Panasonic Mobile
-
అద్భుత ఫీచర్లు: ఎలుగా రే 550
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానసోనిక్ అద్భుత ఫీచర్లతో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఎలుగ రే 550పేరుతో మంగళవారం కొత్త డివైస్‌ను విడుదల చేసింది. బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.8,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఎఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ అర్బో, భారీ స్క్రీన్, స్మార్ట్ లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్లో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే ముందు, వెనుక భాగాల్లో రెండు కెమెరాలకు ఫ్లాష్‌తో తీసుకొచ్చింది. ముఖ్యంగా రెడ్ మి 5 కు పోటీ ఫీచర్లు దీన్ని లాంచ్ చేయడం మరో విశేషం. పానసోనిక్ ఎలుగా రే 550 ఫీచర్లు 5.7 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 18.9యాస్పెక్ట్ రేషియో 1440 x 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.5 కర్వ్డ్ గ్లాస్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ బ్యాక్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3250 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే..!
మంగళగిరి: ఆన్లైన్లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే విమ్ సబ్బు వచ్చిన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. దీంతో వినియోగదారుడు లబోదిబోమంటూ గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం మేరకు... పట్టణానికి చెందిన జొన్నాదుల హేమ నాగవరప్రసాద్ అనే యువకుడు ఈ నెల ఒకటో తేదీన పానాసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అమేజాన్ కంపెనీకి అన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఫోన్ ఖరీదు రూ. 9800 ఆన్లైన్లోనే కంపెనీకి చెల్లించాడు. బ్లూడాట్ కొరియర్ నుంచి శుక్రవారం డెలివరీ బాయ్ వచ్చి ప్యాకెట్‌ను అందజేయగా అందులో విమ్‌బార్ సబ్బు వచ్చింది. ఇది చూసి కంగుతిన్న వినియోగదారుడు కొరియర్ బాయ్‌ని ప్రశ్నించగా తనకెలాంటి సంబంధం లేదని, కంపెనీపై కేసు పెట్టాలని, తాను పార్శిల్లో సబ్బు వచ్చినట్లు సాక్ష్యం చెబుతానని చెప్పడంతో చేసేదేంలేక బాధితుడు ప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బొప్పన బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్త వహించాలని సూచించారు. -
13 శాతం పెరిగిన బజాజ్ ఆటో నికరలాభం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో బజాజ్ ఆటో లిమిటెడ్ నికరలాభంలో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.741 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.837 కోట్లకు పెరిగింది. రూపాయి మారకం విలువ క్షీణించడంతో ఎగుమతులు పెరిగాయని, దీంతో లాభాలు పెరిగినట్లు కంపెనీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమీక్షా కాలంలో అమ్మకాలు 5 శాతం పెరిగి రూ.4,817 కోట్ల నుంచి రూ.5,061 కోట్లకు చేరాయి. అదే వాహనాల పరంగా చూస్తే అమ్మకాలు 8 శాతం క్షీణించి 10,49,208 వాహనాల నుంచి 9,61,330 వాహనాలకు పడిపోయాయి. మొత్తం ఆదాయంలో 40 శాతం వాటా కలిగి వున్న ఎగుమతులు మాత్రం 26 శాతం వృద్ధితో రూ.1,686 కోట్ల నుంచి రూ.2,125 కోట్లకు చేరుకున్నాయి.