Outsourced workers
-
రెవెన్యూ పోరు
నేటి నుంచి పురపాలక, మునిసిపాలిటీల్లో ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేటి నుంచి వర్క టూ రూల్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధులు కలెక్టర్ కరుణతో జేఏసీ నేతల భేటీసమస్యలు పరిష్కరించే వరకూ అంతేనన్న నేతలు హన్మకొండ అర్బన్ : దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. తొలిదశ ఆందోళనలో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి వర్క్ టు రూల్ అమలు చేయాలని నిర్ణయించా రు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో డీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్రెస్సా, తహసీల్దార్ల సంఘం, వీఆర్ఏల సంఘం సంయుక్తంగా జేఏసీగా ఏర్పడ్డారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయంతోపాటు జిల్లాలో చేపట్టనున్న తమ కార్యాచరణను ఆదివారం కలెక్టర్ వాకాటి కరుణను కలిసి వివరించారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ వర్క్ టూ రూల్ కార్యక్రమం కొనసాగుతుందని తే ల్చిచెప్పారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ 1985లో మండలాల వ్యవస్థ ఏర్పడ్డప్పటి లెక్కల ప్రకారం కార్యాలయం అధికారులు, సిబ్బంది పోస్టులే ఉన్నాయని తెలిపారు. ఆ పోస్టుల్లో కూడా ప్రసుత్తం చాలా వరకు ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భ ర్తీ చేయక పోవడం, పోస్టుల సంఖ్య పెంచకపోవడం వల్ల పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... అధికారులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోందన్నారు. నెలల కాలంగా డీటీలకు పదోన్నతులు లేవని.. ఉన్న స్థానం నుంచే ఉద్యోగ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్లకు వాహనాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, వీఆర్ఏలకు కనీస వేతనాలు ఒక్కొక్కరికి రూ.13 వేలు 101పద్దు ద్వారా చెల్లించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు మార్గం కుమారస్వామి, తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షులు పూల్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర నాయకులు చెన్నయ్య, ట్రెస్సా కార్యదర్శి రాజ్‌కుమార్, రత్నవీరాచారి, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు రాకేష్, వీఆర్ఓల సంఘం నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకే బంద్... జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్,ఆర్డీవో కార్యాలయాలకు సోమవారం నుంచి సాయంత్రం 5 గంటలకే తాళాలు పడనున్నాయి. తహసీల్దార్ నుంచి వీఆర్ఏ వరకు ప్రతి ఒక్కరూ వర్క్ టు రూల్ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెవెన్యూ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. {పొటోకాల్ కోసం నిధులు పెంచాలి. కాంటింజెన్సీ నిధులు పెంచాలి. మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన చేయాలి. జనాభాకు తగ్గట్టు ఉద్యోగుల సంఖ్యను పెంచాలి. ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. డీటీలు, వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలి. వీఆర్ఓలకు ఎఫ్‌టీఏ ఇవ్వాలి. తహసీల్దార్లకు వాహన సౌకర్యం కల్పించాలి. -
కార్మికులు ఔట్..!
సాగనంపేందుకు కుట్ర కౌన్సిల్‌కు సిద్ధమైన టెండర్ ప్రతిపాదనలు మూడువేల మంది భవిష్యత్ ప్రశ్నార్థకం కార్పొరేషన్ పాలకుల అనాలోచిత నిర్ణయం విజయవాడ సెంట్రల్ : కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా మారాయి నగరపాలక సంస్థ పాలకుల నిర్ణయాలు. ఓవైపు పొదుపు మంత్రం జపిస్తూనే, మరోవైపు దుబారాకు తెగబడుతున్నారు. ఏళ్ల తరబడి అరకొర జీతాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను సాగనంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు టెండర్లు అనే పాచిక విసురుతున్నారు. ఇందులో భాగంగానే గూర్ఖాలు, పార్కు కార్మికులకు సంబంధించి టెండర్లు పిలవాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. తాజాగా డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం పారిశుధ్య విభాగంలో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికులకు రూ.8,300 చెల్లించాలి. కనీసం పదిశాతం లాభానికి టెండర్ దాఖలు చేస్తే ఆ పదిశాతం కార్పొరేషన్‌కు అదనపు భారంగా పరిణమిస్తుంది. నిత్యం కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడే పాలకులు ఎవరి ప్రయోజనం కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కార్మికుల్లో ఆందోళన నగరపాలక సంస్థలో 2004 నుంచి డ్వాక్వా, సీఎంఈవై గ్రూపుల కార్మికులు పారిశుధ్య విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 443 గ్రూపుల నుంచి 3,274 మంది విధుల్లో చేరారు. ప్రస్తుతం 2,984 మంది 59 డివిజన్లలో పనిచేస్తున్నారు. రూ.1,600తో ప్రారంభమైన వీరి జీతం ప్రస్తుతం రూ.8,300కు చేరింది. గడిచిన పదకొండేళ్లుగా ఏటా వీరి కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా టెండర్లు పిలవాలని పాలకులు, అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేస్తున్నారు. టెండర్ల విధానం అమలైతే భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదనలు సిద్ధం ప్రజారోగ్య విభాగంలో ఔట్సోర్సింగ్ కార్మికుల నియామకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సిందిగా 2011 జూలైలో కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ప్రేమ్‌చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాటి కమిషనర్ రవిబాబు టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. దీంతో కార్మికులు ఆందోళనబాట పట్టారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు కార్మికులకు అన్యాయం జరుగుతోందంటూ లోకాయుక్తలో కేసు ఫైల్ చేశారు. దీంతో వివాదం ముదిరింది. అనూహ్య పరిణామంతో కంగుతిన్న అధికారులు తూచ్.. అన్నారు. టెండర్లు పిలవడం లేదంటూ లోకాయుక్తకు సమాచారం ఇచ్చారు. మూడున్నరేళ్ల స్పెషల్ అధికారుల పాలనలో కాంట్రాక్ట్ కాలపరిమితి పెంచుతూ వస్తున్నారు. కార్మికులకు ఏడాదికి సుమారు రూ.29 కోట్లు జీతాలుగా చెల్లించాలి. దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసు కెళ్లారు. 2016 మార్చి వరకు కార్మికుల కొనసాగింపు సాధ్యం కాదని, టెండర్లు పిలవాల్సిందిగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యశాఖాధికారులు ఈనెల ఏడో తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కౌన్సిల్‌పైనే ఆధారం కౌన్సిల్ తీసుకునే నిర్ణయంపైనే కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గూర్ఖాలు, పార్కు వర్కర్లకు సంబంధించి టెండర్లవైపు మొగ్గుచూపిన టీడీపీ పాలకులు ప్రజారోగ్య విభాగంలోనూ ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్లో 38 మంది సభ్యులతో పూర్తి మెజారిటీ ఉన్న టీడీపీ గడిచిన మూడు సమావేశాల్లో పలు అంశాలపై ఏకపక్ష ధోరణిలోనే నిర్ణయాలు తీసుకుంది.