Paid Leave
-
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్‌లోని 79వ యుఎన్‌జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్‌ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
‘నెలసరి విషయం వారికి ఎందుకు తెలియాలి?’
ఢిల్లీ: నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ అని.. అదేం వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్‌లో మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నెలసరి సమయంలో ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో పలువురు మహిళా నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇక ఈ విషయంలో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్మృతి ఇరానీ మాట్లాడారు. మహిళలకు సంబంధించిన సున్నితమైన నెలసరి విషయం ఉద్యోగం చేసే చోటు సదరు సంస్థల యాజమనులకు ఎందుకు తెలియాలి? అని అన్నారు. ఇది మహిళలకు కొంత అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవుపై ఒక తప్పనిసరి విధానం తీసుకురాలేదని వెల్లడించారు. ఒకవేళ ఒంటరి మహిళగా ఉన్న ఉద్యోగిని తాను ఆ సమయంలో సెలవు తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోతే.. తాను వేధింపులను ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపారు. అధికారికంగా పెయిడ్ లీవ్ మంజూరు చేస్తే.. ఈ విషయాన్ని సంస్థల్లో హెచ్ఆర్, అకౌంట్స్ వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. అలా పలు సంస్థల్లో పని చేసే చోట తెలియకుండానే మహిళలపై ఒక వివక్షను పెంచినవాళ్లము అవుతుమని తెలిపారు. అయితే తాను పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం సంబంధించి ప్రశ్న మరోకటిని వెల్లడించారు. ఆ రోజు ఎంపీ మనోజ్ ఝా LGBTQIA+ కోసం ప్రభుత్వం వద్ద ఏదైనా పీరియడ్ సెలవు విధానం ఉందా? అని అడిగారని తెలిపారు. గార్భాశయం లేని ఏ స్వలింగ సంపర్కుడికి రుత చక్రం ఉంటుంది? అని తాను చెసిన వ్యాఖ్యలపై మరోవిధంగా వ్యాప్తి చెంది వివాదం రేగిందని చెప్పారు. మరోవైపు మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించిన విషయం తెలిసిందే. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. చదవండి: ధన్‌ఖడ్‌పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా? -
హాట్‌టాపిక్‌గా 'పీరియడ్ లీవ్'! 'మాకొద్దు' అని వ్యతిరేకించటానికి రీజన్!
ప్రస్తుతం దేశంలో 'పీరియడ్ లీవ్' గురించే ప్రముఖులు, సెలబ్రెటీలు చర్చిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇది ఒక హాట్‌టాపిక్‌గా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పైగా అందరూ ముక్తకంఠంతో పీరియడ్ లీవ్‌ని వ్యతిరేకించడమే ఆసక్తికరంగా మారింది. దీనికి సెలబ్రెటీలు, ప్రముఖులు మద్దతు ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశం. ఎందుకిలా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ "పీరియడ్ లీవ్" అవసరమా? లేదా ఎందుకు వద్దు..? తదితరాల గురించే ఈ కథనం!. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు నెలసరి సెలవులు(menstrual leave) ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ పీరియడ్ సెలవు అంశమై నివేదిక కూడా పెట్టారు. ఈ విషయంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను ఆమె గట్టిగా వ్యతిరేకించారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో జరిగే సహజ ప్రక్రియ. అందుల్ల ఈ నెలసరి సెలవులు (menstrual leave ).. పని ప్రదేశంలో వివక్షకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. WCD Minister @smritiirani sums it up perfectly - "Menstruation is not a handicap!" Menstrual leave demand by pseudo-feminists will infact put females at a disadvantage as compared to a males. As a woman, I personally don't expect any special treatment. Gender equality, please! pic.twitter.com/14NYcwZFMs — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) December 14, 2023 ఈ అంశంపై సోమవారం పార్లమెంట్లో నివేదక కూడా పెట్టారు. దీంతో బుధవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు మనోజ్ ఝా ఎగువ సభలో రుతుక్రమ పరిశుభ్రత విధానంపై, సెలవులపై ప్రశ్నలు లేవనెత్తడంతో స్మృతి ఈ విధంగా స్పందించారు. ఐతే ఇప్పటి వరకు పిరియడ్ సెలవులు తప్పనసరి చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. స్మతీ ఇరానీ మాత్రం ఈ సెలవులను వ్యతిరేకిస్తున్నారు. దీని కోసం పోరాడి కష్టపడి సంపాదించకున్న సమానత్వాన్ని విలువ ఉండదని అన్నారు. అంతేగాదు దీన్ని ప్రత్యేక నిబంధనలు అవసరమయ్యే వికలాంగులు కోణంలో పరిగణించకూడదని చెప్పారు. ఐతే కొద్దిమంది మహిళలు మాత్రమే ఈ టైంలో డిస్మెనోరియా వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని, వీటిని చాలా వరకు మందుల ద్వారా నయంచేసుకోవచ్చని అన్నారు. అలాగే నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు కూడా చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో, 10 నుంచి 19 ఏళ్లలోపు యుక్తవయస్సులో ఉన్న బాలికల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న 'ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ (MHM)' పథకం గురించి కూడా ప్రస్తావించారు. అందరూ ఈ పీరియడ్స్‌ని సాధారణ దృక్పథంతో చూస్తే చాలు అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు మంజూరు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. స్మృతి అభిప్రాయంతో పలువురు సెలబ్రెటీ మహిళలు ఏకీభవించి మద్దతు పలకడం విశేషం. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా నయంచేసుకోవచ్చ We have fought for centuries for equal opportunities & women's rights and now, fighting for period leave might set back the hard-earned equality. Imagine employers factoring in 12-24 fewer working days for female candidates. A better solution? Supporting work from home for… — Ghazal Alagh (@GhazalAlagh) December 14, 2023 మహిళ చేయలేనిది ఏదీ లేదు..! ప్రముఖ బ్యూటీ బ్రాండ్ మామా ఎర్త్ సహ వ్యవస్థాపకుడు గజల్ అలగ్ మాట్లాడుతూ..స్మృతి పీరియడ్ లీవ్‌కి బదులుగా మెరుగైన పరిష్కారం సూచించారని ప్రసంసించారు. మహిళలు తాము ఏ పనై అయినా చేయగలమని నిరూపించారు. ఈ ఒక్క కారణంతో వారి సమానాత్వపు హక్కులను కాలరాయకూడదన్న ఆలోచన బాగుందని అన్నారు. అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం స్మృతికి మద్దతు తెలిపారు. మానవజాతి చరిత్రలో ఒక్క పని కూడా చేయని మహిళ లేదు. పిల్లలను పెంచడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అన్నిపనులు చేస్తూనే ఉన్నారు. ఈ పీరియడ్స్ అనేది జస్ట్ శరీరంలో వచ్చే ఓ నిర్దిష్ట వైద్య పరిస్థితే తప్ప అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు అవసరం లేదంటూ స్మృతి అభిప్రాయంతో ఏకీభవించారు కంగనా. సరికొత్త మార్పు.. ఇదంతా చూస్తుంటే మహిళా సాధికారతకు అసైలన అర్థం ఏంటో చెప్పారు. మాకు దయాదాక్షిణ్యాలతో పనిలేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు. సాటి మనుషులుగా ఒకరి బాధను అర్థం చేసుకుంటే చాలు తప్ప మాకదంతా అవసరంలేదని మహిళ ఆత్మివిశ్వాసాన్ని, ఔన్యత్యాన్ని చాటి చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే పురిటినిప్పిని పంటి కింద భరించగలిగే శక్తి ఉన్న స్త్రీకి ఇది ఒక లెక్క కాదు అని తేల్చి చెప్పింది. విమన్ పవర్ ఏంటో? వారి పంచ్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కదా. ద టీజ్ విమెన్ అని మరోసారి బల్లగుద్ది చెప్పారు. ఈ పేరుతో మా అవకాశాలను లాక్కొవద్దని, తాము ఎందులోనూ తక్కువ కాదు జస్ట్ ప్రకృతి సిద్ధంగా వచ్చే చిన్న ప్రక్రియ అని అందరూ తెలుసుకోండి తామెంటో చూపిస్తామని సగర్వంగా చెబుతున్నారు మహిళామణులు. -
నెలసరి లీవ్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్‌లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు. ‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్ లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్ లీవ్ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో వర్క్‌ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే అయ్యో... అని నిట్టూరిస్తున్న పరిస్థితి. అలాంటిది ఒక ఉద్యోగికి 365 రోజులు పెయిడ్ లీవ్ ఇస్తే.. వావ్.. అది కదా బంపర్ఆఫర్ అంటే. చైనాలోని ఒక ఉద్యోగి ఇలాంటి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా ఏడాది పాటు వేతనంతో కూడిన లీవ్ లభించింది. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఎలాంటి విధులు నిర్వహించకుండానే అతనికి నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. నమ్మలేకపోతున్నారా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ చదవాల్సిందే. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించిన ప్రకారం చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం షెన్జెన్ పట్టణంలోని పేరు వెల్లడించని కంపెనీ తమ ఉద్యోగి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఇటీవల వార్షిక విందును ఏర్పాటు చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కల్పించాలని భావించింది. వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ఆనోచన తోవిందులో లక్కీ డ్రాను నిర్వహించింది. ఈ డ్రా గెలుచుకున్న వారికి అధిక వేతనం, ఇతర బహుమతులతో పాటు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్) పెనాల్టీ కార్డులు కూడా ఈ డ్రాలో జోడించింది. అంటే పార్టీలో వెయిటర్‌గా వ్యవహరించడం లేదా ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమై ఒక రకంగా భయంకరమైన పానీయం తాగడం లాంటివి కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిని తోసి రాజని మేనేజర్ స్థాయి ఉద్యోగి ఒకరు 365 రోజుల సెలవుతో కూడిన బంపర్‌ప్రైజ్ గెల్చుకోవడంతో ఎగిరి గంతేశాడు. అతడు దీనికి సంబంధించిన చెక్ పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) 男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO — The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023 మరోవైపు కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి చెన్ మాట్లాడుతూ ఈ సెలవును నగదుగా మార్చుకోవాలనుకుంటున్నారా లేదా ఆనందించాలనుకుంటున్నారా అనేది నిర్ణయించడానికి విజేతతో కంపెనీ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పీరియడ్ లీవ్స్ కొరకు పిల్.. తిరస్కరణ
ఢిల్లీ: విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో ఋతుస్రావ సమయంలో.. సెలవులు మంజూరుచేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను విధివిధానాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది తమ పరిధిలోని అంశం కాదంటూనే.. పిటిషనర్‌కు కీలక సూచన చేసింది ధర్మాసనం. ఇది మా పరిధిలోని అంశం కాదు. విధివిధానాల రూపకల్పనకు సంబంధించింది. కాబట్టి, పిటిషనర్ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించడం సముచితంగా ఉంటుంది అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి నెలా మహిళా ఉద్యోగులకు ఋతు నొప్పి సెలవులు(పీరియడ్స్ లీవ్) మంజూరు చేయాలని కంపెనీలు/యజమానులపై ఒత్తిడి చేస్తే.. అది ఉద్యోగ నియామకాల్లో తీవ్ర ప్రభావం చూపెడుతుందని పిల్‌ను వ్యతిరేకించిన న్యాయవాది(లా స్టూడెంట్ ఒకరు) బెంచ్ ముందు వాదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పిల్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. అయితే.. ఈ ప్రజాప్రయోజన వాజ్యం ద్వారా పిటిషనర్ కొన్ని కీలకాంశాలను లేవనెత్తారని.. కాకపోతే ఇది విధానాల రూపకల్పనకు సంబంధించి కావడంతో.. పిల్‌పై విచారణ ముందుకు సాగించలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి.. లాయర్ విశాల్ తివారీ ద్వారా ఈ పిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961లోని సెక్షన్ 14ను అన్ని రాష్ట్రాలు పాటించేలా కేంద్రం ద్వారా ఆదేశాలు ఇప్పించాలని పిటిషనర్ కోరారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, స్పెయిన్(మూడు రోజులు.. వీలును బట్టి ఐదు రోజులకు కూడా పొడిగించొచ్చు), జాంబియా.. ఇలా చాలా దేశాల్లో పీరియడ్స్ లీవ్‌లను మంజూర చేస్తున్నారు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961 ప్రకారం.. మహిళలు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పెయిడ్ లీవ్ పొందే ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి గర్భం దాల్చిన సమయంలో. అందునా.. ఆ నిబంధనల పర్యవేక్షణ కోసం సెక్షన్ 14 ప్రకారం ఒక ఇన్స్పెక్టర్ నియమించాల్సి ఉంటుంది కూడా. అయితే.. కేంద్ర ప్రభుత్వం అలాంటి పర్యవేక్షకులను ఇంతదాకా నియమించలేదు అని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అంతేకాదు దేశంలో బీహార్ రాష్ట్రం మాత్రమే 1992 నుంచి రుతుస్రావ సమయంలో ప్రత్యేక సెలవులను రెండురోజులపాటు మంజూరు చేస్తూ వస్తోందని సదరు పిటిషనర్ బెంచ్‌కు తెలిపారు. అలాగే జొమాటో, బైజూస్, స్విగ్గీ కూడా పెయిడ్ లీవ్స్‌ను మంజూరు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వికిపీడియా సమాచారం ప్రకారం.. కేరళ ప్రాంతంలో 1912 సంవత్సరంలో ఓ బాలికల పాఠశాలకు పీరియడ్స్ లీవ్స్ మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అంతేకాదు.. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కూడా. -
పెయిడ్ లీవ్స్ లేనివాళ్లను చూస్తే ఆందోళనగా ఉంది’
పెప్సీకో వంటి అంతర్జాతీయ బ్రాండ్‌కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేసి సంస్థను లాభాల్లో పెట్టిన వనితగా ఇంద్రానూయికి పేరుంది. ఇరవై ఐదేళ్ల పాటు పెప్సీకోలో వివిధ హోదాల్లో పని చేసిన ఆమె 2018లో సీఈవోగా అక్కడ రిటైర్ అయ్యారు. అయితే ఒక ఉద్యోగి జీవితంలో పెయిడ్ లీవ్స్ ప్రాముఖ్యత ఎంత ఉంటుందనే అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమె చెప్పుకొచ్చారు... నా కెరీర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)లో పని చేస్తున్నాను. అప్పుడు మా నాన్నకి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. నేను ఆయన్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో పెయిడ్ లీవ్స్ అడిగితే ముందు కుదరదని చెప్పారు. దీంతో నా జీవితం ఒక్కసారిగా డోలాయమానంలో పడింది. ఓ వైపు తండ్రి ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, మరోవైపు జాబ్ వదిలేయాల్సిన పరిస్థితి. ఏం చేయాలో పాలుపోలేదు అంటూ ఆనాటి రోజులను ఇంద్రానూయి జ్ఞాపకం చేసుకున్నారు. చివరకు ఎలాగోలా మా నాన్నను చూసేందుకు సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న చనిపోయారు. ఈ సమయంలో కంపెనీ నాకు ఆరు నెలల పాటు పెయిడ్ లీవ్ మంజూరు చేసింది. అయితే నాన్న అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే మూడు నెలల రెండు రోజుల తర్వాత నేను తిరిగి విధుల్లో చేరాను. నాకు అవసరం లేకపోవడంతో దాదాపు మూడు నెలల పాటు పెయిడ్ లీవ్స్ వదులుకున్నాను. కంపెనీ నాకు పెయిడ్ లీవ్స్ నిరాకరించడం, ఆ తర్వాత మంజూరు చేయడం, పనిపై మక్కువతో నేను పెయిడ్ లీవ్స్ పూర్తిగా వాడుకోకపోవడం వంటివి అసాధారణ విషయాలేమీ కాదు. కానీ కనీసం పెయిడ్ లీవ్స్ ఉంటాయని తెలియని వాళ్లు, పెయిడ్లీవ్స్ లేకపోయినా అనేక కష్టాల మధ్య ఉద్యోగాలు చేసే వాళ్లని తలచుకుంటేనే నాకు బాధగా ఉందంటూ తెలిపారు ఇంద్రానూయి. కంపెనీ అభివృద్ధికి అహార్నిషలు పని చేసే ఉద్యోగులకు కష్టకాలంలో అక్కరకు వచ్చేలా పెయిడ్ లీవ్స్ ఉండాలనే అర్థంలో అమె కామెంట్లు చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంద్రనూయి లాంటి పేరొందిన సీఈవో నోట పెయిడ్ లీవ్స్‌పై వ్యాఖ్యలు రావడం కార్పోరేట్ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించినంత వరకు శుభపరిణామం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: Indra Nooyi: మన్మోహన్సింగ్, బరాక్ ఒబామా.. ఆ రోజు ఎన్నడూ మరువలేను -
దొరికిన ఇంటి దొంగ: సెలవుల పేరిట రూ.10 కోట్ల లూటీ
అహ్మదాబాద్ (గుజరాత్): ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆయనే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టాడు. లొసుగులను ఆసరాగా చేసుకుని ఏకంగా దాదాపు పది కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. ఆ నిధులను తన కుటుంబసభ్యుల ఖాతాల్లో జమ చేయించి ఏమీ తెలియని వ్యక్తిలా మళ్లీ కార్యాలయంలో కొనసాగుతున్నాడు. ఈ అవకతవకలు వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టగా అతడి మోసం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ప్రాథమిక విద్యా శాఖ (ప్రైమరీ ఎడ్యుకేషన్)లో డిప్యూటీ అకౌంటెంట్‌గా రాజేశ్ రామి పని చేస్తున్నాడు. అకౌంట్ వ్యవహారాలు ఆయన ద్వారానే జరుగుతుండడంతో మనసులో దుర్బుద్ధి కలిగింది. అనుకుందే తడువుగా ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పేరిట మోసం చేయాలని పన్నాగం పన్నాడు. అందులో భాగంగా ఉపాధ్యాయుల పేరిట 5,000 నకిలీ పెయిడ్ లీవ్స్ (చెల్లింపు సెలవు)ను దరఖాస్తు చేశాడు. ఆ పెయిడ్ లీవ్స్‌ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చుకున్నాడు. అతడి ఖాతాలో కాకుండా తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. అయితే ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించడం ప్రతి శాఖలో జరుగుతుంది. ఈ క్రమంలో ప్రాథమిక విద్యా శాఖకు సంబంధించి అహ్మదాబాద్ జిల్లాలో ఆడిట్ నిర్వహించగా అతడి మోసం బహిర్గతమైంది. 2016-17, 17-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలుకా పరిధిలో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో జూలై 15వ తేదీన రాజేశ్ రామిపై ఫిర్యాదు చేశారు. కరంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఈ మోసం బయటపడడంతో రాజేశ్ పరారయ్యాడు. -
అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు సెలవులు.. సగం జీతం
భోపాల్: కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైన సంగతి తెలిసిందే. వేవ్ మీద వేవ్ ముంచుకొస్తూ.. జనాలను, ఆర్థిక వ్యవస్థను కుదుటపడనీయడం లేదు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించే చర్యలకు పూనుకున్నాయి. దుబారా ఎక్కడవుతుందో గమనిస్తూ.. కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాలు మినహా.. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇస్తూ.. సగం జీతం ఇవ్వడానికి నిర్ణయించారు అదికారులు. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు మధ్యప్రదేశ్ అధికారులు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు. ఉద్యోగం చేయకపోయినా సగం జీతం తీసుకునే పథకం ఇది. మూడేళ్లనుంచి ఐదేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా విధులకు హాజరు కాకుండా సగం జీతం తీసుకోవచ్చని చెబుతున్నారు. మిగతా సగం జీతాన్ని ప్రభుత్వం తన ఖాతాలో మిగుల్చుకుంటుంది. దీని వల్ల ఏటా 6వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ పథకానికి ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే అమలులోకి వస్తుంది. మధ్యప్రదేశ్‌లో అమలు చేయాలనుకుంటున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటున్నప్పటికి.. మన దేశంలో మాత్రం పనిలేకుండా సగం జీతం ఇవ్వడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. కరోనా వల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయంది. 2.53లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 30శాతం ఆదాయంలో కోతపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం ఎలాగా అని తలలు పట్టుకున్నారు అధికారులు. ఓవైపు నిరర్థక ఆస్తులను అమ్మే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా ఇప్పటికే 500కోట్ల రూపాయలు సమీకరించారు. -
వారం రోజుల పెయిడ్ లీవ్ : ఉద్యోగులకు పండగే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సంస్థంలోని ఫుల్ టైం ఉద్యోగులకు ఏకంగా వారం రోజుల పాటు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కష్టించిన పనిచేసిన తమ సిబ్బంది ఒత్తిడిని అధిగమించి, రిలాక్స్ అయ్యి, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రీఛార్జ్ అయ్యేందుకు వీలుగా ఈ వెసులుబాటును కల్పిస్తోంది. వచ్చే సోమవారం (ఏప్రిల్ 5 ) నుంచి ఇది అమలు కానుంది. తద్వారా దాదాపు 15,900 మంది పూర్తికాల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ "రెస్టప్!" అంటూ వారం రోజుల సెలవును ఉద్యోగులకు కల్పిస్తోది. ఈసందర్భంగా లింక్డ్ఇన్ కీలక ఉద్యోగి తుయిలా హాన్సన్ మాట్లాడుతూ, సంస్థ కోసం కష్టపడి పనిచేసిన తమ ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. వారు మంచి సమయం గడపాలని భావిస్తున్నామని తెలిపారు. సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగులందరూ పూర్తి శక్తితో పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే మెయిట్ టీం ఈ వారంలో పని చేస్తారు. ఆ తరువాత వారు కూడా ఈ సెలవును తీసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు సేద తీరనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు లింక్డ్ఇన్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించుకోవచ్చు. అంతేకాదు సగానికి సగంమందికి ఇంటినుంచే పనిచేసే విధానాన్ని ప్రామాణింగా మార్చాలని కూడా యోచిస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ 2016 మధ్యలో లింక్డ్ఇన్ను 26.2 బిలియన్లకు కొనుగోలు చేసింన సంగతి తెలిసిందే. -
పురుష ఉద్యోగులకు 730 పెయిడ్ లీవులు
సాక్షి, ముంబై: అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకునేందుకు బెస్ట్ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు పేయిడ్ లీవులు ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు, వారికి 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది. దీంతో ఇంటివద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు. వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొందరి ఇళ్లలో తల్లులుగాని, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరుండరు. దీంతో గత్యంతరం లేక తండ్రులే వారి బాగోగులు చూసుకోవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సెలవుపెట్టి ఇంటివద్ద ఉండటం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు పదవీ విరమణ పొందేవరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చేవరకు 730 సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించినట్లు బెస్ట్ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ షిండే తెలిపారు. ఈ సెలవులు పొందాలంటే దరఖాస్తుతోపాటు 40 శాతం వికలాంగుడిగా ఉన్నట్లు సర్టిఫికెట్ జోడించాల్సి ఉంటుంది. వికలాంగ పిల్లలు తనపై ఆధారపడి ఉన్నట్లు సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది. చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే. -
పెయిడ్ లీవ్ ఇస్తున్నారా?
ప్రపంచం స్తంభించి పోయింది. కరోనా కనుచూపుతో ప్రపంచాన్ని శాసిస్తోంది. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మరింత బాధ్యతగా పని చేస్తున్నారు. ఆన్లైన్లో పని చేసుకోగలిగిన రంగాలు యథావిధిగా పని చేసుకుంటున్నాయి. ఆ ఉద్యోగులు ఇంటి నుంచే సేవలందిస్తున్నారు. విరామం తీసుకోగలిగిన సర్వీసులన్నీ విశ్రాంతిలోకి వెళ్లిపోయాయి. ఆ ఉద్యోగులు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇవన్నీ వ్యవస్థీకృత రంగాలే. ఈ ఉద్యోగుల్లో ఎవరికీ జీతాల ఇబ్బంది లేదు. నెల పూర్తయ్యేటప్పటికి బ్యాంకు అకౌంట్లో జీతం జమ అయిపోతుంది. పైగా యాభై వేలకు పై బడిన జీతాలు, ఆరంకెల జీతాలు అందుకుంటున్న కుటుంబాలే ఎక్కువ. అయితే ఈ కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్న కుటుంబాలు లెక్కకుమించి పోతున్నాయి. (కష్టకాలంలో క్రీడాకారుల ఔదార్యం) పై ఇళ్లలో పని చేసే ఇంటిపని మనుషులకు జీతాల భద్రత మీద వేటు పడుతోంది. ‘ఇంటి పనులకు వచ్చే డొమెస్టిక్ హెల్పర్లు నాలుగైదు ఇళ్లలో పని చేస్తుంటారు. కాబట్టి కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది’ అనే ముందు జాగ్రత్తతో అనేక మంది పనివాళ్లను పనులకు రావద్దని చెప్పేస్తున్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్త విషయంలో ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. అయితే వాళ్లకు నెల చివరి రోజున ఇచ్చే జీతంలో కోత పడే దుస్థితి నెలకొంటోంది. ఎన్ని రోజులు పని చేశారో లెక్క చూసి, రోజు వంతున లెక్క చూసి డబ్బిచ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు డొమెస్టిక్ హెల్పర్స్‌ని కరోనా వైరస్ కంటే రాబోయే నెల బడ్జెటే ఎక్కువగా భయపెడుతోంది. వైట్ కాలర్జాబ్ వాళ్లకు వర్తిస్తున్న పెయిడ్ లీవ్ వీళ్లకు వర్తించదా? ‘‘డొమెస్టిక్ హెల్పర్స్ శ్రమ దోపిడీ తప్ప, వారికి భద్రత లేని వ్యవస్థ మనది. అసంఘటిత రంగంలో కూడా జీత భద్రత కోసం తమ యూనియన్ నలభై ఏళ్లుగా పోరాడుతూనే ఉంద’’ని చెప్పారు మేరీ క్రిస్టీన్. ఆమె ముంబయిలోని ‘నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ మూవ్మెంట్’ కో ఆర్డినేటర్. యాభై వేల మంది సభ్యులున్న యూనియన్ ఇది. ‘‘ముంబయిలో ఊర్మిళ అనే మహిళ అనేక ఇళ్లలో వంట చేస్తుంది. ఆమె మార్చి నెలలో 18 రోజులు మాత్రమే పని చేయగలిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడంలో భాగంగా ఆమెను పనికి రావద్దని చెప్పారు యజమానులు. అయితే నెలలో మిగిలిన రోజులకు జీతం ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్లు పని చేసే ఇళ్లలో ఏ ఇంట్లో ఎవరు ఎప్పుడు బయటి దేశాల నుంచి వస్తారో, ఎవరి నుంచి వాళ్లకు వైరస్ సంక్రమిస్తుందో ఎవరమూ ఊహించలేం. అయినా పని చేయకపోతే గడవదనే భయంతో పని చేయడానికి సిద్ధమవుతున్నారు. వైరస్ వ్యాప్తికి మేము వాళ్లు కారణం కావచ్చనే జాగ్రత్తను కాదనం. కానీ వాళ్లు కూడా నెల పొడవునా తిండి తినాలి కదా, జీతంలో కోత పెడితే ఎలా బతకాలి’’ అని డొమెస్టిక్ హెల్పర్లకు ఎదురైన కష్టాన్ని చెప్పారు క్రిస్టీన్. దొడ్డ బెంగళూరు ముంబయిలో పరిస్థితి ఇలా ఉంటే... బెంగళూరు, ఆర్టీ నగర్‌కు చెందిన భాగ్యమ్మ అనుభవం మరోలా ఉంది. ఆమె క్వీన్స్ కార్నర్ అపార్ట్మెంట్లో పని చేస్తోంది. ఆమె యజమాని గీత రాచ్ కూడా ఈ సంక్షోభం ముగిసే వరకు భాగ్యమ్మను పనికి రానక్కరలేదని చెప్పింది. కానీ నెల మొత్తానికి జీతం ఇచ్చేసింది. అలాగే గుర్గావ్కి చెందిన మీడియా రంగ ఉద్యోగి గీత కూడా తన డొమెస్టిక్ హెల్పర్‌కి నెల జీతం మొత్తం ఇచ్చేసింది. మరి హైదరాబాద్ పని వాళ్లను కదిలిస్తే... ‘రావద్దని చెప్పారు. కానీ నెల జీతం ఎలాగిస్తరో ఏమీ చెప్పలేదు. చాలా మంది మాకు నెల దాటిన తరవాత ఐదారు రోజులకు కానీ ఇవ్వరు. వచ్చే నెల ఎంత చేతిలో పెడతారో? ఆ నెల ఎలా గడవాలో తెల్వట్లేద’ని ఆవేదనగా చెప్పారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వంటి కొన్ని చోట్ల మాత్రం నెల జీతం మొత్తం ఇచ్చే పద్ధతిలోనే డొమెస్టిక్ హెల్పర్స్‌కి పెయిడ్ హాలిడే ప్రకటించారు. మధ్య తరగతి నివసించే ప్రదేశాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. వాళ్లందరికీ ఒక విన్నపం. భగవంతునికి పూజలు చేసి భక్తిగా హుండీలో వేసే డబ్బుని మన ఇంట్లో పని చేసే వాళ్లకు ఇస్తున్నాం అనుకోగలిగితే చాలు. పని చేయని రోజులకు జీతం ఇస్తున్నామని మనసు బాధ పడదు. పైగా సాటి మనిషికి ఇవ్వడంలో ఉన్న సంతోషం సొంతం అవుతుంది. పూర్తి జీతం ఇచ్చి మన ఇంటి పని మనిషి కళ్లలో సంతోషాన్ని ఆస్వాదించవచ్చు. – మంజీర -
మైక్రోసాప్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మైక్రోసాప్ట్ ఇండియా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. సంరక్షకుని సెలవు(కేర్‌గివర్ లీవ్) పేరిట నాలుగు వారాల పెయిడ్ లీవ్‌ను ప్రకటించింది. కుటుంబసభ్యులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే వారికి సంరక్షకునిగా ఉండేందుకు ఈ పెయిడ్ లీవ్‌ను ఉద్యోగులకు అందించనున్నట్టు మైక్రోసాప్ట్ పేర్కొంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తామామలు, తోబుట్టువులు, తాతయ్య,నాన్నమ్మలు, సంతానం వంటి వారిని ప్యామిలీ కేర్‌గివర్ లీవ్‌లో చేర్చింది. ఈ సెలవు కింద ఉద్యోగులకు వేతనం చెల్లించనుంది. గతేడాదే కంపెనీ ప్రసూతి సెలవు కింద 26 వారాలను తమ ఉద్యోగులకు అందించనున్నట్టు ప్రకటించింది. పురుష ఉద్యోగులు కూడా ఆరు వారాల పితృత్వ సెలవును పెట్టుకోవచ్చని తెలిపింది. దీనిలోనే సరోగసీ లేదా దత్తత కూడా ఉంటాయని చెప్పింది. కుటుంబసభ్యులకు వారి అవసరం మేరకు ఉద్యోగులు ఏం చేయాలనిపిస్తే అది చేసుకునే విధంగా తమ విధానాలను రూపొందిస్తున్నామని మైక్రోసాప్ట్ హెచ్ఆర్ అధినేత ఇరా గుప్తా తెలిపారు. సంరక్షకుని సెలవును విస్తరించుకోవచ్చు. ఏడాదంతంటా ఉద్యోగి ఏ రూపంలోనైనా దీన్ని వాడుకోవచ్చని పేర్కొన్నారు. భారత్ లో మైక్రోసాప్ట్ కు 8000 మంది ఉద్యోగులున్నారు. ముఖ్యంగా మహిళలు వర్క్ చేస్తున్న ప్రాంతాల్లో తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనని కన్సల్టెంట్స్ చెబుతున్నాయి.