palaniswamy wins
-
బలపరీక్షపై సినీ స్టార్స్ మండిపాటు!
తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న హైవోల్టెజ్ డ్రామా అనంతరం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 122 మంది సభ్యుల మద్దతుతో ఆయన మెజారిటీ నిరూపించుకున్నారు. అయితే, అంతకుముందు తమిళనాడు శాసనసభలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, అల్లరితో సభ గందరగోళంగా మారిపోయింది. రెండుసార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు మైక్‌లు, బల్లాలు విరిచివేయడమే కాకుండా..స్పీకర్‌ను నెట్టేసి ఆయన స్థానంలో కూర్చున్నారు. తీవ్ర గలాటా సృష్టించారు. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ హాసన్ సహా రాధిక, ఖుష్బూ, అరవింద స్వామి తదితరులు తీవ్రంగా స్పందించారు. 'మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోంది. జై డె'మాక్'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంద'ని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైనరీతిలో స్వాగతం పలుకుతారంటూ హెచ్చరించారు. సినీ నటి ఖుష్బూ స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమంటే ప్రజాస్వమ్యానికి అది విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్ రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని సినీ రాధికా శరత్‌కుమార్ కోరారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరని, ఎమ్మెల్యేలు కలువాల్సింది ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని సినీ నటుడు అరవింద స్వామి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయకుండా మీడియాను బ్లాక్ చేసి.. ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. -
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
-
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
చెన్నై: తీవ్ర గందరగోళ పరిస్థితులు, నాటకీయ పరిణామాల నడుమ జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 122మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంతకుముందు తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ సహా.. ఆ పార్టీ సభ్యులను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్ బయటకు గెంటేశారు. దీంతో స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. స్పీకర్ తీరు, మార్షల్స్ బలవంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టాలిన్ తన ఎమ్మెల్యేలను తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లారు. ఇంతలోనే స్పీకర్ ధనపాల్ సభను సమావేశపరిచి.. ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌తోపాటు, ముస్లింలీగ్ తదితర విపక్ష సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. విపక్షం లేకుండానే స్పీకర్ బలపరీక్ష చేపట్టి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పళనిస్వామి విజయం నల్లేరు మీద నడకే అయింది. ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో సునాయసంగా పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా తన పదవిని సుస్థిరం చేసుకున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి.. తాను ముఖ్యమంత్రి కావాలనుకున్న పన్నీర్ సెల్వం ఆశలు అడియాసలయ్యాయి. -
విశ్వాపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
-
విశ్వాసపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు వ్యతిరేకించినా, తన శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలన్ని వ్యతిరేకంగా నిలబడినా పళనిస్వామి సభలో మెజార్టీ నిరూపించుకున్నారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విపక్షం సభ్యులు లేకుండానే నిర్వహించిన బలపరీక్షలో పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు.