రాత్రిళ్లు పిక్కలు పట్టేస్తున్నాయి.. ఏం చేయాలి? | calf that night .. What happened? | Sakshi
Sakshi News home page

రాత్రిళ్లు పిక్కలు పట్టేస్తున్నాయి.. ఏం చేయాలి?

Published Tue, Dec 15 2015 10:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

calf that night .. What happened?

హోమియో కౌన్సెలింగ్
 
 ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. నాకు కారణాలు చెప్పి, హోమియోలో చికిత్స సూచించండి.
 - ధనలక్ష్మి, కందుకూరు

 మన శరీరంలోని కదలికూ కీళ్లే ప్రధాన కారణం. అవి వేళ్ల జాయింట్లు కావచ్చు. మణికట్టు కీళ్లు కావచ్చు. భుజం జాయింట్లు కావచ్చు. పాదాల, వేళ్ల కీళ్లు కావచ్చు ఈ కీళ్ల కదలికలో వచ్చే సమస్యలను ఆర్థ్రరైటిస్ అంటారు ఇది కీళ్లలో సాధారణంగా వచ్చే. అతి పెద్ద సమస్య.
 లక్షణాలు :  కీలు లోపల వాచిపోవడం  కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధ  కీలు కడుపుతున్నప్పుడు శబ్దం రావడం  జాయింట్లు ఎర్రగా మారడం  జాయింట్ల వద్ద తాకినప్పుడు వేడిగా ఉండడం  ఆకలి సరిగా లేకపోవడం  రక్తహీనత  నిద్ర లేకపోవడం.

కారణాలు :  శరీరంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉండటం  జాయింట్ దగ్గర దెబ్బలు తగలడం  వంశపారంపర్య కారణాలు  జాయింట్లు అరిగిపోవడం  శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌లో వచ్చే అసాధరణ లోపాలు  సరైన పోషకాహారం తీసుకోలేకపోవడం  మానసిక ఒత్తిడి.
 ఆర్థరైటిస్‌లోని రకాలు: ఎ. ఆస్టియో ఆర్థ్రరైటిస్:  కీలు అరిగిపోవడం వల్ల కీలు లోపలంతా వాచిపోయి కదపాలంటే నొప్పి, బాధ తీవ్రంగా ఉంటుంది  ఇది ఎక్కువగా వయస్సు మళ్లిన వారిలో కనిపిస్తుంది  జాయింట్‌కు ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, శరీర బరువు అధికంగా ఉండటం వల్ల కానీ వస్తుంది. బి. రుమాటాయిడ్ ఆర్థ్రరైటిస్: స్పష్టమైన కారణమేది తెలియకుండానే ఆరంభమయ్యే అతిపెద్ద సమస్య  ఈ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్  కీళ్లు ఎర్రగా వాచిపోయి, ఉదయం లేస్తూనే జాయింట్లు కదపడానికి సహకరించవు. తీవ్రమైన నొప్పి ఉంటుంది  సాధారణంగా ఇది ఎక్కువగా చిన్న జాయింట్లకు వస్తుంది  అంతేకాకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. సి. ఇన్ఫెక్టివ్ ఆర్థ్రరైటిస్: శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తి అది కీళ్ల దగ్గరకు చేరడం వల్ల నొప్పులు వస్తాయి. దీనిని ఇన్ఫెక్టివ్ ఆర్థ్రరైటిస్ అంటారు. డి. సోరియాటిక్ ఆర్థ్రరైటిస్: సోరియాసిస్ వంటి చర్మ వ్యాధితో పాటు, ఒక్కోసారి కీళ్లల్లో నొప్పులు, వాపులు రావడం జరుగుతుంది. ఇ. రియాక్టివ్ ఆర్థ్రరైటిస్: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల తరువాత వచ్చే కీళ్ల వాపును. రియాక్టివ్ ఆర్థ్రరైటిస్ అంటారు. ఎఫ్. వైరల్ ఆర్థ్రరైటిస్: చికెన్ గున్యా వంటి వైరల్ వ్యాధుల్లో కూడా కీళ్ల నొప్పులు, వాపులు రావచ్చు.

ఆర్థ్రరైటిస్ నివారణ:  ప్రతిరోజూ వ్యాయామం చేయాలి  పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి  పండ్లు తీసుకోవాలి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి  శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
 
నా వయస్సు 46 ఏళ్లు. నేను చాలా రోజుల నుండి అసిడిటి సమస్యతో బాధపడుతనన్నాను. గడచిన 6 నెలల నుండి నేను పాంటాసిడ్-హెచ్‌పి మందులు ఒక వారం వాడాను. ప్రస్తుతం ఒమేజ్ మాత్రలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్దకం మరియు తలనొప్పి సమస్య ఉంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు.
 -రవికుమార్, నంద్యాల

 మందులు వాడినా మీకు ఫలితం లేదని చెబుతున్నారు. అయితే మీరు ఎండోస్కోపి చేయించారా లేదా అనే విషయం రాయలేదు. ఒకసారి మీరు ఎండోస్కోపి చేయించుకొని దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. రెండవది మలబద్దకం, కడుపులో నొప్పి ఉందని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మలబద్దకం కడుపులో నొప్పి ఉంటుంది. మీరు మీ ఆహారపు అలవాట్లు యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల వచ్చే అవకాశముంది. కాబట్టి మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి చికిత్స తీసుకోండి.
 
మా బాబు వయస్సు 9 సంవత్సరాలు, మూడు సంవత్సరాల క్రితం పచ్చ కామెర్లు వచ్చాయి. ఒక నెల రోజుల తరువాత వాటంతట అవే తగ్గిపోయాయి. అయితే రెండు రోజుల నుండి మళ్లీ కళ్లు పచ్చగా అనిపిస్తున్నాయి. మళ్లీ కామెర్లు వచ్చాయని సందేహంగా ఉంది. దయచేసి ఏమి చేయాలో సలహా ఇవ్వండి.
 -నిరంజన్, ఆదిలాబాద్

 మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే సాధారణగా చిన్న వయస్సులో వచ్చే పచ్చకామెర్లు హైపటైటిస్-ఎ మరియు ఇ అనే వైరస్‌లు కారణమవుతాయి. ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల వైరస్‌లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి కామెర్లు వచ్చాయి అని తెలిపారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు వ్యాధి నిరోధక వక్తి డెవలప్ అయ్యే అవకాశము ఉంది. కాబట్టి మీ బాబుకి కామెర్లు రావడానికి విల్సన్ డిసీజ్ వంటి ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. అలాగే మీ బాబుకి దురద, రక్తహీనత వంటి లక్షణాలేమైనా ఉన్నాయో రాయలేదు. ఒక్కసారి మీరు మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ భవానీరాజు,
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
 
వాస్క్యులర్ కౌన్సెలింగ్
 
నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్లుగా సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాను. ఇటీవల నాకు కాళ్లల్లో వస్తుంది. దాంతో పాటు రాత్రిళ్లు పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తోంది. సాధారణ సమస్యనే కదా అని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకు సమస్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. దాంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాను. డ్యూటీకి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. నాకేమైందో అర్థం కావడం లేదు. గతంలో ఎప్పుడూ నాకు ఇలాంటి సమస్య రాలేదు. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
 - లింగరాజు, వైజాగ్

 మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు వెరికోస్ వేయిన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం నిల్చుని ఉండేవారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు వైద్యులను సంప్రదించి వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ చేయించుకోండి. వెరికోస్ వేయిన్స్‌లో నాలుగు దశలు ఉంటాయి. వ్యాధి దశను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు వెరికోస వేయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వేయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వెయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వేయిన్స్‌కు మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి దశ, రెండవ దశ, రెండవ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే చాలావరకు వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటాయి. వ్యాధి మొదటి దశ, రెండవ దశలో ఉంటే మందులు వాడుతూ వైద్యులు సూచించిన విధంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. దాంతో మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ దశలో వైద్యుల సూచన మేరకు సాగే సాక్సులు, పట్టీలు ధరించవలసి ఉంటుంది. వ్యాధి మూడవ దశ, నాలుగవ దశలో ఉంటే మాత్రం లేజర్ చికిత్స, శస్త్రచికిత్స అవసరమవుతాయి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స ప్రాంబిస్తే సులువుగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధిని నిర్థారించుకోండి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది.
 
డాక్టర్ దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులర్ సర్జన్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement