కీళ్ళవ్యాధులు (Arthritis) | How to Relief from Arthritis | Sakshi
Sakshi News home page

కీళ్ళవ్యాధులు (Arthritis)

Published Fri, Sep 13 2013 10:52 PM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

కీళ్ళవ్యాధులు (Arthritis)

కీళ్ళవ్యాధులు (Arthritis)

కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళ వ్యాధులు చాలా రకాలుంటాయి.
 వీటిలో ముఖ్యమైనవి  
 ఆస్టియో ఆర్థరైటిస్
  రుమటాయిడ్ ఆర్థరైటిస్

 
 ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలు కీళ్ళలో కన్పిస్తుంది.
 
 కారణాలు:అధికబరువు, నలైభై ఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్‌వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
 లక్షణాలు: కీళ్ళలో నొప్పి కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్‌నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి.
 
 జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం.
 
 రుమటాయిడ్ ఆర్థరైటిస్: వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్న కీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.
 
 లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్‌నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది.
 
 యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ -(Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది.
 
 సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్న వేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిస్ ఆర్థరైటిస్ అంటారు.
 
 కీళ్ళ ఇన్‌ఫెక్షన్‌కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు.
 
 (SLE) (సిస్టిమిక్‌టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబడుతుంది.
 
 పరీక్షలు: X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ కాన్‌స్టిట్యూషనల్ ట్రీట్‌మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును.
 
 డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
 సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
 ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 955001188/99
 టోల్ ఫ్రీ: 1800 102 2202
 బ్రాంచ్‌లు:  హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement