other banks
-
‘ఎస్బీఐ యోనో’ ఇక అందరిది.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ!
SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్‌ను ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను ఎస్బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్బీఐ యోనో యాప్‌లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్‌ను ఉపయోగించండిలా.. ఎస్బీఐ యోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్‌ని ఎంచుకోండి ఎస్బీఐ పే కోసం రిజిస్ట్రేషన్‌ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్‌కు వస్తుంది అందించిన ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్‌ను సృష్టించండి లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్‌ను సెట్ చేసుకోండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్‌కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు -
యస్ ఖాతాదారులకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: మారటోరియం వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని సర్వీసులను యస్ బ్యాంక్ క్రమంగా పునరుద్ధరిస్తోంది. తాజాగా ఇన్వార్డ్ ఐఎంపీఎస్, నెఫ్ట్ సర్వీసులను పునరుద్ధరించినట్లు మంగళవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో వెల్లడించింది. దీంతో యస్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులు, రుణాలు తీసుకున్న వారు ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం తమ ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ఇతర ఏటీఎంల నుంచి కూడా నిర్దిష్ట స్థాయిలో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ యస్ బ్యాంక్ తెలిపింది. సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల మారటోరియం విధించడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది. నగదు విత్‌డ్రాయల్‌పై ఆంక్షలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా డిజిటల్ పేమెంట్స్ సేవలు కూడా నిల్చిపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఫారెక్స్ సర్వీసులు, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడింది. యస్ బ్యాంక్‌లో టియర్ 1 బాండ్లేమీ లేవు: శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌లో తమకు టియర్ 1 స్థాయి బాండ్లేమీ లేవని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ (ఎస్టీఎఫ్సీ) సంస్థ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. అప్పర్ టియర్ 2 స్థాయి బాండ్లలో 2010లో ఇన్వెస్ట్ చేసిన రూ. 50 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని పేర్కొంది. ఆర్బీఐ రూపొందించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం.. సుమా రు రూ. 10,800 కోట్ల టియర్ 1 బాండ్ల చెల్లింపులు రద్దు కానున్న సంగతి తెలిసిందే. మరో వైపు, 2006లో జారీ చేసిన వారంట్లకు సంబ ంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమపై రూ. 5 కోట్ల జరిమానా విధించినట్లు ఎస్టీఎఫ్సీ తెలిపింది. ప్రస్తుతం తమ గ్రూప్‌లో భాగమైన శ్రీరామ్ హోల్డింగ్స్ (మద్రాస్) (ఎస్‌హెచ్‌ఎంపీఎల్) అప్పట్లో రూ. 244 కోట్ల సమీకరణ కింద ఒక ప్రవాస భారతీయ వ్యక్తి నుంచి కూడా నిధులు సమీకరించినట్లు వివరించింది. ఈ లావాదేవీలో విదేశీ మారక నిర్వహణ (ఫెమా) చట్టాల ఉల్లంఘన జరిగింద న్న ఆరోపణలతో ఈడీ తాజా జరిమానా విధిం చినట్లు ఎస్టీఎఫ్సీ తెలిపింది. -
జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
-
జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
ముంబాయి : కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త కార్లు, ఇళ్లు కొనుకోవాలనుకునే వారు శుభవార్త వినిబోతున్నారట. 2017 మొదటినెలలోనే ప్రముఖ అగ్రగామి బ్యాంకులన్నీ వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. ఈ రేట్లు తగ్గించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం ఏర్పడిన నగదు కొరతకు వినియోగత్వం దెబ్బతిన్నది. నిత్యావసరం కాని వస్తువుల కొనుగోళ్లకు గండికొట్టింది. ఈ నేపథ్యంలో వినియోగత్వాన్ని పెంచడానికి బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కొత్త ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి చౌకైన వడ్డీరేట్లు లభించనున్నాయని సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్బీఐ స్పందించడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకి భారీ మొత్తంలో డిపాజిట్లు సమకూరాయి. బ్యాంకుల లిక్విడిటీ కూడా భారీగా పెరిగింది. గతవారం ఇండియన్ బ్యాంకు అసోసియేషన్‌తో భేటీ అయిన బ్యాంకులు వడ్డీరేట్ల కోత విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. దేశీయ అగ్రగామి బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమయ్యే మార్గాలను వారు చర్చించారని, ఆర్థికమంత్రిత్వశాఖతో కూడా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించే విషయంపై చర్చించారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డీమానిటైజేషన్‌తో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్‌ను పునరుద్ధరించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. మరోవైపు డిసెంబర్ 30 తర్వాత కూడా నగదు విత్‌డ్రాలపై విధించిన పరిమితులు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.