Rheumatoid Arthritis
-
సాధారణ నొప్పులు అనుకోవద్దు.. ఆర్థరైటిస్‌పై అవగాహన అవసరం!
ఆర్థరైటిస్ అంటే కీళ్ల సమస్య (జాయింట్స్ ప్రాబ్లమ్) అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్‌లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలామందిలో ఉంటుంది. కానీ దీనిపై అవగాహన మాత్రం అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యాలు రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచగలగడం సాధ్యం. ఈ నెల 12న ఆర్థరైటిస్ డే. ఈ సందర్భంగా ఆర్థరైటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. ఇందులోనూ దాదాపు 200 రకాల కంటే ఎక్కువ వ్యాధులే ఉంటాయి. మామూలు ప్రజల అవగాహన కోసం వాటన్నింటినీ కలిపి ‘ఆర్థరైటిస్’గా పేర్కొంటారు. సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్’గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండైల్ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్ ఇడియోఫథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటివి కొన్ని. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల తర్వాతి పరిణామంగా ఆర్థరైటిస్ కనిపిస్తుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో దేహంలోని ఇతర వ్యవస్థలపై కూడా దుష్ప్రభావం పడవచ్చు. అలాగే మరికొందరిలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సమస్యలూ కనిపించవచ్చు. నివారణ/తీవ్రత తగ్గించడానికి సూచనలు అసలు జబ్బే లేనప్పుడు లేదా సమస్య తొలిదశలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్)తో దీన్ని నివారించడం అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. వ్యాయామం చాలా కీలకం కాబట్టి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేమిటంటే... అసలే కీళ్లనొప్పులు, కీళ్ల దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వ్యాయామం చేయడం కష్టం కావచ్చు. అయితే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటే కీలు మరింతగా కదలికలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే నొప్పి కలగనంత మేరకు, అలసట కలగనంతవరకు కీళ్లు కదిలిస్తూ క్రమంగా వ్యాయామాన్ని పెంచుకుంటూ పోవడం మేలు. నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. చికిత్స సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా, కీలు మరింతగా దెబ్బతినకుండా ఉండేలా, వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. అలాగే మందులు ఇచ్చేప్పుడు డాక్టర్లు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా ఉండటంతో పాటు సైడ్ఎఫెక్ట్స్ వీలైనంతగా తక్కువగా ఉండేలా చూస్తారు. ఆ మేరకు డాక్టర్లు మందుల మోతాదులను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా డాక్టర్లు నొప్పి నివారణ మందులైన నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ), డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీఎమ్‌ఏఆర్‌డీ), బయాలజిక్స్ వంటి మందులను వాడుతుంటారు. శస్త్రచికిత్స ఆర్థరైటిస్ సమస్యకు తగిన సమయంలో (సాధారణంగా తొలిదశల్లో) చికిత్స తీసుకోనివారిలో కీళ్లు, ఎముకలు దెబ్బతినడం, ఇతరత్రా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అలాంటివారిలో కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం వల్ల వ్యాధి ముదరకుండా చూసుకోవడంతో పాటు శస్త్రచికిత్స వంటి ఆర్థిక, సామాజిక, కుటుంబ భారాలను కూడా నివారించే అవకాశాలుంటాయి. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ఇవి కొద్దిపాటి తీవ్రత (మైల్డ్) నుంచి తీవ్రమైన (సివియర్) లక్షణాల వరకు ఉండవచ్చు. ఒకే వ్యక్తిలో సైతం కాలానుగుణంగా మారుతుండవచ్చు. ఏళ్ల తరబడి కనిపించడంతో పాటు కాలం గడిచేకొద్దీ తీవ్రత పెరగవచ్చు. తొలిదశలో ఆకలి తగ్గడం, జ్వరం, బాగా నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దశలో సాధారణంగానే కనిపించే సమస్యలు కావడం వల్ల వీటిని తొలిదశలో కనుగొనడం కాస్త కష్టమే. ఈ సమస్య కారణంగా ఏ అవయవం ప్రభావితమైతే... ఆ అవయవానికి సంబంధించిన లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ఆర్థరైటిస్‌లో ప్రధానంగా కీళ్లు దెబ్బతినడం జరుగుతుంది. దాని తాలూకు లక్షణాలే బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కీళ్లు ఎర్రగా కమిలినట్లుగా ఉండి, విపరీతమైన నొప్పిరావచ్చు. ఆర్థరైటిస్ గురించి ఎందుకు అప్రమత్తత అవసరమంటే... ఇది కేవలం దేహంలోని ఒక వ్యవస్థకే పరిమితం కాకుండా చాలా వ్యవస్థలను దెబ్బతీస్తుంది. చికిత్స అందించకపోతే చాలా రకాల దుష్ప్రభావాలు కనిపించే అవకాశముంది. మంచి చికిత్స అందిస్తే చాలావరకు అదుపు లో ఉంటుంది. ఒకవేళ సరైన చికిత్స అందించకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాల మీద వీటి ప్రభావం పడి, వాటి పనితీరులలో తీవ్రమైన మార్పు రావచ్చు. ఒక్కోసారి ఈ సమస్య కారణంగా కొందరి లో చూపుపోవడం, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం రావడం జరగవచ్చు. ఫలితంగా జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గిపోతుంది. వ్యాధి నిర్ధారణ ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో పాటు కొన్ని రకాల అడ్వాన్స్డ్ రక్తపరీక్షల సహాయంతో వ్యాధినిర్ధారణ జరుగుతుంది. ఆర్థరైటిస్‌కు చికిత్స ఉందా? తొలిదశలోనే ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా జీవననాణ్యతతో పాటు బాధితుల జీవితకాలాన్ని పెంచవచ్చు. -డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ రుమటాలజిస్ట్ -
కాళ్లు, కీళ్లు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనాతో సగటు మనిషి జీవితం అతలాకుతలమైపోయిందంటే.. తాజాగా దీనితో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు జతకట్టే ముప్పు నెలకొంది. ప్రస్తుత వానాకాలంలో ఎముకలు, కీళ్లకు సంబంధించిన (ఆర్థోపెడిక్) సమస్యలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఒకపక్క కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఇలాంటి సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే అవసరం రాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోవిడ్ ప్రభావిత పరిణామాల ప్రభావం, దీనివల్ల లోలోపల ఉత్పన్నమయ్యే ఆదుర్దా కారణంగా ఇంట్లోనో, బయటో ప్రమాదవశాత్తు పడడమో, ఏదైనా యాక్సిడెంట్‌కు గురికావడం ద్వారా ఎముకలు విరగడం వంటివి జరగకుండా చూసుకోవాలంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ దశరథరామారెడ్డి తేతలి. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మరి న్ని జాగ్రత్తలు తప్పనిసరని ఆయన అంటున్నారు. శరీరంలోని చిన్న ఎముక విరిగితే మూడు నెలలు, పెద్ద ఎముక విరిగితే ఆరు నెలలు ఇంటికి, మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందన్న దాన్ని గుర్తెరిగి మసులుకుంటే మంచిదని ఆయన సూచిస్తున్నారు. ఇంకా వివిధ అంశాలపై డాక్టర్ దశరథరామారెడ్డి ‘సాక్షి’తో ఏమన్నారంటే.. వానాకాలం జాగ్రత్త వర్షాకాలంలో ఎముకలు విరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ’నిదానమే ప్రధానం’ అనే నానుడిని ఎంత బాగా ఆచరిస్తే అంత మంచిది. క్షణకాలం అజాగ్రత్తగా వ్యవహరించినా.. కొన్ని నెలల పాటు ఇంటికి, మంచానికి పరిమితం కావాల్సి ఉంటుందని అందరూ గుర్తెరగాలి. వానాకాలంలో యాక్సిడెంట్లు, ఇతర రూపాల్లో వచ్చే అనుకోని సంఘటనలతో ఆర్థోపెడిక్ సమస్యలు పొంచి ఉంటాయి. ఊహించనిది జరగొచ్చు రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఇళ్లలోనే అనుకోకుండా జారిపడితే తుంటి ఎముక జారడం, వెన్నుపూస, చేతులు/కాళ్ల ఎముకలు విరగడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలతో ఇంటికి లేదా మంచానికే పరిమితం కావడం వల్ల కీళ్ల నొప్పులు / కీళ్ల వాతం సమస్యలు పెరుగుతాయి. వృద్ధులు, పిల్లలపై దృష్టి ఏ కాలంతోనూ సంబంధం లే కుండా బాత్రూంలు/ టాయ్లెట్లలో జారిపడడం సహజం. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు ఈ ప్రమాదాలకు అధికంగా గురవుతున్నారు. బాత్రూంలలో పడినవారికి ఎక్కువగా కీళ్లు బెణకడం, ఎముకలు విరగడం జరుగుతుంటుంది. ప్రమాదాల నివారణ ఇలా ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల బ్రేకులు, టైర్లను సరిచూసుకోవాలి. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లవద్దు. రోడ్ల పరిస్థితిని బట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి. రోడ్లు సరిగా లేకపోవడం, ఎక్కడైనా గోతులు, గుంతలు పడి ఉండడం, వాటిలో వర్షం నీరు చేరి పైకి కనబడకుండా పోవడం వంటి వాటి వల్ల వెహికల్స్ అదుపుతప్పి ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. వాహనాల వైపర్లు సరిచూసుకోవాలి. వాగులు, వంకలు దాటేప్పుడు తొందరపాటు పనికిరాదు. నీటి ప్రవాహ వేగాన్ని తక్కువ అంచనా వేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. నేలపై తడి లేకుండా చూడాలి ఇళ్ల లోపల నేల, ఫ్లోరింగ్‌పై తడిలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వారు టాయ్‌లెట్‌కు, స్నానానికి వెళ్లినపుడు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తరచూ బయటకు వెళ్లవద్దు వర్షాకాలంలో తరచూ బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలి. అవసరమైన సరుకులు, వస్తువులు తగినంతగా ఒకేసారి నిల్వచేసి పెట్టుకుంటే తరచూ బయటికెళ్లే పని తప్పుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. -
కీళ్లవాతానికి మంచి చికిత్స ఉందా?
నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా ఉండే బాధను భరించడం కంటే చనిపోవడం మేలన్నంత తీవ్రంగా నొప్పులు ఉంటున్నాయి. ఈ సమస్యకు ఏవైనా పరిష్కారాలు ఉంటే వివరంగా చెప్పండి. కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని కొందరు నిర్లక్ష్యం చేసి, వ్యాధిని బాగా ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, కొన్ని నాటు పూతమందులు వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ. అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పువచ్చింది. ఈ మందుల కారణంగా రోగుల్లోనూ విశేషమైన మెరుగుదలకు అవకాశం చిక్కింది. ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ సమస్యతో బాధపడేవారికి ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్’ అంటారు. కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్ఆర్డీఎస్’ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్‌కి వాడేలాంటివనే అపోహ మరికొందరిలో ఉంది. దాంతో బాధల తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. అయితే రోగులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. బయోలజిక్స్ గురించి: పైన పేర్కొన్నట్లుగా సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్కీ›్లరోడెర్మా, యాంకైలోజింగ్ స్పాండలైటిస్ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఈ బయోలజిక్స్ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. ఇక మధ్యలోనే చికిత్స మానేసిన చాలామంది రోగులు... ఆ తర్వాత తమ వ్యాధులు బాగా ముదరడం వల్ల వ్యాధితీవ్రత బాగా పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్ మాలెక్యూల్స్, స్టెమ్‌సెల్ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వీటిని వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని బేరిజు వేసుకొని, ఒక సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, -
నొప్పి తగ్గదు.. నిద్ర పట్టదు
జనగామ : యాంత్రిక జీవనంలో ప్రజలు అనేక వ్యాధులబారిన పడుతున్నారు. వైద్యులకు కూడా అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. కొంతమంది ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ నిత్యం నరకం చూస్తున్నారు. ఇందులో ప్రధానమైన (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వ్యాధి కీళ్ల నొప్పులు. రాత్రుళ్లు నిద్రపట్టక పోవడం, ఉదయం లేవగానే కీళ్లు పట్టేసినట్లుగా ఉండ డం, కనీసం కదల్లేక పోవడం, ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ల నొప్పి.. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నాయా.. అయితే రుమటాయిడ్ ఆర్థరైటీస్తో బాధపడుతున్నట్లే. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని వైద్యులు చెబు తుండడం గమనార్హం. జనగామ జిల్లాలో సుమారు 2,500 మందికి పైగా ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతున్నారు. బాధితుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. 18 సంవత్సరాల లోపు వారిలోనూ వ్యాధిని గుర్తిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో అప్రమత్తమైతే పెద్దగా ప్రమాదం లేదని.. నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాప్యం వద్దు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చికిత్సలో జాప్యం చేస్తే కళ్లు తడారిపోవడం, కంటి చూపు తగ్గిపోవడం, దుద్దర్లు రావడం, దగ్గు, ఆయాసంతో పాటు గుండె చుట్టూ నీరు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. నరాల పటుత్వం తగ్గిపోవడం, చేతి వేళ్లు, కాలి వేళ్లు నల్లగా మారుతాయి. మధుమేహం, రక్తపోటులాగే ఈ వ్యాధి ఉన్న వారికి గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిర్ధారణ..చికిత్స కీళ్ల నొప్పులు వచ్చిన తొలి దశలో వైద్యులను సంప్రదిస్తే రుమటాయిడ్ ప్రాక్చర్, యాంటీ సీసీపీ అనే యాంటీ బాడీస్ రక్త పరీక్షలు చేసి, వ్యాధిని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వ్యాధి నిరోధక శక్తిలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు మందులు ఇస్తారు. ' రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణాలు జన్యుపరమైన లోపాలు, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, వైరల్ ఇన్ఫెక్షన్, పొగతాగం వంటి కారణలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలు.. కీళ్ల వద్ద నొప్పి, వాపు రావడం ఉదయం నిద్ర లేవగానే 15 నిమిషాల వరకు కీళ్లు పట్టేయడం రాత్రిపూట కీళ్ల నొప్పులతో నిద్రపట్టక పోవడం కీళ్లలో గుజ్జు తగ్గిపోయి వంకర పోవడం ఎముకలు పటుత్వం తగ్గి చిన్నపాటి దెబ్బలకే ఫ్యాక్చర్ కావడం -
కదలనివ్వదు.. నిద్ర పట్టదు!
ధర్మవరం అర్బన్ / అనంతపురం న్యూసిటీ: కీళ్ల నొప్పులతో రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం. ఉదయం లేవగానే కీళ్లు పట్టేసినట్లుగా ఉండడం. కనీసం కదల్లేకపోవడం.. ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ల నొప్పి. ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లే. ఇటీవల కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులే అంగీకరిస్తున్నారు. జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో 26,125 మంది ఈ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చోసుకోవచ్చు. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. 18 ఏళ్లలోపు వారిలోనూ వ్యాధిని గుర్తిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తొలి దశలో అప్రమత్తమైతే పెద్దగా ప్రమాదం లేదని, నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదనివైద్యులు హెచ్చరిస్తున్నారు. కీళ్ల నొప్పుల్లో అనేక రకాలున్నా అత్యధిక శాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటోంది. ఒకప్పుడు వారంలో ఇద్దరు, ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతుండగా.. ప్రస్తుతం రోజూ ముగ్గురు, నలుగురు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చికిత్సలో జాప్యం చేస్తే... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చికిత్సలో జాప్యం చేస్తే కళ్లు తడారిపోవడం(డ్రై), కంటి చూపు తగ్గిపోవడం, దద్దుర్లు రావడం.. దగ్గు, ఆయాసంతో పాటు గుండెచుట్టూ నీరు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. నరాలు పటుత్వం తగ్గిపోవడం, చేతివేళ్లు, కాలి వేళ్లు నల్లబడటం జరుగుతుంది. మధుమేహం, రక్తపోటులాగే ఈ వ్యాధి ఉన్న వారికి గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిర్ధారణ.. చికిత్స కీళ్ల నొప్పులు వచ్చిన తొలిదశలో వైద్యులను సంప్రదిస్తే రుమటాయిడ్ ఫ్రాక్చర్, యాంటీ సీసీపీ అనే యాంటీబాడీస్ రక్తపరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వ్యాధి నిరోధకశక్తిలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు మందులు ఇస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణాలు ♦ జన్యుపరమైన లోపాల ♦ వాతావరణ కాలుష్యం ♦ ఆహారపు అలవాట్లు ♦ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ♦ వైరల్ ఇన్ఫెక్షన్ ♦ పొగ తాగడం వ్యాధి లక్షణాలు ♦ కీళ్ల వద్ద నొప్పి, వాపు రావడం ♦ ఉదయం నిద్రలేవగానే 15 నిమిషాల వరకు కీళ్లు పట్టేయడం. ♦ రాత్రిపూట కీళ్ల నొప్పులతో నిద్ర పట్టకపోవడం. ♦ జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం ♦ కీళ్లలో గుజ్జు తగ్గిపోయి వంకరపోవడం ♦ ఎముకల్లో పటుత్వం(బోన్ డెన్సిటీ) తగ్గి చిన్నపాటి దెబ్బలకే ఫ్యాక్చర్ కావడం. -
హోమియో కౌన్సెలింగ్స్
గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 37 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. మందులు వాడినా సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – సైదులు, నల్లగొండ గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు : ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు : ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నిద్రలేవగానే మడమల్లో నొప్పి! నా వయసు 40 ఏళ్లు. ఉదయం నిద్రలేచినవెంటనే నడవటం అంటే నరకం కనిపిస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొని నడవాల్సి వస్తోంది. మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఈ సమస్యకు హోమియో పరిష్కారం చెప్పండి. – సునీత, కొత్తగూడెం అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే కణజాలం ఉంటుంది. అడుగులు వేసే సమయంలో ఇది కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దీనిలోని సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో ప్లాంటార్ ఫేషియా చిన్న చిన్న దెబ్బలకూ డ్యామేజ్ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఈ నొప్పి పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా వస్తుంది. కారణాలు : ∙డయాబెటిస్ ∙ఊబకాయం / బరువు ఎక్కువగా ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేస్తూ ఉండటం ∙చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ చురుకుగా పనిచేయడం ∙ హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో వచ్చే నొప్పికి ఇది ముఖ్యమైన కారణం). లక్షణాలు : ∙రాత్రిళ్లు నొప్పి అధికంగా వస్తుంది ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది ∙కండరాల నొప్పులు వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్ చికిత్స : హోమియో విధానంలో మడమనొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి, తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడోడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ మూర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు మంచి పరిష్కారం నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉంటున్నాయి. కీళ్లవద్ద ఎర్రగా మారుతోంది. హోమియోలో పరిష్కారం ఉందా? – యు. చంద్రశేఖరప్రసాద్, తాడేపల్లిగూడెం ఇటీవల ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. సాధారణంగా స్త్రీ–పురుషులలో యాభైఏళ్ల తర్వాత కొన్ని నొప్పులు మొదలవుతాయి. వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతోంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే వారిలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. ఇది మహిళలు, పురుషులు, కొన్ని సందర్భాల్లో పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాలు : ఈ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే ఉండకపోవచ్చు. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేవు. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు. - డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
25 ఏళ్లకే కీళ్ల అరుగుదల
సాక్షి, హైదరాబాద్: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, అశాస్త్రీయ వ్యాయామం అన్నీ కలిపి ఇరవై ఐదేళ్లకే కీళ్లు అరిగిపోతున్నాయి. యాభైల్లో వచ్చే కీళ్ల అరుగుదల ఇప్పుడు యుక్త వయసులోనే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కీళ్ల నొప్పుల పేరుతో వచ్చే కేసుల్లో 20 శాతానికిపైగా అరుగుదల సమస్యతో బాధపడేవారే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మనిషి ఎంతో ఫిట్‌గా ఉన్నా కీళ్ల అరుగుదల పట్టి పీడిస్తుంది. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోందని చెబుతున్నారు. క్రీడలు, అధిక వ్యాయామం, జాగింగ్, అశాస్త్రీయ యోగా తదితరాల పట్ల ఆసక్తి కనిపించే ఇక్కడి వారిలో కీళ్ల అరుగుదల సర్వసాధారణమైందని అంటున్నారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో ఏడాదికి దాదాపు 35 వేల కీళ్ల అరుగుదల కేసులు ఆసుపత్రులకు వస్తున్నాయి. నేడు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా కీళ్ల వ్యాధిపై యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథరామారెడ్డి సహకారంతో ‘సాక్షి ’ప్రత్యేక కథనం. అశాస్త్రీయ యోగా... ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ రుమటాయిడ్, ఇన్ఫ్లమేటరీ, సోరియాటిక్, ఆస్టియో, సెకండరీ అని వివిధ రకాల ఆర్థరైటిస్లున్నాయి. ఇవన్నీ వివిధ కారణాల వల్ల వస్తుంటాయి. ఆర్థరైటిస్ అంటే కీళ్ల అరుగుదల అని అర్థం. సెకండరీ ఆర్థరైటిస్ చిన్నప్పుడు తగిలిన దెబ్బల వల్ల, జాయింట్లో ఎముకలు విరిగి వంకరగా అతుక్కుపోవడం వల్ల కూడా వస్తుంటుంది. కీళ్లను పట్టిఉంచే లిగమెంట్‌కు గాయమైనప్పుడు, జాయింట్ బాలెన్స్ తప్పినప్పుడు కీలు అరిగిపోతుంది. అంతేకాక ట్రెడ్‌మిల్‌పై జాగింగ్, వాకింగ్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, మెట్లు ఎక్కి దిగడం, ఇతరత్రా ఏరోబిక్ వ్యాయామాల వల్ల కూడా చాలామందికి కీళ్లు అరుగుతాయి. ఎముకలు వంకరగా అతుక్కోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. చాలామంది కనీస శిక్షణ కూడా లేకుండా యోగా చేస్తుంటారు. దీనివల్ల కీళ్లు అరిగిపోతాయి. అధిక వ్యాయామంతో ముప్పు.. అధిక వ్యాయామం కీళ్ల అరుగుదలకు దారితీస్తుంది. 45 నిముషాల కంటే ఎక్కువగా వాకింగ్ చేయవద్దు. సిమెంటు, తారు రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ చేయవద్దు. దీనివల్ల ఫిట్నెస్ వస్తుంది కానీ కీళ్లు అరిగిపోతాయి. స్టెరాయిడ్స్ వాడకం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంటుంది. విటమిన్ ‘డి’లోపంతో ఆస్టియో ఫోరోసిస్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. సాధారణంగా జాయింట్లో కొంచెం నొప్పి లేదా మంట ఉంటే ఆర్థరైటిస్‌గా పరిగణించవచ్చు. మెట్లు ఎక్కి దిగేప్పుడు నొప్పి వస్తుంటుంది. పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి ఉంటే దాన్ని తీవ్రమైన కీళ్ల నొప్పిగా చెప్పవచ్చు. ఊబకాయం, అతిగా క్రీడల్లో పాల్గొనడం వల్ల యువతలో ఆర్థరైటిస్ కనిపిస్తుంటుంది. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండీ నిండకముందే యువతకు కీళ్ల అరుగుదల సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్రంగా ఉంటే ఆపరేషన్.. సాధారణ, మధ్యస్థ స్థాయి కీళ్ల అరుగుదలకు ఫిజియో థెరపీ, బరువు తగ్గడంతో నయం చేయవచ్చు. నొప్పి మాత్రలు వేసుకుంటే చాలు. సాధారణానికి మించి కీళ్లు అరిగిపోతే లూబ్రికేటివ్ ఏజెంట్స్ (గుజ్జు)ను ఇంజక్షన్ లేదా మాత్రల రూపంలో ఇస్తారు. ఇక తీవ్రమైన ఆర్థరైటిస్‌కు ఆపరేషనే పరిష్కారం. ప్రస్తుతం కీళ్ల అరుగుదలపై చైతన్యం పెరిగింది. హైదరాబాద్‌లో రోజుకు 50 వరకు సంబంధిత ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆపరేషన్‌పై అపోహలు వద్దు ఆర్థరైటిస్‌కు చేయించుకునే ఆపరేషన్‌పై అనేక అపోహలు ఉన్నాయి. నడవలేరు, ఖరీదు ఎక్కువని ఆపరేషన్ చేశాక నొప్పి ఉంటుందని అనుకుంటారు. ఇది సరైన ధృక్పథం కాదు. ముందుగా ప్రాథమిక స్థాయిలో మందులు, సరైన వ్యాయామం, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయినా తగ్గకపోతే చివరగా ఆపరేషన్ తప్పనిసరి. కీళ్ల అరుగుదల ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోను మెట్లు ఎక్కకూడదు. –డాక్టర్ టి.దశరథరామారెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆసుపత్రి, సోమాజీగూడ, హైదరాబాద్ -
కలవరపరిచే కీళ్లనొప్పి... రుమటాయిడ్ ఆర్థరైటిస్
నాకు కీళ్లలో విపరీతమైన నొప్పిగా ఉంది. కీళ్ల కదలికలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదయం వేళలో ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. – ఎల్. నిరంజన్‌రావు, మధిర మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీర భద్రతావ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్న ఎముకలు, కీళ్లు, మెడ ఎముకలు వంటి చోట్ల వచ్చే అవకాశం ఉంది. కీళ్ల చుట్టూ ఉండే పొరలో వాపు వచ్చి అక్కడి కణాలు పెద్దగా మారి, అక్కడ స్రవించే ద్రవపదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల ఎముకలు దెబ్బతిని, కీళ్లు బిగపట్టినట్లు అవుతుంది. దాంతో కదలికలు కష్టంగా మారతాయి. లక్షణాలు ⇔ కీళ్ల వాపు, నొప్పి, కదలికలు కష్టంగా మారతాయి. ⇔ ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగబట్టినట్లుగా ఉండి, నొప్పి ఎక్కువగా వస్తుంది. ⇔ కీళ్లు దెబ్బతినడం వల్ల చేతి వేళ్లు కొంకరపోవడం, స్వాన్నెక్ డిఫార్మిటీ, జడ్ థంబ్ డిఫార్మిటీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ⇔ మడమ, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావచ్చు. ⇔ నీరసం, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇతర లక్షణాలు ⇔ వ్యాధి తీవ్రస్థాయికి చేరినప్పుడు కీళ్లనే కాకుండా ఊపిరితిత్తుల్లో నీరు పట్టడం, ఊపిరితిత్తులు గట్టిపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ⇔ మూత్రపిండంలోని నెఫ్రాన్స్ పొరలు వాచి మూత్ర సమస్యలు రావచ్చు. ⇔ గుండె పొరల వాపు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు. ⇔ కంటి పొరల వాపు, కాలేయం వాపు, రక్తహీనత, నరాల సమస్యల వంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ∙రక్తపరీక్షలు (సీబీపీ), ఈఎస్ఆర్ ∙ఎమ్మారై జాయింట్స్ lకీళ్ల ఎక్స్–రే (దీనితో వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చు) lరుమటాయిడ్ ఫ్యాక్టర్ ∙క్రియాటివ్ ప్రోటీన్ ∙రీనల్ ఫంక్షన్ టెస్ట్ ∙లివర్ ఫంక్షన్ టెస్ట్ ∙ఏసీపీఏ టెస్ట్‌తో మన శరీరంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలను తెలుసుకోవచ్చు. హోమియో చికిత్స ఈ సమస్యకు హోమియోలో కాల్సికమ్, ఆర్సినికమ్ ఆల్బమ్, లైకోపోడియమ్, రోడోడెండ్రాన్ వాడదగిన మందులు. అయితే లక్షణాలను బట్టి నేట్రమ్ ఆర్స్, డల్కమెరా, క్యాలి అయోడ్, నేట్రమ్మూర్, ఆసిడ్ బెంజ్, రూస్టాక్స్ వంటి మందులు కూడా ఉపశమనానికి బాగా ఉపయోగపడతాయి. నిద్రలో కాళ్లు కదులుతున్నాయి... ఎందుకిలా? నా భార్య వయసు 49 ఏళ్లు. డయాబెటిస్తో బాధపడుతోంది. ఇటీవల నిద్రలో ఆమె కాళ్లను చాలా వేగంగా కదిలిస్తోంది. నిద్రలోంచి లేచి పిక్కలు పట్టేస్తున్నాయని (మజిల్ క్రాంప్స్) అంటోంది. దీంతో ఆమె నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దయచేసి ఆమె విషయంలో తగిన సలహా ఇవ్వండి. – రామానుజరావు, వరంగల్ నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్’ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రజబ్బులో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్ఎమ్డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్ఎమ్డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙డయాబెటిస్ ∙ఐరన్ లోపం lవెన్నెముకలో కణుతులు ∙వెన్నెముక దెబ్బతినడం lస్లీప్ ఆప్నియా (గురక) lనార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) lయురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి. పీఎల్ఎమ్డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీ కన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు. -
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు నివారణ, చికిత్స ఉన్నాయా?
నా వయసు 34 ఏళ్లు. గత ఆరేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో రకాల నొప్పి తగ్గించే మందులు వాడుతున్నాను. అయినప్పటికీ ఉపశమనం కలగడం లేదు. నా సమస్యకు నివారణ, చికిత్స ఏమిటి? - స్పందన, నల్లగొండ జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. దురదృష్టవశాత్తూ ఈ రకమైన వ్యాధులకు శాశ్వత నివారణ లేదు. అయితే వ్యాధిని ప్రారంభ దశలోనే నిర్ధారణ చేసి, చికిత్స మొదలుపెడితే... జీవననాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. అంతేగాక ఈ వ్యాధి వల్ల వచ్చే క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. చికిత్స చేయించుకునే విషయంలో డాక్టర్ మీద ఉన్న నమ్మకం, వారి మాటలను తూ.చ. తప్పకుండా పాటించడం వంటి అంశాల మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కానీ దాదాపు సగం మంది రోగులకు ఉండే అపోహలతోనూ, సరైన నమ్మకం ఉంచుకోకపోవడం వల్లనూ డాక్టర్ సూచించిన విధంగా మందులు తీసుకోరు. దాంతో ఫలితాలు కనబడవు. ప్రస్తుతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఇచ్చే మందులలో నొప్పి నివారణ మాత్రలు, స్టెరాయిడ్స్ వాడుతుంటారు. చికిత్సకు ఇవి అవసరమే గానీ వీటి దుష్ర్పభావాలు చాలా ఎక్కువగానూ, విపరీతంగానూ ఉంటాయి. కాబట్టి వీటి ఉపయోగంలో పరిమితిని పాటించాలి. వ్యాధి తీవ్రతను మార్చేలా అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మెథోట్రెక్సేట్, లెఫ్లూనమైడ్, సల్ఫాసలాజిన్ పేర్కొనదగినవి. ఈ రకమైన తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో ఇటీవల బయలాజికల్ మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు రకాల మందులను రుమటాలజిస్ట్ల సలహా మేరకు వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే మొదలు పెడితే... వ్యాధి తీవ్రతను క్రమంగా తగ్గించి, అదుపులోకి తీసుకురావచ్చు. వ్యాధి తీవ్రతను నియంత్రించిన తర్వాత... రుమటాలజిస్టు మీ మందుల మోతాదును నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తారు. మందులతో పాటు మంచి పోషకాహారం, ఫిజియోథెరపీలతో వ్యాధి వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. - డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్,కిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్ -
కీళ్లనొప్పులకు మోకాళ్ల నొప్పులకు... చిన్ముద్ర... అపాన ముద్ర...
యోగ ముద్రల ద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమంగా ఆ నొప్పి నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలి? మీరు ఏ వయసు వారైనా కావచ్చు. పద్మాసనంలోకాని, సుఖాసనంలోకాని అదీ వీలు లేకపోతే కుర్చీలో కాని కూర్చోండి.వెన్ను నిటారుగా పెట్టాలి. ఇది తప్పని సరి.ఇప్పుడు రెండు చేతుల చూపుడు వేలును బొటన వేలును సుతారంగా తాకించండి. ఇదే చిన్ముద్ర. ఈ ముద్రలో ఉన్న చేతులను తొడల మీద ఉంచి సుతారంగా గాలి పీల్చుతూ దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోండి. ఇలా పదిహేను నిమిషాలు చేయండి.ఆ తర్వాత ముద్రను మార్చండి. ఈసారి బొటనవేలికి మధ్య వేలును ఉంగరం వేలును తాకించండి. దీనినే అపాన ముద్ర అంటారు.ఈ ముద్రలో కూడా వెన్ను నిటారుగా పెట్టి దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోండి. ఇలా పదిహేను నిమిషాలు చేయండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే తప్పకుండా మలినాలు తొలగి కీళ్ల నొప్పుల నుంచి మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. -
రాత్రిళ్లు పిక్కలు పట్టేస్తున్నాయి.. ఏం చేయాలి?
హోమియో కౌన్సెలింగ్ ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. నాకు కారణాలు చెప్పి, హోమియోలో చికిత్స సూచించండి. - ధనలక్ష్మి, కందుకూరు మన శరీరంలోని కదలికూ కీళ్లే ప్రధాన కారణం. అవి వేళ్ల జాయింట్లు కావచ్చు. మణికట్టు కీళ్లు కావచ్చు. భుజం జాయింట్లు కావచ్చు. పాదాల, వేళ్ల కీళ్లు కావచ్చు ఈ కీళ్ల కదలికలో వచ్చే సమస్యలను ఆర్థ్రరైటిస్ అంటారు ఇది కీళ్లలో సాధారణంగా వచ్చే. అతి పెద్ద సమస్య. లక్షణాలు : కీలు లోపల వాచిపోవడం కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధ కీలు కడుపుతున్నప్పుడు శబ్దం రావడం జాయింట్లు ఎర్రగా మారడం జాయింట్ల వద్ద తాకినప్పుడు వేడిగా ఉండడం ఆకలి సరిగా లేకపోవడం రక్తహీనత నిద్ర లేకపోవడం. కారణాలు : శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం జాయింట్ దగ్గర దెబ్బలు తగలడం వంశపారంపర్య కారణాలు జాయింట్లు అరిగిపోవడం శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌లో వచ్చే అసాధరణ లోపాలు సరైన పోషకాహారం తీసుకోలేకపోవడం మానసిక ఒత్తిడి. ఆర్థరైటిస్లోని రకాలు: ఎ. ఆస్టియో ఆర్థ్రరైటిస్: కీలు అరిగిపోవడం వల్ల కీలు లోపలంతా వాచిపోయి కదపాలంటే నొప్పి, బాధ తీవ్రంగా ఉంటుంది ఇది ఎక్కువగా వయస్సు మళ్లిన వారిలో కనిపిస్తుంది జాయింట్‌కు ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, శరీర బరువు అధికంగా ఉండటం వల్ల కానీ వస్తుంది. బి. రుమాటాయిడ్ ఆర్థ్రరైటిస్: స్పష్టమైన కారణమేది తెలియకుండానే ఆరంభమయ్యే అతిపెద్ద సమస్య ఈ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కీళ్లు ఎర్రగా వాచిపోయి, ఉదయం లేస్తూనే జాయింట్లు కదపడానికి సహకరించవు. తీవ్రమైన నొప్పి ఉంటుంది సాధారణంగా ఇది ఎక్కువగా చిన్న జాయింట్లకు వస్తుంది అంతేకాకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. సి. ఇన్ఫెక్టివ్ ఆర్థ్రరైటిస్: శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తి అది కీళ్ల దగ్గరకు చేరడం వల్ల నొప్పులు వస్తాయి. దీనిని ఇన్ఫెక్టివ్ ఆర్థ్రరైటిస్ అంటారు. డి. సోరియాటిక్ ఆర్థ్రరైటిస్: సోరియాసిస్ వంటి చర్మ వ్యాధితో పాటు, ఒక్కోసారి కీళ్లల్లో నొప్పులు, వాపులు రావడం జరుగుతుంది. ఇ. రియాక్టివ్ ఆర్థ్రరైటిస్: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల తరువాత వచ్చే కీళ్ల వాపును. రియాక్టివ్ ఆర్థ్రరైటిస్ అంటారు. ఎఫ్. వైరల్ ఆర్థ్రరైటిస్: చికెన్ గున్యా వంటి వైరల్ వ్యాధుల్లో కూడా కీళ్ల నొప్పులు, వాపులు రావచ్చు. ఆర్థ్రరైటిస్ నివారణ: ప్రతిరోజూ వ్యాయామం చేయాలి పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి పండ్లు తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 46 ఏళ్లు. నేను చాలా రోజుల నుండి అసిడిటి సమస్యతో బాధపడుతనన్నాను. గడచిన 6 నెలల నుండి నేను పాంటాసిడ్-హెచ్‌పి మందులు ఒక వారం వాడాను. ప్రస్తుతం ఒమేజ్ మాత్రలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్దకం మరియు తలనొప్పి సమస్య ఉంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు. -రవికుమార్, నంద్యాల మందులు వాడినా మీకు ఫలితం లేదని చెబుతున్నారు. అయితే మీరు ఎండోస్కోపి చేయించారా లేదా అనే విషయం రాయలేదు. ఒకసారి మీరు ఎండోస్కోపి చేయించుకొని దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. రెండవది మలబద్దకం, కడుపులో నొప్పి ఉందని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మలబద్దకం కడుపులో నొప్పి ఉంటుంది. మీరు మీ ఆహారపు అలవాట్లు యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల వచ్చే అవకాశముంది. కాబట్టి మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి చికిత్స తీసుకోండి. మా బాబు వయస్సు 9 సంవత్సరాలు, మూడు సంవత్సరాల క్రితం పచ్చ కామెర్లు వచ్చాయి. ఒక నెల రోజుల తరువాత వాటంతట అవే తగ్గిపోయాయి. అయితే రెండు రోజుల నుండి మళ్లీ కళ్లు పచ్చగా అనిపిస్తున్నాయి. మళ్లీ కామెర్లు వచ్చాయని సందేహంగా ఉంది. దయచేసి ఏమి చేయాలో సలహా ఇవ్వండి. -నిరంజన్, ఆదిలాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే సాధారణగా చిన్న వయస్సులో వచ్చే పచ్చకామెర్లు హైపటైటిస్-ఎ మరియు ఇ అనే వైరస్లు కారణమవుతాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వైరస్లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి కామెర్లు వచ్చాయి అని తెలిపారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వ్యాధి నిరోధక వక్తి డెవలప్ అయ్యే అవకాశము ఉంది. కాబట్టి మీ బాబుకి కామెర్లు రావడానికి విల్సన్ డిసీజ్ వంటి ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. అలాగే మీ బాబుకి దురద, రక్తహీనత వంటి లక్షణాలేమైనా ఉన్నాయో రాయలేదు. ఒక్కసారి మీరు మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్లుగా సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాను. ఇటీవల నాకు కాళ్లల్లో వస్తుంది. దాంతో పాటు రాత్రిళ్లు పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తోంది. సాధారణ సమస్యనే కదా అని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకు సమస్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. దాంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాను. డ్యూటీకి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. నాకేమైందో అర్థం కావడం లేదు. గతంలో ఎప్పుడూ నాకు ఇలాంటి సమస్య రాలేదు. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. - లింగరాజు, వైజాగ్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు వెరికోస్ వేయిన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం నిల్చుని ఉండేవారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు వైద్యులను సంప్రదించి వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ చేయించుకోండి. వెరికోస్ వేయిన్స్లో నాలుగు దశలు ఉంటాయి. వ్యాధి దశను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు వెరికోస వేయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వేయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వెయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వేయిన్స్కు మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి దశ, రెండవ దశ, రెండవ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే చాలావరకు వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటాయి. వ్యాధి మొదటి దశ, రెండవ దశలో ఉంటే మందులు వాడుతూ వైద్యులు సూచించిన విధంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. దాంతో మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ దశలో వైద్యుల సూచన మేరకు సాగే సాక్సులు, పట్టీలు ధరించవలసి ఉంటుంది. వ్యాధి మూడవ దశ, నాలుగవ దశలో ఉంటే మాత్రం లేజర్ చికిత్స, శస్త్రచికిత్స అవసరమవుతాయి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స ప్రాంబిస్తే సులువుగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధిని నిర్థారించుకోండి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
హోమియా కౌన్సెలింగ్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా? నా వయసు 55 ఏళ్లు. ఒకసారి నా వేళ్లు కొంకర్లుపోయి ఏపని చేయలేకపోయాను. దాంతో డాక్టర్‌ను కలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి, మందులిచ్చారు. కానీ పెద్దగా మెరుగుదల కనిపించలేదు. హోమియోలో దీనికి తగిన చికిత్స ఉందా? - ఇస్మాయిల్, కావలి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ, తన సొంతకణాలనే హానికరమైనవాటిగా గుర్తించి, వాటితో పోరాడుతున్నప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్‌లు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. మొదట చిన్న చిన్న కీళ్లలో (చేతి, కాలి వేళ్లు), ఆ తర్వాత పెద్ద కీళ్లలోకి (మోచేయి, మోకాలు, తుంటి) విస్తరిస్తుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియం అనే పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. దీంతో ఇన్ఫ్లమేషన్కు గురైన ఈ సైనోవియం పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి కార్టిలేజ్‌ను కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు, వాటి ఆకృతినీ, అమరికనూ కోల్పోయి, విపరీతమైన నొప్పితో పాటు, కీళ్ల కదలిక కూడా కష్టంగా మారుతుంది. లక్షణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వారిలో కీళ్లవాపు, కీళ్లనొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండటం, ఉదయం నిద్రలేచే సరికి కీళ్ల కదలిక చాలా బాధాకరంగా ఉండటం, బిగుసుకుపోవడం జరుగుతుంది. శరీరానికి రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగా లేపోవడం, నిస్సత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు (రుమటాయిడ్ నాడ్యూల్స్) ఏర్పడవచ్చు. కీళ్లవాతాన్ని నిర్లక్ష్యం చేస్తే వివిధ రకాల వ్యాధులు... ముఖ్యంగా గుండెజబ్బులు, కళ్లు పొడిబారడం, లాలాజలం తగ్గడం, గుండెచుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరుచేరడం వంటి దుష్ర్పభావాలు వచ్చే అవకాశం ఉంది. నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఎక్స్-రే, ఎమ్మారై మొదలైన పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సైకోసొమాటిక్ డిజార్డర్లలో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఇతర చికిత్స విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. అయితే హోమియో ప్రక్రియలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య పద్ధతిని అనుసరించడం వల్ల వ్యాధిని తగ్గించడంలోనూ, కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ మంచి ఫలితాలు లభ్యమవుతాయి. రోగి మానసిక, శారీరక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, విచారించి, అనువైన మందులను నిర్ణయించి ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా కాపాడవచ్చు. వ్యాధిని సంపూర్ణంగా నయం కూడా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
యవ్వనంలోనూ...అరుగుతున్నాయ్ కీళ్లు
నేడు వరల్డ్ ఆర్థరైటీస్ డే పాతికేళ్లకే కీళ్లనొప్పులు.. గ్రేటర్లో పెరుగుతున్న ఆర్థరైటీస్ బాధితులు అధిక బరువు, పోషకాహార లోపమే కారణమంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: కీళ్ల నొప్పులు ఒకప్పుడు ఆరుపదుల వయసు దాటిన వారిలోనే కన్పించేవి. కానీ మారిన జీవన స్థితిగతులు, తీసుకునే ఆహారం దృష్ట్యా ప్రస్తుతం అన్ని వయస్సుల వారిని వేధిస్తోంది. యువతే కాదు పిల్లలు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతుండడం బాధాకరం. బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 30 శాతం పురుషులు ఉంటున్నారు. 10-15 శాతం వరకు పిల్లలు కూడా ఉండటం ఆందోళనకరం. గత పదేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక బరువు, మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహారలోపం, పిల్స్వాడటమే ఇందుకు కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ‘వరల్డ్ ఆర్థరైటీస్ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. రుమటాయిడ్ ఆర్థరైటీస్ బాధితులే అధికం.. నగరంలో వివిధ రకాల కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారిపై కిమ్స్ ఆస్పత్రి రుమాటాలజీ విభాగం ఇటీవల ఓ సర్వే నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లలో ఆస్పత్రికి వచ్చిన 10 వేల మందిపై పరిశోధన చేయగా, వీరిలో రుమటాయిడ్ ఆర్థరైటీస్ (కీళ్లనొప్పి)తో 29 శాతం, ఆస్టీయో ఆర్థరైటీస్(మోకాలు, మోచేతి కీళ్లలోని గుజ్జు అరిగిపోవడంతో వచ్చే నొప్పి)తో 17 శాతం, సొరియాటిక్ ఆర్థరైటీస్(చర్మం పొడుసుబారిపోవడం)తో 8 శాతం, లూపస్(ముఖంపై సీతాకొక చిలుకలా మచ్చలు ఏర్పడటం)తో 7 శాతం, ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్(వెన్నెముఖ, నడుం వంగిపోవడం)తో 4 శాతం, ఆస్టియో పోరోసిస్(ఎముకల్లో సాంద్రత తగ్గడం వల్ల అవి విరిగిపోవడం)తో 3 శాతం, గౌట్(రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాలిబొటన వేలిపై నొప్పి)తో మరో 3 శాతం మంది బాధపడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని కిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి వెల్లడించారు. ఆర్థరైటీస్ మహిళల్లో హృద్రోగ సమస్యలు.. నగరంలోని ఆర్థరైటీస్తో బాధపడుతున్న 800 మంది వివరాలు సేకరించి, ఆరోగ్యంగా ఉన్న మరో 800 మందితో వయసు, లింగ, నిష్పత్తి, స్మోకింగ్ , నడుం చుట్టూ కొలత, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ మెల్లటస్, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ, షుగర్, ఆధారంగా అధ్యయనం చేయగా ఈ విషయం బయట పడిందని డాక్టర్ శరత్చంద్రమౌలి స్పష్టం చేశారు. 25-46 ఏళ్లలోపు వారిని ఎంపిక చేయగా వీరిలో 666 మంది మహిళలే. రుమటాయిడ్ ఆర్థరైటీస్ రోగులను సాధారణ ప్రజలతో పోలిస్తే వారిలో 2-3 శాతం కార్డియో వాస్క్యులర్ ప్రమాదం ఉన్నట్టు తేలింది. వైట్ కాలర్ ఉద్యోగులే అధికం.. శరీరానికి కనీసం ఎండ కూడా తగలకుండా 24 గంటలు ఏసీల్లో కూర్చోని పని చేస్తున్న వారు ఆర్థరైటీస్ బారినపడుతున్నారు. ఇందులో ఐటీ, అనుబంధ రంగాల్లోని ఉద్యోగులతోపాటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులు ఉన్నారు. అదీగాక కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు సైతం కీళ్ల నొప్పుల బాధితులుగా మారుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. మహిళలు ఎక్కువగా లూపస్ సమస్యను ఎదుర్కొంటుంటే, పురుషులు ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్తో బాధపడుతున్నారు. - డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి, చీఫ్ రుమాటాలజిస్ట్, కిమ్స్ -
మంచంపట్టిన పల్లెలు!
►జ్వరం, కీళ్ల నొప్పులతో ఆస్పత్రుల బాటపడుతున్న రోగులు ►సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు రాయికోడ్: నెల రోజుల నుంచి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచం పడుతున్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరికి తగ్గకముందే మరొకరు జ్వరం, కీళ్ల నొప్పులతో మంచాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఇం దూర్, కర్చల్, ఇటికేపల్లి, రాయికోడ్, పీపడ్పల్లి, రామోజిపల్లి, జమ్గి తదితర గ్రామాల్లో రోగాల భయంతో జనం బెం బెలెత్తుతున్నారు. అయితే నెల రోజులుగా జ్వరం, కీళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయో, అసలు ఏ రోగం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారో వై ద్యాధికారులు ఇప్పటివరకు నిర్ధారించ లేకపోయారు. స్థానిక ల్యాబ్‌లో మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేపట్టి వైద్యులు చేతులు దులుపుకున్నారు. ఇటికేపల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం రోగుల రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపిం చారు. ఆయా గ్రామాల్లో విజృంభిస్తున్న జ్వరం, కీళ్ల నొప్పులతో పేద రోగులు రాయికోడ్ పీహెచ్‌సీకి పరుగులు పెడుతున్నారు. అయితే డాక్టరు లేకపో వడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని డాక్టర్ షా మిలి ఇన్చార్జ్గా విధులు నిర్వహి స్తున్నారు. అయితే డాక్టర్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో తెలియని దుస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి పరీక్షలు చేయకుండా తోచిన మందులిచ్చి పంపుతున్నారని మండిపడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటి సరఫరా కాదని, పంచాయితీ అధికారులు, వ్యాధి నిర్ధారణ కాలేదని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతు న్నారు. దీంతో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండటంతో జ్వరం, కీళ్ల నొప్పులెందుకు వస్తున్నాయో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రజల అవసరాన్ని, ప్రభుత్వ వైద్య శాఖ నిర్లక్ష్యాన్ని మండలంలోని పలువురు ప్రైవేటు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రోగాన్ని నిర్ధారించకుండానే వివిధ రకాల మందులను రాసి, రూ.వందల్లో వసూలు చేస్తు నిరుపేదల జేబులను ఖాళీ చేస్తున్నారు. వారి వైద్యం వల్ల తాత్కాలికంగా జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గుతున్నా సంపూర్ణంగా కోలుకోవడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. -
గతి తప్పిన జీవనశైలితో రుమటాయిడ్ ఆర్థరైటిస్?
అధ్యయనం మనిషి ఆరోగ్యంగా జీవించడానికీ, అనారోగ్యాల బారిన పడడానికీ దోహదం చేసే అంశం జీవనశైలి. స్థూలకాయం ఉండి, మధుమేహంతో బాధపడుతూ ధూమపానం చేస్తూ గడిపేసేవారికి ఆహ్వానించని అతిథిలా వచ్చేస్తుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఏ పది- పదిహేను మందినో పరిశీలన చేసి ఏర్పరుచుకున్న అభిప్రాయం కాదు. ఏకంగా పాతికవేల మంది మీద పదిహేనేళ్లపాటు చేసిన అధ్యయనంలో నిర్ధారణ అయిన నిజం. బ్రిటన్‌కు చెందిన ఒక పరిశోధన బృందం 40-79 ఏళ్ల మధ్యనున్న పాతికవేల మంది మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వీరి అధ్యయనంలో తెలిసిన మరో అంశం ఏమిటంటే... క్రమం తప్పకుండా పరిమితమైన మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటున్న వారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదం తక్కువగా ఉంటోంది. మహిళల్లో మూడు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కని, అతి తక్కువ కాలం మాత్రమే పాలిచ్చిన తల్లులకు కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పొంచి ఉన్నట్లేనట. -
సోరియాసిస్ వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారా?
దీర్ఘకాలంపాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో మాత్రమే కనబడుతుంది. వేసవి, వర్షాకాలంలో ఈ వ్యాధి లక్షణాలు అసలు కనబడకుండా పోతాయి. ఇలాంటి సందర్భంలో ఈ వ్యాధి ఉన్నవారు వ్యాధి పూర్తిగా తగ్గిందని పొరబడే అవకాశం ఉంది. సోరియాసిస్ రావడానికి కారణాలు: వంశపారంపర్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన గల వారిలో పొడిచర్మం ఉన్న వారిలో కొన్నిరకాల మందుల దుష్పరిణామాల వలన పొగతాగే అలవాటు గల వారిలో బి.పి., డయాబెటిస్ వలన వాతావరణంలోని మార్పుల వలన కూడా వచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్ వ్యాధి రకాలు: సోరియాసిస్ వర్గారిస్ గటేట్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ పస్ట్యులార్ సోరియాసిస్ పల్మోప్లాంటార్ సోరియాసిస్. సోరియాసిస్ వ్యాధి లక్షణాలు: చర్మం మీద చిన్న ఎర్రని మచ్చలా మొదలై చర్మం బూడిద రంగులో మారి పొలుసుల్లా రాలిపోతుండటం విపరీతమైన దురద ఈ మచ్చలు మి.మీ. నుంచి మొదలై కొన్ని సెంటీమీటర్ల దాకా విస్తరిస్తాయి తలలో అయితే డాండ్రఫ్ లాగ పెద్ద పెద్ద పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి గోరు పసుపు రంగులో మారి చర్మం నుండి వేరుపడుతుంది. సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామాలు: సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామం కీళ్ల నొప్పులు. సోరియాసిస్‌తో బాధపడేవారిలో 10 నుండి 35 శాతం మందిలో ఈ కీళ్లనొప్పులు ఉంటాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. ఈ వ్యాధి వచ్చినవారిలో మృతకణాలు చర్మం పైపొర ద్వారా బయటకు వెళ్ళకుండా కీళ్లలో చేరి ఎముకల అరుగుదలకు దోహదపడతాయి. సరైన చికిత్సా విధానం: హోమియోపతి వైద్యవిధానం ద్వారా ఈ సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. హోమియోపతి వైద్యవిధానంలో చికిత్స అనేది రోగి శరీరతత్వం, మానసిక స్థితి, వ్యాధి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ‘‘కాన్స్టిట్యూషనల్ థెరపి’’ అని అంటారు. ఈ విధమైన చికిత్సా విధానం ద్వారా ఏ విధమైన రోగాన్ని అయినా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. పాజిటివ్ హోమియోపతి దేశవ్యాప్తంగా పలు శాఖలతో విస్తరించి ప్రతిదినం హోమియో వైద్యవిధానంలో నూతన ఒరవడిని అందిపుచ్చుకుంటూ, రీసెర్చ్ విభాగంలో అందరికంటే ఉన్నతంగా నిలుస్తూ, హోమియో వైద్య ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. - పాజిటివ్ హోమియోపతి డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 www.positivehomeopathy.com -
కీళ్లను ముట్టుకుంటే మంట.. పట్టుకుంటే తంటా..!
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మన కీళ్లు మనకు తెలియకుండా అవసరానికి తగినట్లుగా వంగిపోతూ రోజువారీ పనుల్లో పాల్గొంటుంటాయి. అవి ఏదైనా కారణాలతో వంగక తీవ్రమైన నొప్పితోనూ, వాపుతోనూ ఉంటే అప్పుడుగాని కీళ్లకు వచ్చిన సమస్య మనకు తెలియదు. అప్పటివరకూ మన దైనందిన కార్యకలాపాల్లో వాటి ప్రాధాన్యం మనకు అర్థం కాదు. కీళ్లనొప్పుల్లో అనేక రకాలు ఉన్నా... ప్రధానంగా చిన్న కీళ్లలో వచ్చే నొప్పుల్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా పేర్కొనవచ్చు. చలి ఎక్కువగా ఉండే రోజుల్లో సమస్య మరింతగా కనిపించే ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్న చిన్న కీళ్లలో వచ్చే ఇన్ఫ్లమేషన్ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యక్తమవుతుంది. నొప్పి, వాపు, ముట్టుకుంటే నొప్పి/మంటతో పాటు ముట్టుకోనివ్వని లక్షణాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. డయాబెటిస్, రక్తపోటు (హైబీపీ)లాగే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధే. అయితే ఇప్పుడు లభ్యమవుతున్న ఆధునిక వైద్య చికిత్సా ప్రక్రియతో గతంతో పోలిస్తే మరింత సమర్థంగా అదుపులో ఉంచేందుకు వీలైన వ్యాధి ఇది. మూడు ‘ఎస్’లతో గుర్తించడం తేలిక: మీకు కనిపిస్తున్న మూడు ప్రధాన లక్షణాలను ఇంగ్లిష్‌లో చెప్పుకోవడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అవి... ఊ స్టిఫ్నెస్ (బిగుసుకుపోవడం): ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి అలాగే 30 నిమిషాలకుపైగా ఉండటం. ఊ స్వెల్లింగ్ (వాపు): కీళ్ల వాపు కనిపించడం (ప్రధానంగా చేతి వేళ్ల కణుపుల వద్ద అంటే చిన్న కీళ్లు అన్నమాట) ఊ స్క్వీజింగ్ (నొక్కడంతో నొప్పి): సాధారణంగా ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు కలిగే ఒత్తిడితో పెద్దగా నొప్పి ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు... షేక్‌హ్యాండ్ వల్ల కలిగే చిన్నపాటి ఒత్తిడికి కూడా భరించలేరు. ఈ మూడు ‘ఎస్’ ఫ్యాక్టర్లకు మీ సమాధానం కూడా ‘ఎస్’ అయితే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందేమోనని చూసుకోవాలి. ఇతర లక్షణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం చాలా తేలిక. ఇది వచ్చిందంటే రెండు చేతుల కీళ్లూ... నొప్పి పెడతాయి. ఒక్కోసారి రాత్రికి రాత్రే కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉదయానికి పరిస్థితి దుర్భరమవుతుంది. కొందరిలో ఎంతగా అలసట ఉంటుందంటే వాళ్లు అదేపనిగా నిద్రపోతుంటారు. ఇక ఉదయాన్నే కీళ్ల కణుపుల వద్ద నొప్పి తగ్గడానికి చేతులను వేడినీళ్లలో ముంచితే తమకు ఉపశమనం కలుగుతుందేమోనని అనుకుంటుంటారు. సాధారణంగా మనం డోర్‌నాబ్ తిప్పడం, షర్ట్ బటన్లు పెట్టుకోవడం వంటి సమయంలో వేళ్ల కణుపుల్లోనూ, మణికట్టులోనూ కలిగే నొప్పితో దీన్ని గుర్తించవచ్చు. అయితే మొదట్లో చిన్న కీళ్లకు (అంటే వేళ్ల కణుపులకు) పరిమితమైన నొప్పి... వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెద్ద కీళ్లకూ (అంటే.. మోచేయి, మోకాలు, మడమ... వంటివాటికి) వ్యాపిస్తుంది. ఎందుకు వస్తుందిది..? మన వ్యాధినిరోధక వ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి ఇది. మన కీళ్లు ఎందుకో మన వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)కు కొత్తగా అనిపిస్తాయి. దాంతో ఆ వ్యవస్థ మన కీళ్లపై పోరాటం మొదలుపెడుతుంది. మన కీళ్ల కణుపులపై యాంటీబాడీస్‌ను క్షిపణుల్లా ప్రయోగిస్తుంటుంది. దాంతో ఎముకల కీళ్ల చివరన ఉండే సైనోవియమ్ అనే పొర దెబ్బతింటుంది. ఫలితంగా కీళ్ల వద్ద, కీళ్ల చుట్టూ నొప్పి, వాపు, ముట్టుకోనివ్వనంత మంట కనిపిస్తాయి. నిర్ధారణ: ఊ లక్షణాలు కనీసం ఆరు వారాల పాటు అలాగే కొనసాగడం (అయితే ఇటీవల ఆరువారాల లోపే లక్షణాలు తీవ్రతరమవుతున్నాయి. దాంతో వ్యాధిని త్వరగా గుర్తించడం... ఫలితంగా చికిత్సకు స్పందన కూడా త్వరితంగా కనిపించడం జరుగుతోంది). ఊ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష: ఇది వ్యాధి పేరుతో ఉన్న పరీక్షే అయినా... ఒక్కోసారి వ్యాధి ఉన్నప్పటికీ ఇందులో నెగెటివ్ రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఒక్కోసారి కొందరిలో ఏ వ్యాధి లేనివారిలోనూ ఇది పాజిటివ్ వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి రుమటాలజిస్టులు కానివారు నిర్దిష్టంగా నిర్ధారణ చేయలేకపోవచ్చు. రుమటాలజిస్ట్ మాత్రమే ఈ వ్యాధిని సరిగా నిర్ధారణ చేయగలరు. ఊ యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్)తో నిర్ధారణ నిర్దిష్టంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులోనూ ఒక ప్రతికూలత ఉంది. అదేమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది రోగుల్లోనే యాంటీ-సీసీపీ కనపడుతుంది. వ్యాధిని ఎదుర్కోవడం ఇలా ... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను పూర్తిగా నయం చేయడం కంటే వ్యాధిని అదుపులో ఉంచడమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రక్రియ. అందుకే వ్యాధిని ఎదుర్కునే క్రమంలో రోగికి వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, కొన్ని సూచనలు ఇవ్వడం, ఫిజియోథెరపీ వంటివి అవసరం. చికిత్సతో పాటు ఇవన్నీ కలగలిసి ఆచరించాల్సిన అవసరం ఉంది. ఊ రోగికి అవగాహన: వ్యాధిని అదుపులో పెట్టాలంటే ముందు వ్యాధిపట్ల రోగికి అవగాహన అవసరం. రోగి తెలుసుకోవాల్సిందేమిటంటే... ఇది దీర్ఘకాలిక వ్యాధి. చికిత్స తీసుకోగానే టక్కున మాయమైనట్లుగా నయమయ్యేది కాదు. చికిత్స కూడా దీర్ఘకాలంపాటు తీసుకుంటూ ఉండాలి. గుణం కనిపించడం కూడా అంత త్వరగా జరగదు. (మందులు పనిచేయడం అన్నది ఆరు వారాలకు ముందుగా కనిపించదు). పాటించాల్సిన సూచనలు ఊ రోగి నిద్ర మేల్కోగానే పడకపైనుంచి లేచేముందుగా కనీసం ఐదు నిమిసాల పాటు అలాగే పడుకుని కీళ్లను ముడుస్తూ, రిలాక్స్ చేస్తూ ఉండాలి. దాంతో కండరాలన్నీ బిగుతును కోల్పోయి, సాఫ్ట్‌గా మారతాయి. ఊ కీళ్లు బిగుతుగా ఉంటే పొద్దున్నే వేణ్ణీళ్లతో స్నానం చేస్తే, ఆ బిగుతు తగ్గుతుంది. ఊ రోగి తాను పనిచేస్తున్నప్పుడు కనీసం ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి పనికి బ్రేక్ ఇచ్చి ఒక ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. ఇలా రోజంతా చేయాలి. ఊ పతి కీలుపైనా పడే ఒత్తిడిని నిరోధించడానికి చేయాల్సిన వ్యాయామ విధానాలను డాక్టర్‌ను లేదా ఫిజియోథెరపిస్ట్‌ను అడిగి తెలుసుకుని, వాటిని పాటించాలి. ఊ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం వాడాల్సిన కొన్ని ఉపకరణాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకుని వాటిని వాడాలి. ఫిజియోథెరపీ : ఈ వ్యాధి వచ్చిన వారు తమ కీళ్ల పనితీరును మెరుగుపరచుకునేందుకు తరచూ ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి, వారు సూచించిన వ్యాయామాలను చేయాలి. ముఖ్యంగా కీళ్లు కదలడానికి చేసే ప్రక్రియల వల్ల వాటిపై పడే ఒత్తిడిని తొలగించేలా / లేదా తగ్గించేలా ఈ వ్యాయామాలు ఉంటాయి. వాటిని విధిగా పాటించాలి. వైద్యచికిత్స : రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చేసే చికిత్స అనేకబరకాలుగా ఉంటుంది. తక్షణం నొప్పిని ఉపశమింపజేసేందుకు ఉపయోగించాల్సిన మందులు, మన ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రతికూలంగా పనిచేయకుండా చూసేందుకు వాడాల్సిన మందులు, స్టెరాయిడ్స్ ఇలా రకరకాల మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. నొప్పినివారణకు: కీళ్లలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి సాధారణ నొప్పి నివారణ మందులు వాడితే వాటి ప్రభావం కొద్ది గంటలకు మించి ఉండదు. అందుకోసం వ్యాధిని అదుపులో పెడుతూనే, నొప్పిని తగ్గించగల మందులనూ వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్దేశించిన మందులను నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) అంటారు. ఈ జబ్బులో వాటిని వాడతారు. అసలు జబ్బుపై పనిచేయడానికి: ఇక ఈ వ్యాధిలో మన సొంత వ్యాధి నిరోధక శక్తే మనపై ప్రతికూలంగా పనిచేసి, మన కీళ్ల యాంటీబాడీలను ప్రయోగిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇలాంటి యాంటీబాడీస్ దాడులను తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. అందుకోసం మన వ్యాధి నిరోధక శక్తి తాలూకు ప్రభావాన్నే కాస్తంత తగ్గించేలా మందులు వాడాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు సొంత వ్యాధి నిరోధక శక్తిని తగ్గించుకుంటే అది ఇతరత్రా ప్రమాదం కావచ్చు కదా. అందుకే ఇతరత్రా వ్యాధి కారకాల విషయంలో తగ్గనంతగానూ, కేవలం మన సొంత కీళ్ల కణుపులు రక్షితమయ్యేంతగానూ ఉండేలా ఈ మందుల మోతాదులు చాలా సునిశితంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఇతరత్రా మనకు హాని కాకుండా కేవలం కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్ ప్రభావాన్ని తగ్గించే ఈ తరహా మందుల్ని ‘డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్’ (డీఎమ్‌ఏఆర్‌డీ) అంటారు. ఇవి కూడా తమ ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాల వ్యవధి పడుతుంది. స్టెరాయిడ్స్‌తో బ్రిడ్జింగ్ థెరపీ: మొదట నొప్పిని తగ్గిస్తూ... ఆ తర్వాత అసలు వ్యాధిపై పనిచేసేలా ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని ముందే తెలుసుకున్నాం. మరి ఈ లోపు... నొప్పితో కూడిన కణుపులతో బాధపడటమేనా? అందుకే అసలు ప్రభావం కనిపించే లోపు... ఉపశమనం కలిగించడానికి, వ్యాధిని అదుపుచేయడానికీ మధ్య వంతెనలా పనిచేయడానికి పనికి వచ్చేలా స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఇలా ఇవి వంతెన భూమికను నిర్వహిస్తాయి కాబట్టే ఈ స్టెరాయిడ్స్‌తో చేసే చికిత్సను ‘బ్రిడ్జింగ్ థెరపీ’ అంటూ అభివర్ణిస్తారు నిపుణులు. మొదట్లో అసలు కదిలించడానికే వీల్లేనంత తీవ్రంగా ఉండే వేళ్ల కీళ్లనూ, వాటి కణుపులనూ మామూలుగా మార్చడానికి కొంతమోతాదులో స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఇవ్వడం మొదలు పెట్టి... నిపుణులు క్రమంగా ఆ మోతాదును తగ్గించుకుంటూ వస్తారు. రోగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు మందులు వాడే సమయంలో కాస్తంత తెరిపి కనిపించినా... ఎట్టిపరిస్థితుల్లోనూ మందులు మానకూడదు. - నిర్వహణ: యాసీన్ కొత్త చికిత్సా విధానాలు మనలోని వ్యాధి నిరోధక శక్తే కొన్ని యాంటీబాడీస్‌ను మన కీళ్లపైకి ప్రయోగించడం వల్ల తీవ్రమైన బాధ కలుగుతుందన్న విష యం తెలిసిందే. అందుకే కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్‌ను అణిచేసేలా కొత్త మందు లు రూపొందించారు. ఇవి వ్యాధినిరోధకతకూ, కీళ్లకూ మధ్యలో వ్యాధి నిరోధకత సృష్టించే యాంటీబాడీస్‌ను అణిచేలా పని చేస్తాయి కాబట్టి ఇంటర్మీడియరీ పదార్థాలు అని కూడా అంటారు. వీటిని టీఎన్ఎఫ్-ఆల్ఫా, ఐఎల్-6 వంటి జీవసంబంధమైన (బయాలజిక్) పదార్థాలనుంచి రూపొందిస్తారు కాబట్టి వీటిని ‘బయాలజిక్ ఏజెంట్స్’ అని కూడా వ్యవహరిస్తారు. అయితే ఈ మందులు చాలా ఖరీదైనవి. ఉదాహరణకు ఇన్‌ఫ్లిక్సిమాబ్, ఎటానెర్సెప్ట్, అబాటసెప్ట్, రిటుక్సిమాబ్. ఈ కేటగిరీలో టొఫాసిటినిబ్ అన్నది సరికొత్త మందు. త్వరలోనే భారతదేశంలోకి రానుంది. - డాక్టర్ కె. ధీరజ్, రుమటాలజిస్ట్, యశోదా హాస్పిటల్, మలక్‌పేట, హైదరాబాద్ -
చిన్నకీళ్లను ప్రభావితం చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్...
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను వాడుకభాషలో వాతం అంటారు. దీని బారిన పడ్డవారు కీళ్లనొప్పులతో బాధపడుతుంటారు. కానీ వారికి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తెలియదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే జీవక్రియల అసమతౌల్యత వల్ల మన వ్యాధినిరోధకశక్తే మనపట్ల ప్రతికూలంగా పనిచేయడం వల్ల ఇది వస్తుంది. మన శరీరంలోని వివిధరకాల కణజాలాలు, అవయవాలు, కీళ్లు (సైనోవియల్ జాయింట్స్), ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మంపై ఈ వ్యాధి తాలూకు దుష్ర్పభావం ఉంటుంది. సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చిన ప్రతిసారీ నొప్పి నివారణ మందులు వాడి, దాని నుంచి ఉపశమనం పొందుతుంటారు. కానీ మందులు ఆపివేయగానే నొప్పులు మళ్లీ తిరగబెడతాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి చికిత్స చేయించుకుని, వ్యాధిని అంకురం నుంచి సమూలంగా తొలగించుకోకపోతే... వ్యాధి తీవ్రత పెరిగి, కీళ్ల అమరికలో మార్పులు వచ్చి అది వైకల్యానికి దారితీస్తుంది. కాబట్టి సంపూర్ణంగా నయమయ్యేవరకు చికిత్స చేయించుకోవాలి. ఎవరెవరిలో... ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిలోనైనా కనిపించే అవకాశం ఉంది. కానీ యుక్తవయసులో ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మగవారిలో కంటే ఆడవారిలో ఇదివచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. రుతుక్రమం ఆగిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వంశపారంపర్యంగానూ వచ్చే అవకాశాలు ఎక్కువే. అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువినైల్ ఆర్థరైటిస్ అంటారు. లక్షణాలు వ్యాధిప్రభావం మన కణజాలంతో పాటు అవయవాలపై కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా కీళ్లు (సైనోవియల్ జాయింట్స్)పై వ్యాధి మరింతగా ప్రభావం చూపుతుంది. కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్కు గురికావడం వల్ల కీళ్ల వాపు, నొప్పి, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనపడతాయి. శరీరంలోని ఇరుపార్శ్వాలలో ఉండే కీళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడం అన్నది ఈ వ్యాధి ముఖ్య లక్షణం. లక్షణాలు ముందుగా చిన్న కీళ్లు అయిన కాలివేళ్లు (మెటాటార్సో ఫాలింజియల్ జాయింట్స్), చేతివేళ్లు (మెటా కార్పో ఫాలింజియల్ జాయిడ్స్, ఇంటర్ ఫాలింజియల్ జాయింట్స్), మణికట్టు ఆ తర్వాత పెద్ద కీళ్లయిన భుజాలు, మోకాలు, తుంటి... ఈ వరసలో వ్యాపిస్తుంటాయి. దీర్ఘకాలం పాటు కీళ్లు ఇన్ఫ్లమేషన్కు గురికావడం వల్ల ఫైబ్రస్ కణజాలం ఏర్పడి, కొన్ని కీళ్లు వైకల్యానికి గురి అవుతాయి. దీన్నే డిఫార్మిటీ(స్) అంటారు. దీనిలో... బౌటనీర్ డిఫార్మిటీ, స్వాన్ నెక్ డిఫార్మిటీ, అల్నార్ డిఫార్మిటీ ముఖ్యమైనవి. వీటివల్ల కీళ్లు తమ సాధారణ అమరికను, కదలికలను కోల్పోతాయి. కీళ్లపై చర్మం లోపల చిన్న చిన్న కణుతులు వస్తాయి. వీటినే ‘రుమటాయిడ్ నాడ్యూల్స్’ అంటారు. ప్లూరా ఇన్ఫ్లమేషన్కు గురి అయి, ఫైబ్రోసిస్ కావడం వల్ల రుమటాయిడ్ లంగ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడ్డవారిలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం (అథెరోస్క్లిరోసిస్) వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. పైన పేర్కొన్న లక్షణాలే కాకుండా సాధారణంగా జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత మొదలైన ఇతర లక్షణాలూ ఉండవచ్చు. రోగి నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్-ఫ్యాక్టర్, పీఆర్పీ, ఏఎన్ఏ, యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్) మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. హోమియో చికిత్స: చాలారకాల ఆటో-ఇమ్యూన్ జబ్బులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. అన్నిరకాల సైకోసొమాటిక్ డిజార్డర్స్‌కి హోమియోలో చక్కని పరిష్కారం లభిస్తుంది. అందులో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కూడా హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌కి ఇతర చికిత్స విధానాల్లో శాశ్వత నివారణ లేదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమవుతుంది. కానీ హోమియోలో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఈ మందుల్ని రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వాభావాల ఆధారంగా నిపుణుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం ఎలా...? ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా చిన్న కీళ్లు దానిబారిన పడతాయి. ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో నొప్పి, వాపు ఉండటాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా చెప్పవచ్చు. ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోయి, సాధారణ కదలికలకూ సాధ్యం కాని విధంగా ఉంటాయి. దాదాపు రెండుగంటల పాటు అలా ఉన్న తర్వాత నిదానంగా అవి వదులవుతాయి. శరీరంలో ఇరువైపులా ఒకేవిధంగా కీళ్లు... నొప్పులకు, వాపునకు గురవుతాయి. చలికాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కీళ్ల ప్రాంతంలో చర్మం కింద ఫైబ్రస్ కణజాలం పెరగడంతో అది బయటకు చిన్న కణుతుల్లా కనిపిస్తుంటాయి. దీర్ఘకాలికంగా వ్యాధి ఉన్నప్పుడు కీళ్లనొప్పులతోపాటు కీళ్ల వైకల్యం (జాయింట్ డిఫార్మిటీ) రావచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ -
కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించడం, రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండటం వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. 1. సంధివాతం - Oesteo arthritis 2. ఆమవాతం - Rheumatoid arthritis 3. వాతరక్తం - Gout సంధి వాతం (Oesteo arthrities) సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం... ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమ వాతం (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్న ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), కొద్దిపాటి జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints). వాత రక్తం (Gout) Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది. కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి. లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. డాక్టర్ డి.హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 99599 114 66 / 99089 111 99 www.starayurveda.com ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో... 1. నిదాన పరివర్జనం 2. ఔషధ సేవన 3. ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు. 1. నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం. 2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం. 3. ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించుట, రాత్రి ఎక్కువగా మేల్కొనుట వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. 1. సంధివాతం - Oesteo arthrities 2. ఆమవాతం - Rheumatoid arthritis 3. వాతరక్తం - Gout సంధి వాతం (Oesteo arthrities) సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియర్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం... ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమ వాతం (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వలన ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), మంద జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints) వాత రక్తం (Gout) Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది. కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి. లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. డాక్టర్ డి.హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 99599 114 66 / 99089 111 99 www.starayurveda.com ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో... 1. నిదాన పరివర్జనం 2. ఔషధ సేవన 3. ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు. 1.నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం. 2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం. 3.ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
కీళ్ళవ్యాధులు (Arthritis)
కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళ వ్యాధులు చాలా రకాలుంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలు కీళ్ళలో కన్పిస్తుంది. కారణాలు:అధికబరువు, నలైభై ఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: కీళ్ళలో నొప్పి కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి. జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్: వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్న కీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ -(Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది. సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్న వేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిస్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ ఇన్ఫెక్షన్కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. (SLE) (సిస్టిమిక్టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబడుతుంది. పరీక్షలు: X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 955001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.