
సాక్షి, ఆదిలాబాద్ : ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆదిలాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నగరంలోని చౌడేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి కిరీటంతో సహా మెడలోని బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. అయితే ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల పనిగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment