Palm oil price
-
తగ్గనున్న వంట నూనె ధరలు..ఎప్పటి నుంచంటే..?
సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా ఆగస్ట్ 31 వరకు అన్ని పామాయిల్ ఉత్పత్తులకు ఎగుమతి సుంకాన్ని రద్దు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్‌లో వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ సంక్షోభం తలెత్తినా ఆ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది. ఉదాహరణకు..ఉక్రెయిన్ నుంచి భారత్ 70శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా భారత్‌లో ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధానికి ముందు రూ.135 నుంచి 150 మధ్యలో ఉన్న వంట నూనె రూ.200కి చేరింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నూనె రావడం లేదని వ్యాపారస్తులు వాటి ధరల్ని భారీగా పెంచారు. ధరల్ని తగ్గించాలి ఈ నేపథ్యంలో కేంద్రం ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిపోతున్న నిత్యవసర ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేలా వెంటనే ఆయిల్ ధరల్ని రూ.15 తగ్గించాలని సూచించింది. ఈ తరుణంలో పామాయిల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని ఇండోనేషియా రద్దు చేయడంతో..దేశీయ ఆయిల్ కంపెనీలు నూనెల ధరల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వంట నూనె ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే! 'విదేశాల నుంచి భారత్‌కు రవాణా అయ్యే సరకు జులై 15 ముందు నుంచే ప్రారంభమవుతుంది. జులై 25కల్లా భారత్‌కు చేరుతుంది. కాబట్టి.. అదే నెలలో (జులై) వంట నూనెల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాతి నెల నుంచి ధరలు తగ్గుతాయని' అదానీ విల్మార్ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ అన్నారు. ఆయిల్ ధరల్ని తగ్గించాయి భారత్‌లో కొన్ని ఆయిల్ కంపెనీలు వాటి ధరల్ని తగ్గించాల్సి ఉంది. అదే సమయంలో అదానీ విల్మార్, మదర్ డెయిరీ, ఇమామి ఆగ్రోటెక్ పాటు ఇతర సంస్థలు గత నెలలో ఆయిల్ ఉత్పత్తులపై రూ .10 -15 ధరని తగ్గించాయి. -
తెలంగాణ కంటే మిన్నగా..
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్‌కు ప్రకటించిన ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో) ప్రకారం నెలవారీ ధరలను నిర్ణయిస్తూ ఉద్యాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2021–22 సీజన్లో రైతుల నుంచి సేకరించే ఆయిల్ పామ్ గెలలకు 19.22 శాతం ఓఈఆర్తో పాటు కెర్నిల్ నట్స్‌కు 10.25 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఈఆర్కు అనుగుణంగా ప్రకటించిన నెలవారీ ధరల ప్రకారం రైతులకు చెల్లిస్తారు. తాజా ధరలతో తెలంగాణ రైతులకంటే రాష్ట్ర రైతులకు ఎక్కువగా లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు ఈ సీజన్లో తెలంగాణ రైతులకు మార్చి నెలలో టన్నుకు గరిష్టంగా రూ.19,499 ధర లభిస్తే.. అదే నెలలో ఏపీ రైతులకు రూ.22,461 చొప్పున ధర లభించింది. ఈ లెక్కన తెలంగాణతో పోలిస్తే ఏపీ రైతులు టన్నుకు రూ. 2,962 వరకు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఈ సీజన్లో ఏపీలో గరిష్టంగా మే నెలలో టన్నుకు రూ.23,365 రైతులకు లభిస్తుంది. అదే తెలంగాణలో రూ.22,841 (ఏప్రిల్ నెలలో) మాత్రమే. -
HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు సిద్ధంగా ఉంది. పామాయిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటగదిని దాటి బాత్రూమ్ని చేరాయి. ఇప్పటికే వంట నూనెల ధరతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు సబ్బులు మరో షాక్ ఇవ్వనున్నాయి. పామ్ ఆయిల్ ఎఫెక్ట్ సబ్బు తయారీలో పామ్ ఆయిల్ ఉత్పత్తులు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా పామ్ ఆయిల్ దిగుబడి తగ్గిపోయింది. దీంతో పామ్ ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఈ కారణాన్ని చూపుతూ స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. యూనీలీవర్ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తులపై రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు సీఎన్‌బీసీ పేర్కొంది. స్నానపు సబ్బులు, డిటర్జెంట్ సబ్బులు, పౌడర్ల ధరలను కనీసం 3.5 శాతం నుంచి 14 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. గ్రాముల్లో తగ్గింపు ప్రీమియం కేటగిరి, ఎక్కుడ డిమాండ్ ఉన్న ఐటమ్స్ విషయంలో ధరలు పెంచేందుకు హిందూస్థాన్ యూనిలీవర్ మొగ్గుచూపుతుండగా సాచెట్స్, తక్కువ ధరకు లభించే ఐటమ్స్ విషయంలో ధరల పెంపుకు సుముఖంగా లేదు. అయితే ధరల పెంపుకు బదులు ఆయా వస్తువుల సైజు తగ్గించాలని నిర్ణయించింది. అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారుడిపై నేరుగా భారం పడకుండా గ్రాముల్లో కోత విధించనుంది. చదవండి: ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!! -
చల్లబడిన నూనె ధరలు
తాడేపల్లిగూడెం : పామాయిల్ ధర దిగివచ్చింది. మార్కెట్లో డిమాండ్ తగ్గడం, రాష్ట్ర విభజన కారణంగా టిన్ నంబర్లు బిల్లులు మారడం, ఆయిల్ కంపెనీల వ్యాపార సంబంధ సాఫ్ట్వేర్లను మార్చుకోవడం తదితర కారణాల వల్ల వ్యాపారం మందగించింది. మార్కెట్లో ఉన్న స్టాకునకు డిమాండ్ లేక పామాయిల్ ధర ఒక్కసారిగా పడిపోయింది. పదిహేను కిలోల డబ్బా రూ.990 నుంచి రూ.1000 వరకు పలకగా, ప్రస్తుతం రూ.900కు పడి పోయింది. రైస్ బ్రాన్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 15 కిలోల డబ్బా రూ.1,040 నుంచి రూ.వెరుు్యకి తగ్గింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర మాత్రం 15 కిలోల డబ్బా రూ.1,175 వద్ద స్థిరంగా ఉండి పోయింది. సన్‌ఫ్లవర్ మార్కెట్లో మనుగడలో ఉన్న దిగుమతి దారులకు గతంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దశలో సన్‌ఫ్లవర్ మార్కెట్‌ను ఉక్రెయిన్ శాసిస్తుందా అనే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఉక్రెయిన్‌లో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి సన్‌ఫ్లవర్ దిగుమతులు తగ్గాయి. ఆవకాయ పచ్చళ్ల సీజన్ కావడంతో వే రుశనగ నూనె ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. 15 కిలోల డబ్బా గుత్త మార్కెట్లో రూ.1,350 నుంచి రూ.1,400 కు పెరిగింది. పామాయిల్ ధర చల్లబడటంతో అల్పాదాయ వర్గాలు కాస్త ఉపశమనం పొందాయి. ఈ సమయంలో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి నూనెల లోడింగ్ జరగలేదు. -
పామాయిల్ ధర పెంపు...కంటితుడుపే
=ఎన్నికల గిమ్మిక్కులో భాగమే =మూడేళ్లుగా అడుగుతుంటే ఇప్పుడు నిర్ణయం =రూ.57 కోట్ల బకాయిలపై మౌనం నూజివీడు, న్యూస్‌లైన్ : మద్దతు ధర లేక నష్టాల బాటలో కూరుకుపోతున్న ఆయిల్‌పామ్ రైతులను బయట పడేయాల్సిన ప్రభుత్వం కంటితుడుపు చర్యలను మాత్రమే తీసుకుంటోంది. మద్దతు ధర కల్పించాలని నాలుగేళ్లుగా ఆయిల్‌పామ్ రైతులు పోరాడుతుండగా, ఇన్నాళ్లు మిన్నకుండిన ప్రభుత్వం ఇంకా మూడు నెలల్లో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ధరను పెంచామని చెప్పుకోవడానికా అన్నట్లు అరకొరగా పెంచిందని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.6,907 ఉంది. జాతీయ పరిశోధనా కేంద్రం చేసిన సిఫార్సే కనీసం టన్ను ధర రూ.8200 ఉండగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.609 పెంచి చేతులు దులుపుకుంది. 2010లోనే మద్దతు ధర పెంపుపై సూచన... 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటీ చైర్మన్ అశోక్ గులాటి ఆయిల్‌పామ్ రైతులతో చర్చించిన మీదట క్రూడ్ పామాయిల్ ధరలో 13.54 శాతం చొప్పున రైతులకు టన్ను గెలలకు మద్దతు ధరను చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులను ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోకుండా సిఫార్సు చేసిన దానికంటే తక్కువగా 13.15 శాతం చెల్లించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం టన్ను ఆయిల్‌పామ్ ధర రూ.609 పెరగనుంది. మరోవైపు రైతు సంఘాలు గాని, ఆయిల్‌పామ్ రైతులు గాని రూ.16 శాతం చొప్పున ధరను నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయిల్‌పామ్ పంట రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా కృష్ణా జిల్లాలో 8 వేల హెక్టార్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 40 వేల హెక్టార్లు, ఖమ్మం జిల్లాలో 5 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి సమీపంలోని జాతీయ పరిశోధనా కేంద్రం ఆయిల్‌పామ్ సాగును క్షుణ్ణంగా పరిశీలించి టన్ను గెలలకు రూ.8200 చొప్పున ఇవ్వాలని ఐదేళ్ల క్రితం సిఫార్సు చేసింది. ఈ ధరను ఏటా 30 శాతం చొప్పున పెంచాలని కూడా సూచించింది. అప్పుడే దీన్ని సాగు చేస్తున్న రైతు నష్టాలపాలవకుండా ఉంటాడని తేల్చిచెప్పింది. ఇప్పటికీ దీనిని అమలుచేయడం లేదు. రూ.57 కోట్ల బకాయిలపై ప్రభుత్వం మౌనం... ఆయిల్‌పామ్ రైతులకు చెల్లించాల్సిన రూ.57 కోట్ల బకాయిల విషయమై ప్రభుత్వం మౌనంగా ఉంటోంది. 2009లో ఆయిల్‌పామ్ గెలలు టన్ను ధర రూ.6440 ఉండగా అదే ఏడాది ఫిబ్రవరిలో ఒక్కసారిగా ధర పతనమై టన్ను ధర రూ.4300కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం గోధుమలకు ఇచ్చినట్లుగా ఆయిల్‌పామ్ గెలలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రూ.5500 మద్దతు ధర నిర్ణయించింది. అంతకంటే తగ్గితే ఆ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించి రైతుకు చెల్లించేలా అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా 2009 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సంబంధించిన మొత్తం రూ.4.60 కోట్లను అప్పట్లో చెల్లించారు. అనంతరం 2009 మే నెల నుంచి 2010 వరకు ఏప్రిల్ వరకు ఆయిల్‌పామ్ రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.57 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించి తమను ఆదుకోవాలని రైతాంగం కోరినా పట్టించుకోవడం లేదు.