బాలసదనం నుంచి నలుగురు బాలికలు అదృశ్యం
హైదరాబాద్: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని అనాధాశ్రమం 'బాలసదనం' నుంచి నలుగురు బాలికలు అదృశ్యమైయ్యారు. దాంతో బాలసదనం యాజమాన్యం గురువారం పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశారు. నిన్న స్కూలుకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి బాలసదనానికి రాలేదని యాజమాన్యం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా విద్యార్థుల చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నారు.