ornaments theft
-
ఆదిలాబాద్: చౌడేశ్వరి ఆలయంలో చోరి
-
ఆదిలాబాద్‌లో దొంగల బీభత్సం
సాక్షి, ఆదిలాబాద్ : ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆదిలాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నగరంలోని చౌడేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి కిరీటంతో సహా మెడలోని బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. అయితే ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల పనిగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. -
నగల దొంగలకు భారతీయ అమెరికన్లే లక్ష్యం!
వాషింగ్టన్: భారత సంతతి అమెరిక్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. భారతీయ అమెరికన్ల దగ్గర విలువైన ఆభరణాలు ఉండటంతో వాటిని దోచుకెళ్తున్నారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఓ హోటల్ నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్ కుటుంబం ఇంట్లో ఇటీవల భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు తమ విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయారని, దీని పట్ల అప్రమత్తంగా ఉండేట్లు హెచ్చరించాలని అక్కడి పోలీసులకు వెల్లడించారు. నార్వాక్ ప్రాంతంలోని భారత సంతతి అమెరికన్ కుటుంబానికి చెందిన ఇంట్లో రూ.14.72 లక్షల విలువైన ఇత్తడి ఆభరణాలు చోరీకి గురైనట్లు తమ నిఘాలో ఉన్న ఓ వీడియోను నార్వాక్ పోలీస్ విభాగం షేర్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అందుకు దొంగలు ఉపయోగించిన వాహనాన్ని నగరం వెలుపల స్వాధీనం చేసుకున్నారని, దాని లైసెన్స్ ప్లేట్ తొలగించి, వేలిముద్రలు కనిపించకుండా చేశారని వెల్లడించింది. భారతీయ అమెరికన్లు తమ ఆచారాలు, సంస్కృతికి అనుగుణంగా విలువైన ఆభరణాలు కలిగి ఉంటారనే భావనతో వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. -
శ్రీరంగనాథుడు నిలువు దోపిడీ
శ్రీరంగథామంలో చోరీ పది కిలోల వెండి ఆభరణాల అపహరణ రాజమహేంద్రవరం క్రైం : సాక్షాత్తూ శ్రీరంగనాథుడిని ఓ చోరుడు నిలువుదోపిడీ చేశాడు. స్థానిక ఇస్కా¯ŒS టెంపుల్ సమీపంలోని అవుట్ పోస్టు పోలీస్ స్టేష¯ŒS వద్ద ఉన్న శ్రీరంగథామంలో మంగళవారం అర్థరాత్రి 1.36 గంటల సమయంలో మూలవిరాట్‌కు అలంకరించిన వెండి వస్తువులన్నీ వలుచుకుపోయాడు. కిరీటం, కర్నాభరణాలు, వక్షస్థలం, పాదాలు, అభయ హస్తం, శఠగోపం తదితర పది కిలోల బరువైన వెండి వస్తువులను గుర్తు తెలియని ఆగంతకుడు ఎత్తుకుపోయాడు. ఆలయంలోని కిటికీ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి లోనికి ప్రవేశించిన ఆగంతకుడు మూడు సీసీ కెమెరాల్లో రెండింటిని తొలగించి, స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన వస్తువులు చోరీ చేశాడు. ఈ చోరీ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను మూడో సీసీ కెమేరా చిత్రీకరించింది. సంఘటనా స్థలాన్ని క్రైం డీఎస్పీ త్రినా«థరావు బుధవారం సందర్శించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన వెండి వస్తువుల విలువ సుమారు రూ.4 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేశారు. పథకం ప్రకారం చోరీ ముందుగా ఆలయాన్ని సందర్శించి, పక్కా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీసీ కెమెరాలను తొలగించడం, ముఖానికి ముసుగు ధరించి ఆధారాలు దొరక్కుండా చేతులకు గ్లౌజులు ధరించడాన్ని బట్టి ఆలయం గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నెలలో పెళ్లి.. ఎంత పని చేసింది!
చందాగనర్: అమ్మా.. అని పిలుస్తూనే వృద్ధురాలి నగలపై పనిమనిషి కన్నేసింది... అదను కోసం ఎదురు చూసింది.. అన్నం తింటున్న ఆమెపై దాడి చేసి కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతురాలి మెడలోని బంగారు నగలు, చేతి గాజులు తస్కరించింది. పోలీసులు పట్టుకోవడానికి రావడంతో కత్తితో పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన చందానగర్ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ తిరుపతిరావు కథనం ప్రకారం... శేరిలింగంపల్లి లక్ష్మీ విహార్ ఫేజ్ –2లో 95 నెంబర్ గల ఇంట్లో నివాసముండే శ్రీనివాస్, సునీత దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. శ్రీనివాస్ తల్లి ఉమాదేవి (65) ఇంట్లోనే ఉంటోంది. వీరి పక్కింటి పనిమనిషి వసుంధర లక్ష్మి(21) రోజూ ఉమాదేవిని అమ్మా.. అని పలకరిస్తూ కబుర్లు చెప్పేది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు కాజేయాలని ఆమె పథకం వేసింది. శుక్రవారం ఉదయం శ్రీనివాస్, సునీత దంపతులు ఆఫీసుకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమాదేవి మధ్యాహ్నం 1.50కి భోజనం చేస్తోంది. అదే సమయంలో పనిమనిషి తలుపు తట్టింది. ఉమాదేవి వెళ్లి తలుపు తీసి.. మళ్లీ అన్నం తింటోంది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అన్నం తింటున్న వృద్ధురాలిపై వసుంధర లక్ష్మి దాడి చేసి కత్తితో గొంతుకోసింది. వృద్ధురాలి అరుపులు విని 94 నెంబర్ ఇంట్లో ఉండే రామ్మోహన్ వచ్చి చూడగా ఇంటికి గడియపెట్టి ఉంది. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన వెంటనే పోలీసులకు, ఉమాదేవి కుమారుడు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వంటగదిలో వసుంధరలక్ష్మి తచ్చాడుతూ కనిపించింది. పోలీసులు ఇంట్లోకి వస్తే వారిపై చల్లేందుకు కారంపొడి పట్టుకొని కిటికీ వద్ద నిలుచుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ అనుమతితో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా వృద్ధురాలు ఉమాదేవి రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె మెడలోని నగలను, గాజులను కాజేసిన పనిమనిషి వసుంధరలక్ష్మి వాటిని దేవుడి గదిలో దాచింది. తన ను పట్టుకోవడానికి వస్తున్న పోలీసులను చూసి కూరగాయలు కోసే కత్తితో పొట్టలో పొడుచుకుంది. పోలీసులు అంబులెన్స్‌లో ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఉమాదేవి మృతి చెందింది. నిందితురాలు చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల్లో పెళ్లి .. లక్ష్మీ విహార్ ఇంటి నెం. 69లో ఉండే కర్నూలు జిల్లాకు చెందిన అనుపమ ఇంట్లో వసుంధరలక్ష్మి నాలుగేళ్లుగా పని చేస్తూ ఇక్కడే ఉంటోంది. నెల రోజుల్లో పెళ్లి చేస్తామని, తమ కూతురిని ఊరుకు పంపాలని అనుపమను వసుంధరలక్ష్మి తల్లి కోరగా.. తనకు పని మనిషి దొరకగానే పంపిస్తామని చెప్పింది. శుక్రవారం ఉదయం 8.30కి అనుపమ ఉద్యోగానికి వెళ్తూ కొత్త పనిమనిషి దొరికిందని, వారం రోజుల్లో నిన్ను మీ ఊరుకు పంపిస్తానని వసుంధర లక్ష్మికి తెలిపింది. అంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది.