palle ganga reddy
-
రైతులను క్షోభకు గురిచేస్తున్న ప్రభుత్వం : పల్లె గంగారెడ్డి
కామారెడ్డిటౌన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని దుఃఖ సాగరంలో ముంచేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. శని వారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందుకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి కుటుంబ రైతుకు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులు విద్యుత్‌కోతలతో పంటలు పండక ఆందోళనలో ఉన్నారని అన్నారు. రెండేళ్ల తరువాత రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎనిమిది నిమిషాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ లైన్లను వేయలేదని కనీసం చర్యలు కూడా చేపట్టడం లేదని అ న్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పూర్తిస్థాయిలో సహాయమందించేందుకు కృషి చేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిద్దిరాములు ఉన్నారు. -
రుణ మాఫీపై మోసగిస్తున్న ప్రభుత్వం
ఆర్మూర్ : ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు *లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ అన్ని సీఎం కేసీఆర్ ప్రస్తుతం కుటుంబానికి మాత్రమే లక్ష మాఫీ అంటూ రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగా రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతుల ఓట్లు రాబట్టుకోవడానికి హామీలు గుప్పించిన కేసీఆర్ అధికారం కైవసం చేసుకోగానే మాట మార్చడం తగదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు లక్ష లోపు రుణ మాఫీని చేయాలని డిమాండ్ చేశారు. వర్షభావ పరిస్థితుల్లో సాగు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోరు బావులపైనే ఆధారపడి వారు పంటలు పండిస్తున్నారన్నారు. అయితే ఎన్నికల సమయంలో వ్యవసాయ రంగానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తారన్న కేసీఆర్ ప్రస్తుతం రెండు గంటలే సరఫరా చేయడేమంటని ప్రశ్నించారు. కేసీఆర్ మోసపూరిత హామీలను గుర్తించిన రైతులు ఉద్యమం బాట పడితే టీఆర్ఎస్ ప్రభుత్వం మనగడనే ప్రశ్నార్థకమవుతుందన్నారు. 22న జాతీయ అధ్యక్షుడి రాక ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నట్లు పల్లె గంగా రెడ్డి తెలిపారు. తొలిసారిగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి విచ్ఛేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభకు అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు హాజరు కావాలని ఆయన సూచించారు. -
రుణమాఫీపై మాటమార్చిన ప్రభుత్వం
వినాయక్‌నగర్,న్యూస్‌లైన్ : రైతులకు రుణమాఫీ చేస్తామని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ చేస్తానని పొందుపరిచి, అధికారంలోకి రాగానే రుణమాఫీ విషయంలో మాటతప్పి అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని విమర్శిం చారు. ఆగమేఘాల మీద బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి 2013-14 సంవత్సరంలో తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. రైతుల రుణాలు మాఫీ అయ్యేంత వరకు బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున రైతులను తీసుకొని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాన్నారు. మొత్తం రుణాలు మాఫీ చేసే వరకు పోరాడుతామన్నారు. ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, బాణాల లక్ష్మారెడ్డి, న్యాలం రాజు, సుంకరి భాస్కర్‌రావు, నారాయణయాదవ్, దేవేందర్, చంద్రభూషన్, సర్పంచ్ గంగాధర్, రోషన్గోరా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.