13 శాతం పెరిగిన బజాజ్ ఆటో నికరలాభం | Bajaj Auto Q2 profit beats estimates, posts 13 per cent increase | Sakshi
Sakshi News home page

13 శాతం పెరిగిన బజాజ్ ఆటో నికరలాభం

Published Thu, Oct 17 2013 1:59 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

13 శాతం పెరిగిన బజాజ్ ఆటో నికరలాభం - Sakshi

13 శాతం పెరిగిన బజాజ్ ఆటో నికరలాభం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో బజాజ్ ఆటో లిమిటెడ్ నికరలాభంలో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.741 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.837 కోట్లకు పెరిగింది. రూపాయి మారకం విలువ క్షీణించడంతో ఎగుమతులు పెరిగాయని, దీంతో లాభాలు పెరిగినట్లు కంపెనీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమీక్షా కాలంలో అమ్మకాలు 5 శాతం పెరిగి రూ.4,817 కోట్ల నుంచి రూ.5,061 కోట్లకు చేరాయి. అదే వాహనాల పరంగా చూస్తే అమ్మకాలు 8 శాతం క్షీణించి 10,49,208 వాహనాల నుంచి 9,61,330 వాహనాలకు పడిపోయాయి. మొత్తం ఆదాయంలో 40 శాతం వాటా కలిగి వున్న ఎగుమతులు మాత్రం 26 శాతం వృద్ధితో రూ.1,686 కోట్ల నుంచి రూ.2,125 కోట్లకు చేరుకున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement