- శ్రీరంగథామంలో చోరీ
- పది కిలోల వెండి ఆభరణాల అపహరణ
శ్రీరంగనాథుడు నిలువు దోపిడీ
Published Wed, Jan 18 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
రాజమహేంద్రవరం క్రైం :
సాక్షాత్తూ శ్రీరంగనాథుడిని ఓ చోరుడు నిలువుదోపిడీ చేశాడు. స్థానిక ఇస్కా¯ŒS టెంపుల్ సమీపంలోని అవుట్ పోస్టు పోలీస్ స్టేష¯ŒS వద్ద ఉన్న శ్రీరంగథామంలో మంగళవారం అర్థరాత్రి 1.36 గంటల సమయంలో మూలవిరాట్‌కు అలంకరించిన వెండి వస్తువులన్నీ వలుచుకుపోయాడు. కిరీటం, కర్నాభరణాలు, వక్షస్థలం, పాదాలు, అభయ హస్తం, శఠగోపం తదితర పది కిలోల బరువైన వెండి వస్తువులను గుర్తు తెలియని ఆగంతకుడు ఎత్తుకుపోయాడు.
ఆలయంలోని కిటికీ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి లోనికి ప్రవేశించిన ఆగంతకుడు మూడు సీసీ కెమెరాల్లో రెండింటిని తొలగించి, స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన వస్తువులు చోరీ చేశాడు. ఈ చోరీ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను మూడో సీసీ కెమేరా చిత్రీకరించింది. సంఘటనా స్థలాన్ని క్రైం డీఎస్పీ త్రినా«థరావు బుధవారం సందర్శించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన వెండి వస్తువుల విలువ సుమారు రూ.4 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేశారు.
పథకం ప్రకారం చోరీ
ముందుగా ఆలయాన్ని సందర్శించి, పక్కా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీసీ కెమెరాలను తొలగించడం, ముఖానికి ముసుగు ధరించి ఆధారాలు దొరక్కుండా చేతులకు గ్లౌజులు ధరించడాన్ని బట్టి ఆలయం గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement