ఉధృతంగా ప్రవహించిన పాకాల వాగు
ఖానాపురం : మండలంలోని అశోక్‌నగర్ శివారులోని పాకాల వాగు బుధవారం ఉదృతంగా ప్రవహించింది. మత్తడి ద్వారా వచ్చే నీరు పాకాల వాగుద్వారా అశోక్‌నగర్ శివారులోని రోడ్డుపై నుంచి ప్రవహించడంతో నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కూల్ బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లు కొందరు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు పైనుంచి దాటిం చగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై దుడ్డెల గురుస్వామి వాగువద్దకు చేరుకోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.