Osteoarthritis
-
క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?
క్యాబేజీ అంటే చాలామంది పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే దీనివాసన చాలామందికి నచ్చదు. అయితే క్యాబేజీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడం నుంచి అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే క్యాబేజీ ఆకులతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా?క్యాబేజీ ఆకులను యూరోపియన్ జానపద వైద్యంలో పేదవారి పౌల్టీస్ (పిండికట్టు) అని పిలుస్తారు. వృద్ధులలో అత్యంత సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్. అలాంటి వారు క్యాబేజీ ఆకులను పాదాలకు చుట్టి రాత్రంతా ఉంచడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు పెయిన్ కిల్లర్స్ కన్నా అద్భుతంగా పనిచేస్తాయని, ఈ ఆకుల్లో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వీటిని కొద్దిగా నూనెతో వేడిచేసి కానీ, ఐస్‌తో కలిపి ఐస్ ప్యాక్‌లాగా గానీ వాడతారు. ఇవి సురక్షితమైనవి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి దీర్ఘకాలికంగా ఉపయోగించవచ్చు. ధూమపానం చేసేవారు క్యాబేజీ లేదా బ్రోకలీని తిన్న పది రోజుల తర్వాత వారి సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు 40 శాతం తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది.ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 81 మంది వ్యక్తులపై 2016లో ఒక చిన్న అధ్యయనం జరిగింది, అక్కడ మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు క్యాబేజీ ఆకు చుట్టడం ద్వారా ఫలితం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే దీని నిర్ధారణకు "మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. 2018లో చేసిన మరొక అధ్యయనంలో పురుషులలో మోకాలికి ఐస్‌తో పాటు, క్యాబేజీ ఆకులను చుట్టి కట్టడం వలన వాపు తగ్గినట్టు గమనించారు. నోట్: ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది. -
ఆస్టియో ఆర్థరైటిస్
ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం లేదా బలహీనపడటం వల్ల కనిపించే ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మన దేశంలో కనీసం 15 కోట్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు... అందునా మరీ ముఖ్యంగా మోకాలి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఇంతమందిని బాధించే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుధీర్‌రెడ్డి చెబుతున్న విషయాలివి... ప్రశ్న : ఆర్థరైటిస్ సమస్యల్లో ఆస్టియో ఆర్థరైటిస్ వేరా? జ: ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్‌లలో దాదాపు 200 రకాలు ఉంటాయి. అందులో సాధారణంగా వయసు పెరగడం వల్ల అరుగుదల వల్లగానీ లేదా చిన్నవయసులోనే అయితే యాక్సిడెంట్ల కారణంగా ఆస్టియో ఆర్ధరైటిస్ రావచ్చు. ఇదెలా వస్తుందంటే... రెండు ఎముకల మధ్య అంటే కీళ్ల (జాయింట్) దగ్గర ఘర్షణ తగ్గించడానికి ఎముకల చివరన కార్టిలేజ్ అనే మృదువైన పదార్థం ఉంటుంది. దీన్నే చిగురు ఎముక అని కూడా అంటుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ అది అరగడం లేదా ఆటల్లాంటి/ప్రమాదాల్లాంటి ఏవైనా కారణాల వల్ల కార్టిలేజ్ దెబ్బతినడంతో కీళ్లమధ్యలో ఉండే గ్యాప్ తగ్గుతుంది. దాంతో ఎముకలు ఒకదారితో మరొకటి ఒరుసుకుపోతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు అవి బిగుసుకుపోవడం (స్టిఫ్నెస్)తో పేషెంట్ ఎంతగానో బాధకు గురవుతారు. ప్రశ్న : ఆస్టియో ఆర్థరైటిస్‌ను తెచ్చిపెట్టే ముప్పుల్లాంటివి ఏవైనా ఉన్నాయా? జ: నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పెరుగుతున్న వయసే ఆర్థరైటిస్‌కు ప్రధాన రిస్క్‌ఫ్యాక్టర్. పైగా ఇది నివారించలేనిది కూడా. కొందరిలో వంశపారంపర్యంగానూ కనిపిస్తుంది. అంటే కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశాలూ ఎక్కువే. అలాగే బరువు మోసే వృత్తుల్లో ఉన్నవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రశ్న : ఇందుకు కారణాలు ఏమిటి? జ: ∙ఎక్కువ బరువు ఉండటం/స్థూలకాయం ♦కీళ్లకు బలమైన దెబ్బ తగలడం (ట్రామా) ♦వృత్తిపరంగా కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో ♦కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి) ♦రుమటాయిడ్ ఆర్థరైటిస్ ∙డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం ♦కొన్ని రకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదాహరణకు కార్టికోస్టెరాయిడ్స్). ప్రశ్న : ఏయే లక్షణాలతో ఆర్థరైటిస్ బయటపడుతుంది? జ: ∙నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువ. కదలికల వల్ల ఈ నొప్పి మరింత పెరుగుతుంది. ♦స్టిఫ్నెస్: కీళ్లు బిగుసుకుపోవడం... దాంతో కీళ్లలో కదలికలు తగ్గడం. ♦కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి కలుక్కుమనే శబ్దాలు వినిపిస్తాయి. ♦వాపు: కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు. ♦వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రశ్న : దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? జ: కీళ్ల భాగాల ‘ఎక్స్–రే’తో ఈ వ్యాధిని తేలిగ్గానే గుర్తించవచ్చు. ప్రశ్న : నివారణ కోసం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? జ: ∙ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. ∙పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. ♦కంటినిండా తగినంత నిద్రపోవడం, నాణ్యమైన నిద్రవల్ల జీవననాణ్యత కూడా పెరుగుతుంది. అంతేకాదు... దీనివల్ల ఎన్నో కీళ్లవాతాలకు కారణమైన ఒత్తిడిని కూడా అధిగమించవచ్చు. ♦సమతులాహారం ఎంతో ముఖ్యం. క్యాల్షియం, విటమిన్– డి పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాలతో పాటు ఆకుకూరలు, గుడ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ♦క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోగికి ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులు వ్యాయామాలను సూచిస్తారు. సాధారణంగా నడక, సైక్లింగ్, ఈత, యోగా వంటివి చేసుకోవచ్చు. అయితే మొదట్లో ఈ వ్యాయామాల కారణంగా బాధ ఎక్కువైనట్లు అనిపించే అవకాశాలున్నప్పటికీ క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా శారీరకంగా చురుకుదనం పెరగడం, పరిస్థితి మెరుగుపడుతుంది. ♦వైద్యుల సలహా మేరకు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ తరహా సమస్యలకు సాధారణంగా వాడే స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ వంటి వాటిని వైద్యుల సలహా లేకుండా ఎవరూ ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వాటివల్ల కిడ్నీల వంటి ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ♦బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం) ♦విటమిన్–డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం. ప్రశ్న : దీనికి చికిత్స అందుబాటులో ఉందా? జ: నొప్పి కనిపించినప్పుడు