own profits
-
Rahul Gandhi: రాజ్యాంగ సంస్థలు మోదీ సొత్తు కాదు
వయనాడ్/నీలగిరి: సీబీఐ, ఈడీ మొదలుకుని కేంద్ర ఎన్నికల సంఘం దాకా ప్రతి రాజ్యాంగబద్ద సంస్థల్లోకి తమ వారిని జొప్పిస్తూ ప్రధాని మోదీ వాటిని తన సొంత ఆస్తులుగా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలోని సొంత ఎంపీ నియోజకవర్గం వయనాడ్‌లో ప్రచారంలో భాగంగా సోమవారం వల్లిమండలో రోడ్‌షో నిర్వహించి అక్కడి పార్టీ కార్యకర్తలు, ఓటర్లనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటనీ బీజేపీ హస్తగతం చేసుకుంటున్న తీరు మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇలా ప్రతి రాజ్యాంగబద్ధ విభాగంలోనూ తమ అస్మదీయులను జొప్పించడంలో ఆర్ఎస్ఎ‹స్, బీజేపీ బిజీగా ఉన్నాయి. అవే రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం విపక్షాల ‘ఇండియా’ కూటమి పాటుపడుతోంది. ఇవి ఎవరి సొంత సంస్థలుకావు. ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులు అస్సలు కావు. ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడివి. రాజ్యాంగాన్ని సవరించబోతున్నట్లు ఒక బీజేపీ ఎంపీ ఇటీవలే ప్రకటించారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. రాజ్యాంగాన్ని తమకు నచి్చనట్లు మార్చేసి జాతి సమున్నత ఆశయాలను సమాధిచేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘ కేరళను నాగ్‌పూర్(ఆర్ఎస్ఎస్ ప్రధానకేంద్రం) పాలించకూడదు. సొంత పట్టణాలు, పల్లెల నుంచే పరిపాలన సాగాలి. కేరళ ప్రజలకు ఏం కావాలో, వాళ్లేం ఆశిస్తున్నారో ఢిల్లీ(మోదీ సర్కార్)కి ఎలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎంతోకాలంగా డిమాండ్‌చేస్తున్నా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వయనాడ్ జిల్లాలో ఇంతవరకు ఒక్క వైద్యకళాశాలను ఏర్పాటుచేయలేదు. యూడీఎఫ్ ప్రభుత్వం వస్తేగానీ కాలేజీ రాదేమో’’ అని విమర్శించారు. ‘ఇంతటి అందమైన ప్రదేశం వయనాడ్‌లో ఓ వారం పది రోజులు గడపమని మా అమ్మ(సోనియా)కు చెప్పా. ఆమెకు అతి ఉక్కబోత పడదు. భువిపైనే అందమైన ప్రదేశాన్ని మిస్ అవుతున్నావని గుర్తుచేశా’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ హెలికాప్టర్లో తనిఖీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి రాహుల్ వచ్చినపుడు ఆయన ప్రయాణించిన హెలీకాప్టర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లైయింగ్ స్వా్కడ్ తనిఖీల్లో ఎలాంటి చట్టవ్యతిరేక వస్తువులు లభించలేదు. -
అక్రమాల పుట్ట.. కాల్ సెంటర్
కర్నూలు(అగ్రికల్చర్): డీఆర్డీఏ-ఐకేపీ అక్రమాలకు నిలయంగా మారాయి. ఇందులో పని చేసే సిబ్బంది సొంత లాభాలపైనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతిపై చర్యలు లేకపోవడంతో రోజురోజుకు అక్రమాలు పెరిగిపోతున్నాయి. జిల్లా సమాఖ్య బీమా కాల్ సెంటర్లో జరిగిన అక్రమాలపై చర్యలు ఉంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే చర్యలు తీసుకుంటున్నామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కాల్సెంటర్లో అకౌంటెంట్‌గా పని చేసిన విజయలక్ష్మిపై కర్నూలులోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అక్రమాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఏపీఎం రాజేష్‌పై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా సమాఖ్య తీర్మానించింది. ప్రస్తుతం రాజేష్ సస్పెన్షన్‌లో ఉన్నారు. భారీగా అక్రమాలు జిల్లా సమాఖ్య కాల్ సెంటర్లో జరిగిన అక్రమాలపై 2005-06 నుంచి 2013-14 వరకు ఇటీవల స్పెషల్ ఆడిట్ జరిగింది. ఇందులో కాల్ సెంటర్లో జరిగిన అక్రమాలు భారీగా వెలుగు చూశాయి. నిధులను నకిలీ లబ్ధిదారుల అకౌంట్లకు రూ.28.35 లక్షలు మల్లించినట్లు స్పష్టమైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.6.70 లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఈ అక్రమాలకు గతంలో పని చేసిన పీడీల ఆమోదం కూడా ఉన్నట్లుగా ఆడిట్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. 633 కుటుంబాలకు ఉద్దేశపూర్వకంగా రూ.80.65 లక్షలు డబుల్ పేమెంట్ చేసినట్లు నిర్ధారణ అయింది. 39 డెత్ క్లయిమ్‌లకు సంబంధించిన పరిహారాన్ని కాల్ సెంటరు సిబ్బంది, బంధువుల అకౌంట్లకు మళ్లించినట్లు వెల్లడైంది. సంతకాలు సైతం ఫోర్జరీ! కాల్ సెంటరులో జరిగిన అక్రమాలతో గతంలో అకౌంటెంటుగా పని చేసిన విజయలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్లు గోపాల్, శ్యామల, టెలిఫోన్ ఆపరేటర్లు ప్రసన్నకుమారికి ప్రత్యక్ష సంబంధం ఉందని తేల్చారు. మాజీ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మద్దమ్మ సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు సమాచారం. పలువురు హెచ్ఆర్ సిబ్బంది అక్రమాలతో పరోక్ష సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. కాల్ సెంటరులో పని చేసిన ముగ్గురు ఏపీఎంలు, ఇద్దరు డీపీఎంలకు పరోక్ష సంబంధం ఉన్నందున వీరిపై చర్యలకు జిల్లా సమాఖ్య డీఆర్డీఏ- వెలుగు పీడీకి సిఫారసు చేసింది.