paleru constituency
-
నన్ను జైలుకు పంపుతారా?.. ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూరల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. శ్రీనివాసరెడ్డి నామినేషన్‌కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. తన నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందించారు. శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా పంపించడంతో పోలీసులు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, నామినేషన్ దాఖలు అనంతరం సాక్షి టీవీతో మాట్లాడిన పొంగులేటి.. తన ఇంటిపై జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందించారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రులు 32 ఇళ్లపై 400 మంది అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు’’ అని తెలిపారు. నామినేషన్ వేస్తానని తెలిసి ఐటీ అధికారులు వచ్చారు. నన్ను నామినేషన్ వేయడానికి వెళ్లకూడదన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న 10వేల మంది కార్యకర్తలు, నాయకులు నా ఇంటికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ, కేంద్ర ప్రభుత్వాలు భయపడ్డాయి. అందుకే నాకు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆరెస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం. ఏ వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా నామినేషన్ వేయవచ్చు. ఐటీ అధికారులకు సహకరిస్తాను. నియోజకవర్గంలో పర్యటిస్తాను. నా ఆస్తులను సీజ్ చేస్తారా? నన్ను జైలుకు పంపుతారా.? నన్ను ఏం చేసినా వెనుకడుగు వేయను. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
పాలేరులోనే పొంగులేటి!
సాక్షిప్రతినిది, ఖమ్మం: పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది! త్వరలో కాంగ్రెస్ విడుదల చేసే రెండో జాబితాలో ఆయన పేరు ఉంటుందని అనుచర వర్గం చెబుతోంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అనుచరులు ప్రచారం మొదలుపెట్టగా.. ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి నాలుగు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. తాజాగా శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలోని సాయిగణేష్ నగర్లో నియోజకవర్గ స్థాయి క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే, ప్రచార సామగ్రి, వాహనాలు కూడా సిద్ధమయ్యాయని... జాబితా వెలువడగానే పొంగులేటి నేరుగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. గడపగడపకూ... గత నెలరోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు. గడప గడపకూ కాంగ్రెస్ పేరిట నాలుగు మండలాల్లో ప్రసాదరెడ్డితోపాటు తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు పర్యటిస్తూ కాంగ్రెస్ గ్యారంటీలను వివరించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ ప్రచార సరళిపై సూచనలు చేస్తున్నారు. అందరినీ కలుపుకుని.. పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ ఖాయమైనట్లు తెలుస్తుండగా.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కలుపుకువెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ టికెట్లు ఆశించిన నేతలను కలిసి చర్చించారు. అలాగే, స్థానిక నేతలను ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో శ్రేణులు, సానుభూతిపరులను సమన్వయం చేసే బాధ్యతను ప్రసాదరెడ్డి తీసుకోగా.. ఆయనకు తోడు తుంబూరు దయాకర్‌రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ హోదాలో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో జరిగే ప్రచారంలో కూడా ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. ఈనేపథ్యాన పాలేరు నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను ప్రస్తుతానికి ప్రసాదరెడ్డి చూస్తున్నారు. జాబితా వస్తే మరింత హోరు ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో ప్రసాదరెడ్డి పర్యటిస్తుండగా, రాష్ట్రస్థాయి వ్యవహారాల్లో పొంగులేటి బిజీగా ఉన్నారు. రెండో జాబితాలో ఆయన పేరు వెలువడ్డాక నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుస్తోంది. అభ్యర్థిత్వం ఖరారై.. నామినేషన్ దాఖలు అనంతరం పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు పొంగులేటి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఇంతకుముందే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు పొంగులేటి హాజరయ్యారు. అయితే, అభ్యర్థి పేరు అధికారికంగా వెలువరించని నేపథ్యాన ఆయన సోదరుడి నేతృత్వాన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. క్యాంపు కార్యాలయం ప్రారంభం నియోజకవర్గ వ్యవహారాలు చక్కపెట్టేందుకు ఖమ్మం రూరల్ మండలం సాయిగణేష్ నగర్లో ఏర్పాటుచేసిన క్యాంపు కార్యాలయాన్ని ప్రసాదరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలాగే, నేలకొండపల్లిలో మండల క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. రెండు రోజుల్లో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో కూడా కార్యాలయాలను ప్రారంభించనుండగా.. సాయిగణేష్ నగర్‌లోని క్యాంపు కార్యాలయం ద్వారానే నియోజకవర్గ స్థాయి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇక ప్రచారానికి సంబంధించి వాహనాలు, జెండాలు, స్టిక్కర్లు ఇతర ప్రచార సామగ్రి సైతం సిద్ధమయ్యాయని.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. -
వైఎస్ఆర్టీపీ పాలేరు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
-
పాలేరు నియోజకవర్గం నుంచిచే అసెంబ్లీకి పోటీ చేస్తాను: వైఎస్ షర్మిల
-
YS Sharmila: పాలేరు నుంచే పోటీ చేస్తా
నేలకొండపల్లి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. పాలేరులో గెలవడం సమస్య కాదని, కనీవినీ ఎరగని మెజారిటీ వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆదివారం జరిగిన పాలేరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచీ ఉందని, ప్రస్తుతం ప్రజలతోపాటు తన అభీష్టం కూడా అదేనని ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వైఎస్సార్ అనే పేరుకు తామే వారసులమని, ఇతర వ్యక్తులకు, ఏ పార్టీకి ఆ హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు. ఖమ్మం అంటే వైఎస్సార్ జిల్లా అని, ఈ జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫొటో పెట్టుకుని గెలిచారని గుర్తు చేశారు. వైఎస్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలని ఆకాంక్షించారు. ‘ఇకపై షర్మిల ఊరు పాలేరు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తారు. వైఎస్ వారసులమైన మనం భయపడతామా?’అని పేర్కొన్నారు. ఆయన అవినీతి గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేక అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. బయ్యారం మైనింగ్‌లో తమకు వాటాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారని, తన బిడ్డలపై ఒట్టేసి చెబుతున్నానని.. ఎలాంటి భాగాలు లేవని ఆమె తెలిపారు చదవండి: (‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది’) -
పాలేరు నుంచి పోటీ: వైఎస్ షర్మిల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేస్తానని వైఎస్ షర్మిల వెల్లడించారు. బుధవారం ఆమె లోటస్ పాండ్‌లోని తన కార్యాలయంలో ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ సానుభూతిపరులు మాట్లాడుతూ.. అధికార పక్షంతో ఎదురవుతున్న ఇబ్బం దులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్న సంక్షేమ పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మీరు వేసే అడుగులో అడుగు వేస్తామని చెప్పారు. షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగేనని, పాలేరు నుంచే బరిలోకి దిగుతానని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని చెప్పారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ విధి విధానాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. సభకు పోలీసు అనుమతులు సైతం లభించి నట్లు షర్మిల తెలిపారు. సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ అభిమానులను కోరారు. -
కొందరు కావాలనే ఓడించారు: తుమ్మల
సాక్షి, ఖమ్మం జిల్లా: గత ఏడాది కలిసి రాలేదని, కొందరు స్వార్థపరులు కావాలనే పని గట్టుకొని మనల్ని ఓడించారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సత్తుపల్లిలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. గంట పాటు అనుచరులు, కార్యకర్తలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. (చదవండి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన) రాజకీయాల్లో అటు పోట్లు, గెలుపు ఓటములు సహజం. ఓటమి గురించి ఆలోచించకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయ కారణాలు ఎలా ఉన్న కొంత కాలం సర్దుకుని పోవాలన్నారు. తాత్కాలిక ఇబ్బందులు వచ్చిన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని తెలిపారు. వేల మంది తన కోసం రావడం ఆనందం ఉందని, రాబోయే రోజుల్లో అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేసీఆర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుచరులకు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.(చదవండి: ‘30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’) -
టీఆర్ఎస్ను ఓడించాలి: జానా
ఖమ్మం: ‘రోజూ పార్టీల ఫిరాయింపులు, మాట వినని నాయకులను భయపెట్టి, డబ్బులు, కాంట్రాక్టులు ఎరపెట్టి పార్టీలు మారేలా చేయడం.. ఇలా ప్రజాస్వామ్యం, విలువలు మంటగలిసి పోతున్న తరుణంలో వచ్చిన పాలేరు ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలి.. టీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజాస్వామ్యానికి జీవం పోయాలి.’ అని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పాలేరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేసీఆర్ ఉద్యమాన్ని అణచివేయడం పెద్దపనేమీ కాదని అన్నారు. దివంగత నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డిపై తెలంగాణ ఉద్య మం అంటే గిట్టని తుమ్మల నాగేశ్వరరావును గెలిపించేందుకు రాష్ట్ర మం త్రులు, ఎమ్మెల్యేలు పాలేరులో తిష్టవేయడం శోచనీయమని అన్నారు. -
పాలేరు... యువజోరు
ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: 1962 పునర్విభజనలో ఖమ్మం నుంచి విడిపోయి పాలేరు ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాలను కలిపి పాలేరు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 12సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. 1962లో తొలిసారి ఖమ్మానికి చెందిన కత్తుల శాంతయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఎద్దన్నపై గెలుపొందారు. వరుసగా మూడుసార్లు శాంతయ్యే విజయం సాధించారు. 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన పొట్టపింజర హుస్సేనయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. స్థానికేతరుడైన కోటా గురుమూర్తి (జనత పార్టీ)పై హుస్సేనయ్య గెలుపొందారు. కొద్దికాలానికే హుస్సేనయ్య మృతి చెందడంతో 1981లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కొత్తగూడెంకు చెందిన సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. నేలకొండపల్లికి చెందిన బాజీ హనుమంతు (సీపీఎం)పై విజయం సాధించారు. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ, సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న భూపతిరావు చంద్రశేఖర్‌పై గెలుపొం దారు. 1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చా యి. కాంగ్రెస్ నుంచి మళ్లీ సంభాని. సీపీఎం నుంచి బాజీ హనుమంతు పోటీచేశారు. ఈసారి బాజీ హనుమంతు విజయం సాధించారు. 1989 సాధారణ ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్, బాజీ హనుమంతే తలపడ్డారు. ఈసారి సంభాని పై‘చేయి’ సాధించారు. 1994లో కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ) సీపీఎం నుంచి సంభాని పై పోటీచేసి గెలుపొందారు. 1999లో సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ నుంచి సంభాని చంద్రశేఖర్ మరోసారి తలపడగా సంభానినే విజయం వరించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ సంభాని, సండ్రాలే ఆయా పార్టీల తరఫున పోటీచేశారు. ఈసారి కూడా సంభాని చంద్రశేఖరే గెలుపొందారు. పునర్విభజనతో మారిన ముఖచిత్రం 2008-09లో జరిగిన పునర్విభజనతో పాలేరు నియోజకవర్గ ముఖచిత్రం మారింది. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ముదిగొండ మండలాలతో ఉన్న నియోజకవర్గంలో ముదిగొండ స్థానంలో ఖమ్మంరూరల్ వచ్చి చేరింది. ముదిగొండ మధిర నియోజకవర్గ పరిధిలోకి వెళ్లింది. అంతకుముందు ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన పాలేరు ఈసారి జనరల్ స్థానంగా మారింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కామేపల్లి మండలం పాతలింగాలకు చెందిన రాంరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తమ్మినేని వీరభద్రం (సీపీఎం/మహాకూటమి)పై విజయం సాధించారు. నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుపొందిన సంభాని చంద్రశేఖర్ సుదీర్ఘకాలం మంత్రి పదవులను నిర్వర్తించగా, తొలిసారి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవిని చేపట్టారు. ఈ ఎన్నికల్లో ఆశావహులు... జనరల్ స్థానమైన పాలేరు నియోజకవర్గంపై జిల్లాకు చెందిన హేమాహేమీ రాజకీయనాయకులు దృష్టి సారించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కందాళ ఉపేందర్‌రెడ్డి, ముదిగొండ మండలానికి చెందిన గ్రానైట్ వ్యాపారి రాయల నాగేశ్వరరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాంరెడ్డి వెంకటరెడ్డికి టికెట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, ఆ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి పోటీపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు కూడా పాలేరు అసెంబ్లీకి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తుమ్మలకే పాలేరు టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. సీపీఎం నుంచి ఆపార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావుకు టికెట్ కేటాయించారు. టీఆర్ఎస్ నుంచి ఆపార్టీ పాలే రు నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల సోమయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పోటీచేయాలని ఆశిస్తున్నట్లు సమాచారం. వైఎస్ సంక్షేమ పథకాల మూలంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో బలంగా ఉంది. ఆ పార్టీ మూడుజిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేశ్‌రెడ్డి నియోజకవర్గంలోక్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వైఎస్ ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో 1,94,039 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా ఆరువేలమంది 18 నుంచి 40 ఏళ్ల మధ్యవయస్కులే. పాలేరుకు పోటీచేసే నాయకుల భవిత ఈ యువ ఓటర్ల చేతిలోనే ఉంది. -
తీర్పు ఆమెదే..!
ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: పాలేరు నియోజకవర్గం లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. అన్నింటిల్లో సగభాగమని సత్తా చాటుతున్న మహిళలు స్థానిక ఎన్నికల్లో కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో మూడింటిని. 76 ఎంపీటీసీ స్థానాల్లో 39 స్థానాల్లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న మహిళలు ఓట్లపరంగా కూడా కీలకంగా మారారు. అభ్యర్థుల గెలుపోటములు వీరి చేతుల్లోనే ఉన్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పాలేరు నియోజకవర్గంలోని అభ్యర్థులు గుండెల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గంలో 1,94,037 ఓటర్లు ఉండగా అందులో 95,225 పురుష ఓటర్లు, 98,718 మహిళా ఓటర్లు ఉన్నారు.అభ్యర్థుల తలరాతలు మహిళల చేతిల్లోనే ఉన్నాయి. నియోజకవర్గంలో కీలకమైన మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. నియోజకవర్గంలోని 5,975 స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 61,258 మంది సభ్యులే ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఒక్కో సంఘంలో పది నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. వారు ఎవరికి మద్దతిస్తే వారే విజయం సాధిస్తారనే ప్రచారం జరగుతోంది. ప్రధాన పార్టీలన్నీ మహిళా సంఘాలపైనే దృష్టిసారించాయి. సంఘం సమావేశాల్లో ఓటు విలువ తెలుసుకుని మహిళలు చైతన్యవంతులయ్యారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే వారికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. గ్రామ సమాఖ్య సంఘాలతో చర్చలు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలపై దృష్టి సారించారు. అందులోని సభ్యుల ఓట్లను వేయించుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. తమకు మద్దతు ప్రకటించాలని వేడుకుంటున్నారు. కొంతమంది అభ్యర్థులు మహిళల నుంచి హామీ తీసుకుంటున్నారు. ఎవరెన్ని పాట్లు పడినా చివరకు మహిళలు మద్దతు ఎవరికి లభిస్తుందో వేచి చూడాల్సిందే..