own houses
-
అద్దిల్లా..? సొంతిల్లా..?
చాలా మంది తేల్చుకోలేని అంశం.. అద్దె ఇంట్లో ఉండడం నయమా? లేక సొంతిల్లు సమకూర్చుకోవడం బెటరా? అని. ఈ రెండింటిలో ఆర్థికంగా ఏది లాభదాయకమో నిపుణులను అడిగితే చెబుతారు. కానీ, ఇల్లు అన్నది భావోద్వేగాలు, సామాజిక గుర్తింపు, మానసిక ప్రశాంతత తదితర ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అద్దె ఇల్లు ఆర్థిక భారం లేనిది. సొంతిల్లు ఆర్థిక బాధ్యతను తెచి్చపెడుతుంది. ఒకటి రెండు నెలల అడ్వాన్స్ ఉంటే నిమిషాల్లో అద్దె ఇంట్లో దిగిపోవచ్చు. కానీ, సొంతింట్లో కుడి కాలు మోపాలంటే భారీ మొత్తం కావాలి. లేదంటే బ్యాంక్ తలుపు తట్టాలి. అద్దె ఇంట్లో మనకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి గిట్టకపోయినా మరో గూడు వెతుక్కోవాల్సిందే. సొంతింట్లో ఎవరికి వారే రారాజు. ఇలా నాణేనికి రెండువైపులా లాభనష్టాలున్నాయి. తమకు ఏది అనుకూలమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. ఈ దిశగా అవగాహన కలి్పంచి, సులువుగా నిర్ణయం తీసుకోవ డానికి దారి చూపించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఆర్థిక కోణం... ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కల్లో కనబడుతున్నాయి. కనుక అక్కడ సొంతిల్లు చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థి కంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దే తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్థోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి/ఉద్యోగ/వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశి్చంతగా సొంతింటికి మొగ్గు చూపొచ్చు. కానీ, నగరాలు, పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించే వారు అక్కడి రెంటల్ ఈల్డ్స్ (ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి), ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది, తదితర అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఈఎంఐతో పోలి్చతే.. చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆప్షనే. కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ వెళ్తుంది. కానీ, దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం వల్ల.. తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది.అద్దె రాబడి తక్కువ... మన దేశంలో ఇంటిపై సగటు రాబడి 2.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇక్కడే తక్కువ. అదే యూఎస్, కెనడా, దుబాయిలోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి 5–6 శాతంగా ఉంది. అద్దె రాబడి 4 శాతాన్ని మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవడం అత్యుత్తమమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ (అద్దెకు ఇస్తే వచ్చే రాబడి) (ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు), ఏటా ఎంత చొప్పున పెరుగుతుందన్నది తెలుసుకోవాలి. వీటి ఆధారంగా అద్దె/ఈఎంఐ రేషియో ఎంతో తేల్చుకోవాలి. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ ‘లైసస్ ఫొరాస్’ ఇందుకు సంబంధించి విలువైన గణాంకాలు రూపొందించింది. దీని ప్రకారం 100 శాతం అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండడమే లాభం. ఈ రేషియో 100 దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవడం లాభం.విశ్లేషణ విశాఖలో రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 2 శాతంగా ఉంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతూ పోతే రెంటల్/ఈఎంఐ రేషియో 57 శాతం అవుతుంది. ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 84 శాతంగా ఉంటుంది. 11 శాతం పెరిగితే రేషియో 93గా ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రెంటల్ ఈల్డ్ 2.5 శాతం.. ఏటా 9 శాతం వరకు పెరిగితే రెంట్/ఈఎంఐ రేషియో 94గా ఉంటుంది. ఒకవేళ ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 104కు వెళుతుంది. హైదరాబాద్‌లో ఏటా 10 శాతం చొప్పున అద్దెలు పెరిగేట్టు అయితే అప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి, ఈఎంఐలు కట్టుకోవడమే ప్రయోజనకరం. అద్దె పెరుగుదల 10 శాతంలోపే ఉంటే కిరాయికి తీసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండి, ఏటా అద్దె 5 శాతం పెరిగినా సరే.. అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడమే లాభం.లాభాలుఈ అంశాలు గమనించాలి.. ఆర్బీఐ డేటా ప్రకారం 2010–11 నుంచి 2017–18 మధ్య కాలంలో (రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ (రెరా) రాక ముందు) ప్రాప ర్టీల ధరలు ఏటా 15 శాతం చొప్పున పెరిగాయి. 2018–19 నుంచి 2022–23 కాలంలో (రెరా వచ్చిన తర్వాత) ఏటా 3 శాతం పెరిగాయి. చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ప్రాపరీ్టల ధరలు పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ప్రాపర్టీ కొనుగోలు లాభదాయకమే. 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ, ఇంటి అద్దె కంటే రెట్టింపు ఉంటుంది. కానీ, 15–17 ఏళ్లు గడిచే సరికి ఇంటి అద్దె ఏటా పెరుగుతూ రుణ ఈఎంఐకి చేరువ కావచ్చు.సొంతిల్లు→ ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఇది ఇళ్లు, స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తుంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది. → సొంతిల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం. భద్రతకు హామీనిస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. గోపత్య ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీపడాల్సిన అవసరం ఉండదు. → అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు.. పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణ ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్), వడ్డీ అని రెండు భాగాలుంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. → సొంతింటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దె ఇంట్లో ఉండి, చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టమనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు. సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది. సామాజిక గుర్తింపును తెస్తుంది. → చివరిగా సొంతిల్లు ఉంటే.. విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాతు అవుతుంది. రివర్స్ మార్ట్‌గేజ్‌తో ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని బ్యాంక్ నుంచి పొందొచ్చు. అద్దె ఇల్లుళీ అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత.. నచి్చన ప్రాంతంలో ఉండొచ్చు. సొంతిల్లు అయితే మారకుండా ఎప్పటికీ ఒకేచోట ఉండిపోవాల్సి వస్తుంది. → ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే, తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు. సొంతిల్లు అయితే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఈఎంఐ కట్టాల్సిందే. → అద్దె ఇల్లు అయితే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు. వాటర్ ట్యాంక్‌లు, నీటి మోటార్ల నిర్వహణ, రిపేర్లు, పెయింట్స్ తదితర బాదర బం«దీలు ఉండవు. వీటి రూపంలో ఆర్థిక భారం పడదు. ఇంటి పన్నుల బాధా ఉండదు. → రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే.. మొత్తం విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి. అదే అద్దె ఇంటి విషయంలో ఈ అవసరం ఉండదు. కొద్ది నెలల అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.వేతన జీవులకు రియల్టీ ఆస్తివేతన జీవులకు రియల్ ఎస్టేట్ ఒక ఆస్తిగా మారుతుంది. నీవు ప్రతి నెలా అద్దె కింద రూ.లక్ష చెల్లిస్తుంటే, దానికి అదనంగా రూ.50,000–60,000 చెల్లించేట్టు అయితే సొంతిల్లు దక్కుతుంది. పదేళ్ల పాటు ఇదే అద్దెను చెల్లించడం వల్ల ఎలాంటి ఆస్తి సమకూరదు. కనుక ఈఎంఐతో ఒక ఆస్తిని సమకూర్చుకోవచ్చు. – అజితేష్ కొరుపూలు, అశోక బిల్డర్స్ (రియల్ ఎస్టేట్ కంపెనీ) సీఈవోతెలివైన నిర్ణయం కాదు!గురుగ్రామ్‌లో నేను ఉండే ఇంటికి ప్రతి నెలా రూ.1.5 లక్షలు అద్దె, మెయింటెనెన్స్‌తో కలిపి రూ.1.65 లక్షలు చెల్లిస్తున్నా. అది గోల్ఫ్‌కోర్స్‌తో కూడిన ఖరీదైన ప్రాంతం. నేను ప్రస్తుతం అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ ఖరీదు రూ.7.5–8 కోట్లు. దీన్ని కొనుగోలు చేయాలంటే 70 శాతం మేర రూ.6 కోట్లు రుణం తీసుకోవాలి. దీనికి ప్రతి నెలా రూ.6–7 లక్షల ఈఎంఐ చెల్లించాలి. అంటే నేను ప్రస్తుత ఇంటికి చెల్లిస్తున్న అద్దెకంటే ఈఎంఐ నాలుగు రెట్లు అధికం. కనుక ఇల్లు కొనుగోలు చేయడం నాకు తెలివైన నిర్ణయం కాబోదు. ఇల్లు అనేది లిక్విడిటీ (కోరుకున్న వెంటనే సొమ్ము చేసుకోగల) ఉన్న ఆస్తి కాదు. కనుక నేను అదే రూ.6 లక్షలను పబ్లిక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాను. పైగా అద్దె ఇల్లు తీసుకోవడంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. 15 రోజుల్లోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఇంటికి మారొచ్చు. నేను నా పిల్లలు, తల్లిదండ్రులతో కలసి ఉంటే తప్ప ఇంటి విషయంలో నా ఆలోచన ఇదే. – శంతను దేశ్‌పాండే, బోంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్హాస్యాస్పదంప్రస్తుత వేల్యూషన్ల వల్లే నేను రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేయలేదు. నా వరకు ఈ వేల్యూషన్లు నిజంగా హాస్యాస్పదం. వడ్డీ రేట్ల కంటే ఇంటిపై రాబడులు తక్కువ. ఇళ్లు, ఆఫీస్‌ల ధరలు పెరుగుతాయని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అనిపించడంలేదు. పెట్టుబడులపై 10–12 శాతం రాబడులు సంపాదించుకోలిగినప్పుడు, 3 శాతానికే (ప్రాపర్టీ విలువలో) వచ్చే అద్దె ఇల్లు తీసుకోవడమే మంచిది. పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. నా తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఒక్కటే నాకు ఉంది. దానికి కూడా భావోద్వేగ పరమైన కారణాలున్నాయి. – నిఖిల్ కామత్, జెరోదా కో–ఫౌండర్ ఆఫీసుకు దగ్గరుంటే.. తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం. అలాంటి చోట సొంతిల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి కావాలి. దాంతో పోలిస్తే చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పైగా రోజూ ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇంధన వ్యయాల భారం ఉండదు. విలువైన సమయం, వనరుల ఆదా అవుతాయి. సెలబ్రిటీలు ఇలా..సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, కృతి సనన్ సొంతింటికి బదులు అదంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ముంబైలో ఒకే ప్రాజెక్టులో 6 అపార్ట్మెంట్లు కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Interim Budget 2024: మధ్య తరగతికి...సొంతింటి వరం!
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు. ‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి ఇళ్లు ‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిశ్రమ డిమాండ్లు.. షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు. మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రోత్సాహకరం.. బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూలాంశాలు.. ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది గొప్ప బడ్జెట్. – సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ. ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు.. సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ భవిష్యత్తును ప్రతిబింబించేలా.. 60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్‌కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది. – జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్ ఆవిష్కరణలకు దన్ను.. దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్కా వికాస్‌కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. – çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో -
సొంతిల్లు మీ లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతిల్లు వెతకటమంటే మామూలు విషయం కాదు. డెవలపర్ ఎంపిక నుంచి మొదలుపెడితే సరైన ప్రాంతం, వసతులు, ధర ప్రతిదీ ముఖ్యమే. వీటిలో ఏ మాత్రం చిన్నతేడా వచ్చినా అంతే సంగతులు. ఇలాంటి చిక్కులేవీ లేకుండా నగరంలోని నివాస, వాణిజ్య సముదాయల వివరాలన్నింటినీ ఒకే వేదికగా అందించేందుకు మరోసారి నగరవాసుల ముందుకొచ్చింది ‘సాక్షి ప్రాపర్టీ షో’. కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో శనివారం ఉదయం ఘనంగా సాక్షి ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఆరంభమైన దగ్గరి నుంచీ సందర్శకులతో కిటకిటలాడింది. మెట్రో రైలు పరుగులు మొదలయ్యాక.. నగర స్థిరాస్తి మార్కెట్లోనూ సానుకూల వాతావరణం నెలకొనడం, భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సొంతింటి ఎంపికకు ఇదే సరైన సమయమని కొనుగోలుదారులు భావించారు. దీంతో కుటుంబ సభ్యులతో సహా సందర్శకులు వచ్చిన ప్రాపర్టీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. (ప్రాపర్టీ షోను ప్రారంభిస్తున్న క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు జి.రామిరెడ్డి, చిత్రంలో సాక్షి ఏడీవీటీ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, ఏడీవీటీ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీధర్ తదితరులు) ఒకే వేదికగా సమాచారమంతా.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి నగరం నలువైపులా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల వివరాలను సందర్శకులకు అందించారు. ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, వాణిజ్య సముదాయాల సమాచారాన్ని ప్రదర్శించారు. గృహ రుణాల సమాచారం అందించేందకు ఎస్బీఐ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లను అక్కడిక్కడే రుణాలందించేందుకు దరఖాస్తులనూ తీసుకుంది. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో ఇలాంటి సమాచారం తెలిస్తేనే కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుందని పలువురు సందర్శకులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సాక్షి ప్రాపర్టీ షో నేటితో ముగియనుంది. ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య, రాంకీ, గ్రీన్‌మార్క్ డెవలపర్స్ కో–స్పాన్సర్: ప్రణీత్ గ్రూప్ ఇతర సంస్థలు: జనప్రియ, సాకేత్, ఏఆర్కే టెర్మినస్, ఆర్వీ నిర్మాణ్, గ్రీన్ఎకర్స్, ఫారŠూచ్యన్ బటర్‌ఫ్లై సిటీ, ఎస్ఆర్జీవీ వెంచర్స్, తరుణి, చీదెల్లా హౌజింగ్ ప్రై.లి., గ్రీన్ ఎన్ హోమ్, యాక్సాన్ హౌజింగ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భయం పోయింది.. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విల్లా దొరుకుతుందా అని చూస్తున్నా. ఎవరైనా మధ్యవర్తిని కలుద్దామంటే భయమేస్తోంది. సాక్షి ప్రాపర్టీ షోతో ఆ భయం పోయింది. ఆఫీసు దగ్గర్లో ఉండేలా విల్లా కోసం చూస్తున్నా. రూ.50 లక్షల పైన అయినా పర్వాలేదు. – షర్మిల, ప్రగతి నగర్ మార్కెట్‌పై అవగాహన వచ్చింది.. నగరంలో స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ధరలు వంటి వాటిపై అవగాహన వచ్చింది. స్థోమతను బట్టి స్థలాన్ని, ఇళ్లును ఎంపిక చేసుకునేందుకు ఈ షో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి షోలు జరగడం నగరవాసులకు ఎంతైనా అవసరం. పేరున్న డెవలపర్, బ్రాండెడ్ విల్లాల కోసం చూస్తున్నా. – కిరణ్, చందానగర్ ఎంతోగానో ఉపయుక్తం.. నగరంలో ఇళ్లు కొనాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రాపర్టీ షో ద్వారా వివరంగా తెలుసుకున్నా. నిర్మాణ సంస్థలు అందిస్తున్న రకరకాల ఆఫర్లతో పాటు ఇళ్లకు సంబంధించిన ఏ బ్యాంకులు ఎలాంటి లోన్లు ఇస్తాయో కూడా తెలుసుకున్నా. ఇలా విలువైన ప్రాపర్టీ షోలు మరిన్ని నిర్వహించాలి. – సింధు, నిజాంపేట ప్రాపర్టీ షోకు ఇది సరైన సమయం.. సాక్షి ప్రాపర్టీ షోతో సామాన్యులు సైతం నగరంలో సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. విలువైన సమాచారం లె లిసింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలిసింది. మెట్రో ప్రారంభమయ్యాక ఇలాంటి షో నిర్వహించడం అభినందనీయం. – అనుశ్రీ, బొటానికల్ గార్డెన్ ప్రాపర్టీ షోలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న సందర్శకులు -
అద్దె భవనాలే దిక్కు
మేడికొండూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వపరంగా వైద్యసేవలందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. మండలంలోని మేడికొండూరు, మందపాడు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా.. వాటి పరిధిలో 11 ఉపకేంద్రాలున్నాయి. ఒక్క పాలడుగు గ్రామంలో మాత్రమే ఆరోగ్య ఉపకేంద్రానికి సొంత భవనం ఉంది. పేరేచర్ల, విశదల, గుండ్లపాలెం, డోకిపర్రు, మంగళగిరిపాడు, కొర్రపాడు, జంగంగుంట్లపాలెం, వరగాని, సిరిపురం, యలవర్తిపాడు గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలన్నీ అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స నిమిత్తం సబ్సెంటర్లపైనే ఆధారపడుతుంటారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఉప కేంద్రాలు సౌకర్యాలలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎన్నో ఇబ్బందులు... నిర్దేశిత రోజుల్లో టీకాల కార్యక్రమాన్ని గ్రామాల్లోని సబ్‌సెంటర్ల వద్ద నిర్వహించాల్సి ఉన్నా.. సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా టీకాలు వేస్తున్నారు. మండలంలోనే మేజర్ పంచాయతీ పేరేచర్లలో 20వేల మంది ఉన్నారు. వీరికి కూడా ఆరోగ్య ఉపకేంద్రమే దిక్కు. అది కూడా అద్దె భవనంలో కొనసాగుతోంది. అది కూడా కునారిల్లుతోంది. చిన్నపాటి వైద్యానికైనా స్థానికులు గుంటూరు వెళ్లాల్సి వస్తోంది.రాళ్ల క్వారీలు ఎక్కువగా ఉండటంతో నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు వాటిల్లుతూనే ఉన్నాయి. వీరంతా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ అత్యవసర సేవల కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. వైద్యం కోసం దూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో స్థలాలు కేటాయిస్తే పక్కా భవానాలు నిర్మిస్తామని వైద్య ఆరోగ్యశాఖాధికారులు హామీలు గుప్పిస్తున్నా అవి అమలుకు నోచుకోవడంలేదు. ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రశాంత, పరిశుభ్ర వాతావరణంలో ఆరోగ్యకేంద్రాలు ఉంటే ప్రజలకు సురక్షిత సేవలు అందే అవకాశముంటుందని, అందుకు అనుగుణంగా సబ్‌సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది స్పందించాల్సి ఉంది. -
సొంతమైనా... అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్..!
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు కొనేందుకైనా, అద్దెకివ్వడానికైనా హైదరాబాద్ అత్యుత్తమ నగరం. ఆస్తిని కొనుగోలు చేయడానికైతే మాత్రం అహ్మదాబాద్ది రెండో స్థానం. అదే కేవలం ఇల్లు అద్దెకివ్వడానికే అయితే మాత్రం ఢిల్లీ చాలా బెటర్. ఇక ఇల్లు కొనేందుకైనా, అద్దెకిచ్చేందుకైనా అత్యంత ఖరీదైన నగరం మాత్రం ముంబై..’ ఇదీ... వ్యక్తిగత ఆర్థిక సేవల కంపెనీ అయిన అర్థయంత్ర.కామ్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు. ఇల్లు కొనడం, అద్దెకివ్వడం అనే అంశాలపై అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె వంటి ఎనిమిది నగరాల్లో సర్వే చేసి ‘బై వర్సెస్ రెంట్ రిపోర్ట్-2014’ సెకండ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. నివేదికలో హైదరాబాద్‌కు సంబంధించిన మరిన్ని విషయాలివీ... దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫ్లాట్ల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవు. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే రెండేళ్లుగా ధరలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వెయ్యి చ.అ.లకు రూ. 41.75 లక్షలు పలుకుతోంది. గతేడాది రూ. 37.64 లక్షలుగా ఉంది. అంటే ఏడాదిలో రూ. 4.11 లక్షలు పెరిగింది. రూ. 10 లక్షల నుంచి రూ. 11 లక్షల ఆదాయం గల వారు హైదరాబాద్‌లో తేలికగా ఇల్లు కొనుక్కోవచ్చు. కాకపోతే ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే చాలు. హైదరాబాద్‌లో సగ టు అద్దె ధర రూ. 12 వేలుగా ఉంది. అద్దె కోసం ఆస్తిని కొనాలనుకునేవారికి కూడా హైదరాబాదే మంచి ప్రాంతం. ఎందుకంటే నగరంలో ఈ ఏడాది అద్దె విలువలు 15 శాతం మేర పెరిగాయి. గతేడాది 11 శాతం మేర ఆస్తుల విలువలు వృద్ధి చెందాయి. మెరుగైన కార్పెట్ ఏరియా అందించడంలో కూడా హైదరాబాదే మెరుగైంది. ముంబై, ఢిల్లీలో ప్రతి ఏటా కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గిపోతోంది. రూ. లక్ష పెట్టుబడికి హైదరాబాద్‌లో ఈ ఏడాది గరిష్టంగా 23.95 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చు. ఇదే గతేడాది 26.57 చ.అ.లుగా ఉంది. అహ్మదాబాద్‌లో ఈ ఏడాది 20.18 చ.అ., పూణేలో గతేడాది 18.55 చ.అ., ఈ ఏడాది 23.39 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చు. బెంగళూరులో గతేడాది 16.01 చ.అ., ఈ ఏడాది 18.39 చ.అ., కోల్‌కత్తాలో గతేడాది 15.69 చ.అ., ఈ ఏడాది 19.52 చ.అ., కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా చెన్నైలో గతేడాది 13.16 చ.అ., ఈ ఏడాది 13.96 చ.అ., ఢిల్లీలో గతేడాది 8.55 చ.అ., ఈ ఏడాది 9.19 చ.అ., ముంబైలో గతేడాది 7.50 చ.అ., ఈ ఏడాది 9.15 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చని అర్థయంత్ర.కామ్ సర్వేలో తేలింది. ఇల్లు కొనేందుకు అహ్మదాబాద్ 2వ స్థానం, అద్దెకుండేందుకు మాత్రం 5వ స్థానంలో నిలిచింది. ఇల్లుకొనేందుకు బెంగళూరు 4వ స్థానం, అద్దెకుండేందుకు 3వ స్థానంలో ఉంది. ఇల్లు కొనేందుకైనా, అద్దెకివ్వడానికైనా అత్యంత ఖరీదైన నగరం ముంబై. ఢిల్లీ నగరం కేవలం అద్దెకుమాత్రమే అనువైందని సర్వేలో తేలింది. లాభనష్టాలు తెలుసుకోవచ్చు.. ఇల్లు కొనడం లేదా అద్దెకివ్వడం వ్యక్తి ఆర్థిక అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. అద్దె విలువ, ఆస్తి ధర, స్థూల ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే సాగింది. బడ్జెట్‌కు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకున్నాకే ఇల్లు కొనుగోలు చేయడంలో నిర్ణయం తీసుకోవాలి. సర్వేలోని అన్ని వివరాలను నిశితంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నప్పుడు మేలు జరుగుతుంది. - నితిన్ బీ వ్యాకరణం, అర్థయంత్ర ఫౌండర్, సీఈఓ