమాండ్ ఉంది. చక్కెర, నెయ్యి లేకుండా స్వీట్లు! చక్కెర లేని, నెయ్యి లేని స్వీట్లను నీలూ స్నేహితులు రుచి చూసి తమ కోసమూ వాటిని అడిగి మరీ చేయించుకునేవారు. దీంతో ఆమె ఎక్కువ మొత్తంలో అలాంటి స్వీట్లు తయారుచేసి వారి కోసం ప్రదర్శన ఏర్పాటు చేసేది. స్నేహితులు, బంధువులు ఆ ప్రదర్శనలో పాల్గోవడమే కాదు, ఆర్గానిక్ స్వీట్ల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. బయట నుంచి కూడా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. డిమాండ్ పెరగడంతో ఆమె ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో స్వీట్ల తయారీని పెంచింది. సెలబ్రిటీలకు చేరువ ఆమె చేతితో తయారు చేసిన శుభ్రమైన స్వీట్లు బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జస్పిందర్ నరులా, కర్మవీర్ వోహ్రా, సుప్రియా, అబూ సూఫీ.. తదితరులు ఇష్టపడి మరీ ఆర్డర్ల మీద తెప్పించుకుంటారు. మన దేశంలోనే కాకుండా వర్జీనియా, ఫ్లోరిడా, కెనడా, ఆస్ట్రేలియా, పారిస్, జర్మనీ నుండి కూడా నీలూ భండారీ స్వీట్లను ఆర్డర్ల మీద తెప్పించుకుంటున్నారు. -
ఆర్గానిక్ స్వీట్స్
తీపి... శుభారంభానికి ప్రతీక. ఆ శుభారంభం ఆరోగ్యవంతమైనదిగా ఉండాలనుకుంటున్నారు హైదరాబాదీలు. ధర కొంచెం ఎక్కువైనా పర్లేదు.. రసాయనాలు, పురుగులమందుల అవశేషాలు లేని ప్యూర్ స్వీట్స్కే మా ప్రయారిటీ అంటున్నారు. అందుకే ఆర్గానిక్ స్వీట్స్‌కి డిమాండ్ పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే నగరంలో ఆర్గానిక్ స్వీట్ షాప్స్ వెలుస్తున్నాయి. - కోన సుధాకర్‌రెడ్డి కూరగాయలే కాదు... స్వీట్స్ కూడా ఆర్గానిక్ కావాలని కోరుకుంటున్నారు హైదరాబాదీలు. అందుకే ఇలాంటి స్వీట్స్ అందించేందుకు కొత్తగా పుట్టుకొస్తున్నాయి సరికొత్త షాపులు. 150కి పైగా.. 150 నుంచి 200 రకాల మిఠాయిలు ఆయా ఆర్గానిక్ స్వీట్ షాపుల్లో దొరుకుతాయి. గోందు కతేరం పానీయం, సబ్జ, మజ్జిగ, బాదంపాలు, మోతీచూర్ లడ్డు, కాజు కతిలి, వైట్ కలాకండ్, రస్మలైతో పాటు, బెల్లం, ఆర్గానిక్ నూనెలతో ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమే... కతేరా గోందు చెట్టుకు సంబంధించిన బంకను వేడి నీటిలో మరిగిస్తే జెల్ వస్తుంది. మరిగించిన సుగంధపాల వేర్ల రసాన్ని ఇందులో కలిపితే గోందు కతేరం పానీయం తయారవుతుంది. ఇది శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇక ఒక రకమైన తులసి విత్తనాలు బెల్లం నీళ్లల్లో నానబెట్టి సబ్జ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. శెనగ పిండి , రసాయనాలు లేని బెల్లంతో మోతి చూర్ లడ్డూ చేస్తారు. బాదం ఉడికించి పొట్టు తీసి, వేడి పాలల్లో కలిపి బాదంపాలు చేస్తారు. నేచురల్ కలర్స్.. కెమికల్స్‌తో తయారు చేసిన పర్మినెంట్ కలర్స్‌కు చోటు లేదిక్కడ. కాశ్మీర్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమ పువ్వుతో కేసరి కలర్ తయారు చేస్తుంటారు. అలాగే మిగతా రంగులు కూడా. మిఠాయిలపై ఉపయోగించే వెండి అద్దకం ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన పిండి పదార్థాలనే స్వీట్లల్లో వినియోగిస్తారు. కాగితంతో తయారు చేసిన క్యారీ బ్యాగులు, ఆకు దొన్నె కవర్లు మాత్రమే వాడతారు. సుభాష్ పాలేకర్ పద్ధతిలో.. ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త సుభాష్ పాలేకర్ సూచించిన పద్ధతిలో తయారు చేసిన బెల్లాన్ని మాత్రమే ఈ స్వీట్స్‌లో వాడతారు. గానుగ ద్వారా తీసిన పప్పు, నువ్వులు, కొబ్బరి నూనె తోనే స్వీట్స్ తయారు చేస్తారు. కనిపించేవన్నీ మంచివి కావు... కంటికి మంచిగా కనపడే స్వీట్స్ కొనే పద్ధతి నుంచి ప్రజలు బయటపడాలి. సిటీలో ఆర్గానిక్ స్వీట్ షాపులు చాలా ఉన్నాయి. అయితే అందరికంటే ముందే 1999లో మేము ఆర్గానిక్ స్వీట్ షాపు ప్రారంభించాము. 15 ఎకరాల్లో 60 దేశీయ ఆవులతో సౌభాగ్య గో సదన్ ఏర్పాటు చేశాం. మిఠాయిలకు అవసరమయ్యే పదార్థాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అక్కడ పండిస్తాం. వినియోగదారుల అభిరుచిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఆర్గానిక్ స్వీట్స్దే హవా! - విజయరాం, ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఓనర్