palair
-
టీఅర్ఎస్ గెలుపు తథ్యం : తుమ్మల
-
అక్కడ 56 ఏళ్లలో.. ఆడవాళ్ళకు రెండుసార్లే అవకాశం వచ్చింది
ఖమ్మంరూరల్: పాలేరు నియోజకవర్గం ఏర్పడిన 1962 నుంచి 2016 ఉప ఎన్నికల వరకు మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగాయి. 2014 వరకు కూడా మహిళలకు పోటీ చేసే అవకాశం ఏ పార్టీ కూడా కల్పించలేదు. పాలేరులో ప్రస్తుతం 2,04,530 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,04,222 మంది ఉంటే పురుషులు 1,00, 293 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 3,929మంది అధికంగా ఉన్నారు. ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో అన్నిరంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం మహిళలకు అవకాశాలు ఇవ్వడంలేదు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరుమలాయపాలేనికి చెందిన మద్దినేని స్వర్ణకుమారికి అవకాశం ఇవ్వడంతో ఆమె అప్పటి ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వర్ణకుమారి 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2016లో రాంరెడ్డి సుచరితారెడ్డికి.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2016లో మృతి చెందడంతో తిరిగి పాలేరులో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డి సతీమణ రాంరెడ్డి సుచరితారెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఆమె ఆ ఉప ఎన్నికల్లో 50వేలు ఓట్లు సాధించారు. అనంతరం ఆమె రాజకీయాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఆమె కూడా పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే 14సార్లు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు సార్లు మాత్రమే మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించడం గమనార్హం. 1999లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న స్వర్ణకుమారి 1999లో రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఉద్యోగం వదులుకుని వచ్చినా ఆమెను ప్రజాప్రతినిధిగా పదవీ వరించలేదు. -
రెండు గంటల్లోనే పాలేరు భవితవ్యం!
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన రెండు గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 13మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని పత్తి మార్కెట్‌కు తరలించారు. ఈ మార్కెట్ యార్డులోనే ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 243 పోలింగ్ కేంద్రాల్లో 243 ఈవీఎంలను 14 టేబుళ్లపై ఉంచి 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇందుకు తగిన యంత్రాంగాన్ని నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు. పత్తి మార్కెట్‌యార్డు ప్రాంగణమంతా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పాలేరులో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకు తెలంగాణ టీడీపీ మద్దతు తెలిపింది. ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. గత సంప్రదాయలను అనుసరించి పాలేరు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే ఆ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ప్రతిపాదనను టీడీపీనే తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సుచరితకు మద్దతు తెలుపుతున్నమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపాలని రమణ కోరారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో దిగుతారని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తుదిపోరులో అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తలపడనున్నాయి. ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఉంటూ అకాలమరణం చెందిన వెంకట్‌రెడ్డి స్థానంలో ఆయన కుటుంబీకులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశమివ్వాలని టీపీసీసీ ప్రతిపాదించింది. కానీ అధికార టీఆర్ఎస్ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య సుచరిత బరిలో ఉండగా, టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. మే16న పోలింగ్, 19న కౌంటింగ్ జరగనుంది.