తప్పనిసరిగా మెడికల్ స్పెషలిస్టులు / ఆర్థోపెడిక్ నిపుణులకు చూపించాలి. వారు నొప్పిని తగ్గించడానికి ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటివి సూచిస్తారు. ఇటీవల న్యూట్రాస్యూటికల్స్ అనే కొత్త రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటివల్ల ఆర్థరైటిస్ మరింతగా పెరగడం తగ్గుతుంది లేదా ఆగుతుంది. కొన్ని రకాల ఇంజెక్షన్స్ అంటే హైలురానిక్ యాసిడ్ వంటివి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ (పీఆర్పీ) వంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు... అరుగుదల వేగం తగ్గేవిధంగా కొన్ని వ్యాయామాలను సైతం సూచిస్తారు. ఆ సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పరిస్థితి బాగా విషమించి... మోకాలి కీళ్ల వంటివి మరీ ఎక్కువగా అరిగిపోయినప్పుడు పేషెంట్స్‌కు కీళ్ల మార్పిడి (నీ జాయింట్ రీప్లేస్మెంట్) శస్త్రచికిత్స వంటివి అవసరం పడవచ్చు. ఇంటర్వ్యూ డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్ -
కీళ్ల వ్యాధి చికిత్స కోసం లీ హెల్త్ సరికొత్త ఔషధం
హైదరాబాద్: కీళ్ల వ్యాధి(ఆస్టియోఆర్థరైటిస్) చికిత్సకు హైదరాబాద్‌కు చెందిన లీ హెల్త్ డొమెయిన్ సరికొత్త ఔషధాన్ని రూపొందించింది. శక్తివంతమైన ఫైటో పోషకాలతో సహజ బయోన్యూట్రాస్యూటికల్స్ ఆధారంగా స్మూత్‌వాక్ బ్రాండ్ పేరుతో ఈ ట్యాబ్లెట్లను తయారు చేశారు. కొలాజెన్ టైప్-2, ఎగ్ షెల్ నుంచి సేకరించిన పొర, గుగ్గిలం, పసుపు నుంచి తీసిన కుర్కుమిన్, విటమిన్ డి-3 మేళవింపుతో ఔషధాన్ని ఉత్పత్తి చేశారు. మృదులాస్థిని(కార్టిలేజ్) పెంచి కీళ్లలో కణజాల రుగ్మతలపై ఇది చక్కగా పనిచేస్తుంది. తద్వారా నొప్పులు, గట్టిదనాన్ని తగ్గిస్తుంది. ఈ మందు వాడితే సర్జరీలను నివారించవచ్చని కంపెనీ డైరెక్టర్ లీలా రాణి వెల్లడించారు. సాధారణంగా బాధితుల్లో ఎక్కువ మంది మందులు, చికిత్సల కోసం వెళతారు. చివరి ప్రయత్నంగా శస్త్ర చికిత్స(సర్జరీ) చేయించుకుంటున్నారు. ఆస్టియోఆర్థరైటిస్ చికిత్సలో వాడే నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్, అనాల్జెసిక్స్ నొప్పిని నివారించి తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. స్కూత్‌వాక్ ట్యాబ్లెట్లు రోజూ 2-3 వేసుకోవడం ద్వారా మూడు వారాల్లో నొప్పుల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. ఇది సరళత(లూబ్రికేషన్), కదలిక మెరుగుపరిచి కీళ్లకు అనువుగా ఉంటుంది. ట్యాబ్లెట్లను మూడు నాలుగు నెలలు వాడడం ద్వారా సర్జరీలను నివారించవచ్చు. 18 ఏళ్లుపైబడ్డ వారందరూ వాడొచ్చు. కోవిడ్-19 నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లలేనివారు ఆన్లైన్లో అమెజాన్ ద్వారా స్మూత్‌వాక్‌ను కొనుగోలు చేయవచ్చు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కీళ్లవాపునకు (ఆర్థరైటిస్) సంబంధించి ఆస్టియోఆర్థరైటిస్ సాధారణంగా వచ్చే రెండవ అతిపెద్ద జబ్బు. దేశంలో 18 కోట్లకు మందికిపైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ రోగుల కంటే ఆర్థరైటిస్ బాధితులే అధికం. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఈ రుగ్మత బారిన పడుతున్నారు. 65 ఏళ్లపైబడ్డ మహిళల్లో 45 శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు బయటపడుతున్నాయి. పరీక్షల్లో వీరిలో 70 శాతం మందికి రుగ్మత నిర్దారణ అవుతోంది. చదవండి: ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుగా భారత్ నెట్ -
కీళ్లు కదలకపోతే...
నిర్ధారణ! కీళ్ల నొప్పులు, కదిలించినప్పుడు టకటకమని విరిగినట్లు శబ్దం రావడం లేదా కిర్రుమని ఒకదానికొకటి రాసుకుంటున్నట్లు శబ్దం రావడం, ఎముకలో వాపు, కీళ్ల దగ్గర నీరు చేరడం, కీళ్ల కదలికలు కష్టంగా అనిపించడం, కీళ్ల దగ్గర కండరం సన్నబడిపోవడం, కీళ్లు బలంగా లేక బరువు మోపడానికి ధైర్యం చాలకపోవడం వంటి లక్షణాలు అన్నీ కానీ, కొన్ని కానీ ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్‌గా గుర్తిస్తారు. ఈ లక్షణాలు కనిపించినప్పటికీ దానిని నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌రే: ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌ను నిర్ధారించడానికి చేసే తొలి పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఎముక ములుకులా ఏర్పడడం, రెండు ఎముకల మధ్య ఖాళీ తగినంత లేక ఎముకలు దగ్గరగా జరగడం, కీళ్లలో క్యాల్షియం నిక్షిప్తమై ఉండడం వంటి ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఎంఆర్ఐ స్కాన్: దీని పూర్తి పేరు మ్యాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్. ఈ పరీక్ష ద్వారా ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్, కండరాలు, ఎముకను కండరాన్ని కలిపే టెండాన్స్ పరిస్థితితోపాటు ఎముకలో వచ్చిన చిన్న పాటి తేడాను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏ రకమైన అనారోగ్యమైనా సరే మొదట రక్తపరీక్షను సూచిస్తుంటారు. కానీ ఇందులో రక్తపరీక్ష చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఆస్టియో ఆర్థరైటిస్తోపాటు రక్తహీనత వంటి ఇతర అనారోగ్య లక్షణాలు కూడా ఉన్నప్పుడు రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. -
సంధివాతం :ఆస్టియో ఆర్థరైటిస్ ఆయుర్వేద చికిత్స
ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆయుర్వేదశాస్త్రంలో వాతదోష ప్రధాన వ్యాధిగా పరిగణిస్తారు. దీన్ని ‘సంధివాతం’ అని ఆచార్యులు వర్ణించారు. సామాన్య పరిభాషలో కీళ్లు అరిగిపోయాయని చెప్పే ఈ సమస్య 40-45 ఏళ్లు పైబడ్డ వారిలో సాధారణంగా వస్తుంటుంది. ముఖ్యంగా ఆ వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఎముకలు ఒకదానికి మరొకటి ఒరుసుకోవడం (రాపిడి) వల్ల కీళ్లలో నొప్పి వస్తుంది. సరిగా నడవలేక, జీవితం దుర్భరమవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఒకసారి వస్తే అది తగ్గదనే అభిప్రాయం ఉంది. కానీ అది సరైనది కాదు. మానవ శరీరంలో ఒక రక్షణవ్యవస్థ (డిఫెన్స్ మెకానిజమ్) పనిచేస్తుంది. దీన్నే ఆయుర్వేదంలో ‘వ్యాధిక్షమత్వశక్తి’ (రోగ నిరోధకశక్తి)గా పరిగణిస్తారు. సమస్య చిన్నది అయితే శరీరం తనకు తాను సర్దుబాటు చేసుకుంటుంది. వ్యాధి తీవ్రత (దోష బలం) ఎక్కువ అయితే మరమ్మతు వీలుకాదు. అప్పుడు మోకాలి కీలు, తుంటి కీలు ఉబ్బినట్లు (వాపు) అవుతాయి. కీలు లోపల సున్నితమైన పొర ఉంటుంది. దీన్నే శ్లేషక కల అంటారు. అక్కడ శ్లేషక కఫం ఉత్పత్తి అయి, కీళ్ల సాధారణ కార్యం జరుగుతుంది. వాత ప్రకోపం వల్ల శ్లేషక కఫంతో శ్లేషక కల అరిగిపోయి సంధివాతం వస్తుంది. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దీన్ని డీ-జనరేటివ్ మార్పుగా పరిగణిస్తారు. ఆయుర్వేద చికిత్స పద్ధతులు ఆయుర్వేద శాస్త్రంలో సంధివాతానికి (ఆస్టియో ఆర్థరైటిస్)మూడు పద్ధతుల ద్వారా చికిత్స చేయవచ్చు. నిదాన పరివర్జనం: వ్యాధి మూలకారణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఉదాహరణకు పగటినిద్ర, రాత్రిళ్లు మేల్కొని ఉండటం వంటి అంశాలకు దూరంగా ఉండాలి. ఆహార నియమాలు: సరైన సమయానికి సంతులిత ఆహారం తీసుకోవడం, కాల్షియం అవసరమైతే ఆహారంలో వెన్న శాతం లేని పాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే శరీరానికి తగినంత వ్యాయామం, విశ్రాంతి కూడా అవసరం. శమనశోధన చికిత్సలు: శమనం అంటే దోషాలను శమించే ఔషధాలను సేవించడం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వాతప్రధాన దోషం కనుక దానికి శమనంగా అస్థి ధాతువు (ఎముక) బలానికి అవసరమైన ఔషధాలు వాడాలి. ఆయుర్వేదంలో అలాంటివి కషాయాలు, లేహ్యాలు, తైలాల రూపంలో అభ్యమవుతున్నాయి. అయితే వాటిని వైద్యుల పర్యవేక్షణలో వాడినట్లయితే వేదన, వాపు లాంటి లక్షణాలనుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో వారు ఇక తమ దైనందిన కార్యాలలో చురుగ్గా పాల్గొనే అవకాశం పెరుగుతుంది. స్నేహకర్మ (అభ్యంగన), స్వేదకర్మ వల్ల కీళ్లలో మంచి మృదుత్వాన్ని సాధించవచ్చు. అలాగే వస్థికర్మ, స్థానిక ధారా, జానువస్తి లాంటి పంచకర్మల వల్ల రోగికి సత్వర ఉపశమనం కలిగించవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ (సంధివాత) లక్షణాలు ఈ సమస్య వచ్చినప్పుడు కీళ్లలో వాపు, బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో తీవ్రమైన బాధ కలుగుతుంది. కీలుభాగాన్ని సులభంగా కదిలించలేరు. కీళ్ల వద్ద రాపిడి శబ్దం వస్తుంది. శరీర కదలికలు జరిగినప్పుడు వేదన ఎక్కువవుతుంది. సమస్య తీవ్రత పెరిగినకొద్దీ కీళ్ల భాగాలు ఉబ్బుతాయి. వాపు వస్తూ పోతూ ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల (ముఖ్యంగా చలికి), అలాగే వ్యాయామ సమయంలో కూడా వేదన పెరుగుతుంది. {పారంభదశలో బాధ, బిగుసుకుపోవడం (లాకింగ్) ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్‌కు చేరినదశలో హార్మోనల్ హెచ్చుతగ్గుల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. - డాక్టర్ రమణరాజు (ఎం.డి. ఆయుర్వేద) స్టార్ ఆయుర్వేద సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ఫోన్ : 7416 107 107 / 7416 109 109 www.starayurveda.com -
కీళ్ళవ్యాధులు (Arthritis)
కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళ వ్యాధులు చాలా రకాలుంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలు కీళ్ళలో కన్పిస్తుంది. కారణాలు:అధికబరువు, నలైభై ఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: కీళ్ళలో నొప్పి కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి. జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్: వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్న కీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ -(Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది. సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్న వేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిస్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ ఇన్ఫెక్షన్కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. (SLE) (సిస్టిమిక్టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబడుతుంది. పరీక్షలు: X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 955001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.