organs donated
-
అవయవదానాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది : మంత్రి హరీష్ రావు
-
అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం
న్యూఢిల్లీ: గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (GODT)ప్రకారం, అవయవదానంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు 12వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఉద్దేశించి ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ... " "జీతే జీ రక్తదాన్, మర్నే కే బాద్ అంగదాన్(ప్రత్యక్ష రక్తదానం, మరణానంతరం అవయవ దానం)" అనేది మన జీవితానికి నినాదంగా ఉండాలి. అంతేకాదు మన సంస్కృతి "శుభ్", "లాభ్" లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది. (చదవండి: కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి) పైగా ఇక్కడ వ్యక్తిగత శ్రేయస్సు అనేది సమాజ శ్రేయస్సుతో మిళతమవుతోంది. అయితే 2010 నుంచి చనిపోయిన దాతలు, వారి కుటుంబాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకోవాడానికే ప్రతి ఏడాది భారతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాదు 2012-13తో పోలిస్తే అవయవదానం రేటు నాలుగు రెట్లు పెరిగింది. ఈ మేరకు దేశంలో సంవత్సరానికి జరిగే అవయవ మార్పిడిల సంఖ్య 2013లో 4990 ఉండగా 2019కి వచ్చేటప్పటికీ ఆ సంఖ్య 12746కి పెరిగింది. అయితే భారత్ ఇప్పుడు యూఎస్ఏ, చైనా తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుని ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఈ క్రమంలో ప్రజలు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, దేశంలో మార్పిడికి అందుబాటులో ఉన్న అవయవాల కొరతపై ప్రచారం చేసి, ఇతరులు కూడా అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేయాలి" అని ఆరోగ్య మంత్రి మాండవియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఏడాదిగా షాప్‌కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) -
ఆమె త్యాగం.. ‘సజీవం’
ముస్తాబాద్ (సిరిసిల్ల): తాను మరణించినా మరో నలుగురికి ప్రాణదానం చేశారా మానవతామూర్తి. కలకాలం తోడూనీడగా ఉంటుందనుకున్న భార్య.. అనూహ్య రీతిలో బ్రెయిన్‌డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసి త్యాగనిరతిని ప్రదర్శించారు భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన ఎరవెల్లి వినిల్ – సరిత దంపతులు. వినిల్ హైదరాబాద్‌లో దంత వైద్యుడిగా వైద్యసేవలు అందిస్తున్నారు. రెండురోజుల క్రితం సరిత అధిక రక్తపోటుకు గురై ఇంట్లో కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తనాళాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు సరిత బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు తేల్చారు. తన భార్యను రక్షించుకోలేక పోయా మని భర్త వినిల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక వైద్యుడిగా అంతకు మించి మానవతావాదిగా ఆలోచించిన భర్త వినిల్.. బ్రెయిన్‌డెడ్ అయిన భార్య సరిత అవయవాల దానానికి అంగీకరించారు. శుక్రవారం సరిత గుండె, కాలేయం, కార్నియా, మూత్ర పిండాలను వైద్యులు సేకరించారు. హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో గుండె అవసరమున్న ఓ యువతికి ఆ గుండెను అమర్చేందుకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి 5 కి.మీ. దూరంలోని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి సరిత గుండెను పది నిమిషాల్లో తరలించారు. 18 ఏళ్ల యువతికి గుండెను అమర్చారు. అలాగే సరిత మూత్ర పిండాలు, కార్నియా, కాలేయం మరో ముగ్గురికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిత మరణించినా ఆమె నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. సరిత స్వగ్రామం పోత్గల్‌లో ఆమె త్యాగాన్ని గ్రామస్తులు స్మరించుకుంటున్నారు. భర్త వినిల్ మానవతావాదిగా.. నాలుగు కుటుంబాలకు జీవితాన్ని ఇచి్చన వ్యక్తిగా అభినందిస్తున్నారు. -
మృత్యుంజయుడు!
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన నందిగామ పట్టణానికి చెందిన జగదీష్ అనే యువకుడు అవయవ దానం ద్వారా పలువురికి ప్రాణ దాత అయ్యాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారిన కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదిస్తూనే... తనలా మరి కొంత మంది కడుపు కోతతో బాధపడకూడదనే లక్ష్యంతో జగదీష్ అవయవాలు దానం చేసేందుకు తల్లి ఒప్పుకుంది. కృష్ణాజిల్లా, నందిగామ : పది మంది మేలు కోరేవాడు... పది మందికి మంచి చేసేవాడు మహాత్ముడైతే... తను చనిపోతూ.. పదిమందికి ప్రాణ దానం చేసేవాడు దేవుడే. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన నందిగామ పట్టణానికి చెందిన ఓ యువకుడు అవయవ దానంతో పలువురికి ప్రాణ దాత అయ్యాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడాన్ని చూసి గుండెలవిసేలా రోది స్తూనే... తనలా మరి కొంత మంది కడుపు కోతతో బాధపడకూడదన్న లక్ష్యంతో దుఃఖాన్ని దిగమింగుకొని తన బిడ్డ అవయ దానానికి అంగీకరించిన ఆ మాతృమూర్తి త్యాగం వేనోళ్ల కీర్తించదగిం ది. మూడేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన ఆమెకు తానున్నానంటూ ధైర్యం చెప్పి, కుటుంబ భారా న్ని తన భుజ స్కంథాలపై మోస్తూ, కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కుమారుడిపై విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో విగత జీవిని చేసింది. తనవృత్తి, తన ఇల్లు తప్ప బయటి ప్రపంచం గురిం చి ఏమీ తెలియని ఆ యువకుడు ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు... ఒక్క ముక్కలో చెప్పాలంటే, అతని అవయవాల ద్వారా పునర్జన్మ పొందిన వారికి దేవుడయ్యాడు. ఈ అమ్మకు శోకం...ఆ తల్లులకు ఆనందం! నందిగామ పట్టణానికి చెందిన పింగళి జగదీష్ (22) నందిగామ పట్టణంలోని ఓ ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసేవాడు. నిరుపేద కుటుంబం కావడంతో అతి తక్కువ వయస్సు నుంచే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేసే జగదీష్ తండ్రి నాగశేషు మూడేళ్ల క్రితం గుండెపోటుతో కన్ను మూశాడు. దీంతో జగదీష్ బాధ్యతలు మరింత పెరిగాయి. ఉన్నంతలో తల్లిని సంతో షంగా చూసుకునేవాడు. అంతా సవ్యంగా సాగి పోతుందనుకున్న సమయంలో విధి వారిపై పగబట్టింది. విధి నిర్వహణలో భాగంగా ఇబ్రహీంపట్నం వెళ్లి వస్తూ, ఈ నెల 1న కంచికచర్ల మం డల పరిధిలోని పరిటాల వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయవాడ మణిపాల్ హాస్పటల్లో చేర్పించగా, బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో ఆ తల్లి గుండె ఒక్కసారిగా తల్లడిల్లిపోయిం ది. అయితే, అంత దుఃఖం, బాధలోనూ, సన్ని హితులు ఇచ్చిన సలహాతో తన బాధను దిగమింగుకుంటూ, తన బిడ్డ మరి కొందరు రూపంలో జీవించే ఉంటాడన్న ఆలోచనతోపాటు తన లాంటి కొందరు మాతృమూర్తుల గర్భశోకాన్ని తీర్చగలుగుతానన్న సంతృప్తితో జగదీష్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించింది. దీంతో శుక్రవారం జగదీష్ అవయవాలను మణిపాల్ ఆస్పత్రి నుంచే పలువురికి అమర్చేందుకు తరలించారు. -
మరణంలోనూ.. జీవం
నల్లగొండ, మిర్యాలగూడ రూరల్ : ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. పొంగివచ్చే దుఃఖాన్ని దిగమింగారు ఆ తల్లిదండ్రులు.. కొడుకు ఎలాగూ బతకడని.. తన కుమారుడి అవయవాలు ఇతరులకు దానంచేసి.. వారికి జీవితాన్ని ప్రసాదించాలని తలచారు. వివరాల్లోకి వెళ్తే.. మండలం పరిధిలోని గోగువారిగూడెం గ్రామానికి చెందిన ఊట్ల పూర్ణచందర్రావు, అరుణ దంపతులకు కొడుకు, కూతురు. కొడుకు ఊట్ల సందీప్(22)ఈ నెల 23న బైకుపై వస్తూ మిర్యాలగూడ వస్తుండగా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఏడుకోట్లతండా వద్ద అదుపుతప్పి బైక్‌ను డివైడర్‌కు ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమితం హైదరాబాద్ తరలించారు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డైడ్ అయినట్లు చెప్పారు. కుమారుడు బతకడం కష్టమని.. ఇదే సమయంలో ఆయన అవయవాలు దానం చేస్తే మరొకరికి ప్రాణదాతగా మీ కొడుకు మిగిలిపోతాడని వైద్యులు వివరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖం దిగమింగుకుని కొడుకు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. -
చిరంజీవి.. ఈ శ్రీమన్నారాయణుడు
♦ తాను మరణించి మరో నలుగురికి జీవితాన్నిచ్చి.. ♦ బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కిడ్నీ, లివర్, కళ్లు సేకరణ సాక్షి, బెంగళూరు: మరణంలోనూ మరో నలుగురికి జీవం పోసి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు మైసూరుకు చెందిన శ్రీమన్నారాయణ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీమన్నారయణ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అవయవాలను బెంగళూరుకు తరలించి, అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో మరణం తర్వాత కూడా మరో నలుగురికి శ్రీమన్నారాయణ జీవం పోసినట్లైంది. వివరాలు.....మైసూరుకు చెందిన శ్రీమన్నారయణ(38) కోళ్ల ఫారమ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 3న కోళ్లు ఉన్న వ్యాన్‌లో మైసూరు ప్రధాన రహదారిపై వెళుతుండగా, వాహనం ఆగిపోవడంతో డ్రైవర్ మరమ్మత్తు చేస్తున్నారు. దీంతో శ్రీమన్నారాయణ కూడా కిందకు దిగాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో శ్రీమన్నారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే శనివారం ఉదయం శ్రీమన్నారాయణ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. శ్రీమన్నారాయణ అవయవాలను దానం చేయాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులను వైద్యులు కోరారు. ఇందుకు వారు అంగీకరించడంతో శ్రీమన్నారాయణ గుండె, కిడ్నీ, లివర్, రెండు కళ్లను సేకరించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు..... ఇక మైసూరు నుంచి అత్యంత వేగంగా బెంగళూరులోని ఆస్పత్రులకు ఈ అవయవాలను చేర్చేందుకు మైసూరు, బెంగళూరు పోలీసులు మైసూరు నుంచి బెంగళూరు వరకు జీరో ట్రాఫిక్(గ్రీన్ కారిడార్) మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో సాధారణంగా నాలుగు గంటల సమయం పడుతుండగా గ్రీన్ కారిడార్ ఏర్పాటుతో గంటన్నర వ్యవధిలోనే ఆంబులెన్స్ బెంగళూరుకు చేరుకోగలిగింది. అనంతరం బెంగళూరులో ఆవశ్యకత ఉన్న వివిధ ఆస్పత్రులకు ఆయా అవయవాలను తరలించారు. -
బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
'నువ్వు మరణించినా.. నలుగురిని జీవింపజేయి' అనే అవయవదాన ప్రధాన ఉద్దేశాన్ని ఆ తల్లిదండ్రులు ఉన్నతంగా భావించారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాల్ని.. వాటి అవసరంతో అల్లాడుతున్నవారికి ఇచ్చేందుకు ముందుకొచ్చి అతణ్ని చిరంజీవిగా నిలబెట్టారు. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న అఖిల్ మధు సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. తల్లిదండ్రుల అంగీకారంతో అఖిల్ మధు గుండెను చెన్నైలోని ఓ వ్యక్తికి, కిడ్నీలను హైదరాబాద్ కు చెందిన ఇద్దరికి అమర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుండెను చెన్నై తరలించేందుకు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.