గతి తప్పిన జీవనశైలితో రుమటాయిడ్ ఆర్థరైటిస్?
అధ్యయనం
మనిషి ఆరోగ్యంగా జీవించడానికీ, అనారోగ్యాల బారిన పడడానికీ దోహదం చేసే అంశం జీవనశైలి. స్థూలకాయం ఉండి, మధుమేహంతో బాధపడుతూ ధూమపానం చేస్తూ గడిపేసేవారికి ఆహ్వానించని అతిథిలా వచ్చేస్తుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఏ పది- పదిహేను మందినో పరిశీలన చేసి ఏర్పరుచుకున్న అభిప్రాయం కాదు. ఏకంగా పాతికవేల మంది మీద పదిహేనేళ్లపాటు చేసిన అధ్యయనంలో నిర్ధారణ అయిన నిజం.
బ్రిటన్‌కు చెందిన ఒక పరిశోధన బృందం 40-79 ఏళ్ల మధ్యనున్న పాతికవేల మంది మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వీరి అధ్యయనంలో తెలిసిన మరో అంశం ఏమిటంటే... క్రమం తప్పకుండా పరిమితమైన మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటున్న వారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదం తక్కువగా ఉంటోంది.
మహిళల్లో మూడు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కని, అతి తక్కువ కాలం మాత్రమే పాలిచ్చిన తల్లులకు కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పొంచి ఉన్నట్లేనట.