చాలా మంది ప్రపోజ్ చేశారు
నాకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు అంటోంది నటి నివేదా పెతురాజ్. ఒరునాళ్ కూత్తు చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు ఇప్పుడు ఉదయనిధిస్టాలిన్, జయంరవిలతో రొమాన్స్ చేస్తూ బిజీగా ఉంది.ఈ సందర్భంగా నివేదా పేతురాజ్‌తో చిన్న భేటీ..
నేను పుట్టింది తమిళనాట.పెరిగింది, చది వింది దుబాయ్‌లో. నాన్న పేతురాజ్ ఇంజినీర్.అమ్మ హౌస్‌మేకర్. తమ్ముడు ని శాంత్ కాలేజీ చదువు పూర్తి చేసి సీఏఎఫ్‌ఏ చేస్తున్నాడు.
ప్ర: సినీ రంగ ప్రవేశం గురించి?
జ: నేను మోడలింగ్ రంగం నుంచి వచ్చాను.యూఏఈలో మిస్ ఇండియా పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్నాను.ఆ తరువాత మోడలింగ్ చే యడం బోర్ అనిపించింది.ఎప్పుడూ ఓకే విధంగా దుస్తులు ధరించడం, ఫోజులివ్వడం నచ్చలేదు. అలాంటి సయమంలో తమిళంలో ఒరునాళ్ కూత్తు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ కు జం టగా పొదువాగ ఎన్ మనసు తంగం,జయంరవితో కిక్ కిక్ కిక్ చిత్రాల్లో నటిస్తున్నాను.
ప్ర: మీ సినీ హీరోల గురించి?
జ: నటుడు దినేష్ నా తొలి హీరో. తొలిసారి నటిస్తున్నానన్న భయం కలగకుండా చాలా విషయాలు చెప్పారు. ఉదయనిధి స్టాలి్న్ కు జంటగా పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో ఒక షెడ్యూల్లోనే నటించాను.ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఇంత సౌమ్యంగా ఉంటారా? అని ఉదయ్‌ను చూసి ఆశ్చర్యపోయాను. చాలా జెంటిల్మెన్ . తన అసిస్టెంట్లను కూడా గౌరవిస్తారు. అలాంటివన్నీ నేను ఉదయనిధి స్టాలిన్ చూసే నేర్చుకున్నాను. ఇక జయంరవికి జంటగా నటిస్తున్న కిక్ కిక్ కిక్ చిత్ర షూటింగ్లో పది రోజులే పాల్గొన్నాను. జయంరవిని ఒక్క రోజే కలుసుకున్నాను. అప్పుడు ఆయన భార్య,పిల్లలు కూడా ఉన్నారు. అలా కుటుంబంతో ఆయన్ని చూడడం చాలా సంతోషం కలిగింది.
ప్ర: కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలకే లవ్ ప్రపోజల్స్ గోల తప్పదు.అలాంటిది మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న మీకు?
జ: అబ్బో దాని గురించి ఎందుకు అడుగుతారులెండి. నేను చదువుకుంటున్న సమయంలోనే తొలి ప్రపోజల్ అందుకున్నాను. రోజాపూలతో కూడిన కార్డుపై ఇంగ్లిష్‌లో ఏవేవో రాశాడు. అయితే అది చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది.అయితే అప్పట్లో నాకు అబ్బాయిలంటే చాలా భయం. దూరంగా పారిపోయేదాన్ని. ఈ విషయాలు తలచుకుంటే ఇప్పుడు చాలా కామెడీగా అనిపిస్తుంది. ఇక దుబాయ్‌లో చాలా మంది ప్రపోజ్ చేశారు.అక్కడి అబ్బాయిలు చాలా పోకిరోళ్లు. బయట అమ్మాయిలెవరైనా కనిపిస్తే, అందంగా ఉన్నారనిపిస్తే వెంటనే వారి ఫోన్ నంబర్లు అడిగి తీసుకోవడం గానీ, తమ ఫోన్ నంబర్లు ఇవ్వడం గానీ చేస్తారు.అలా నేనెవరికీ ఫోన్ నంబర్ ఇవ్వలేదుగానీ, ఒక అబ్బాయి ఫోన్ నంబర్ మాత్రం అడిగి తీసుకుని వెంటనే దాన్ని పారేశాను.
ప్ర: మీరు ఫిట్నెస్ ట్రైనర్ అటగా?
జ: ఫిట్‌నెస్‌లో 1 లెవల్ వరకూ ట్రైనింగ్ తీసుకున్నాను. 2వ లెవల్ ట్రైనింగ్ అవడానికి ఇష్టం కలగలేదు.అయితే ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతున్నాను.ఇప్పటికీ థాయ్‌ల్యాండ్‌కు ఎడాదిలో రెండు నెలలు శిక్షణ పొందుతుంటాను.అలగే కిక్బాక్స్, జూడో విద్యలు తెలుసు. జూడో లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే అమ్మాయిలకు అత్యాచారాల భయం ఉండదు.అలాంటి అమ్మాయిల వద్దకు రావడానికి అబ్బాయిలు భయపడతారు.