Panasonic T31
-
ప్యానాసోనిక్...బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: ప్యానాసోనిక్ కంపెనీ ఆండ్రాయిడ్ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్, ప్యానాసోనిక్ టీ31ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.7,990గా నిర్ణయించామని పేర్కొంది. భారత మార్కెట్లోకి ప్యానాసోనిక్ కంపెనీ అందిస్తున్న ఐదో మోడల్ ఇది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్లో 4-అంగుళాల డబ్యూవీజీఏ డిస్ప్లే, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 3.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇన్‌బుల్ట్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయి. భవిష్యత్తులో కూడా విస్తృతమైన స్థాయిలో ఫోన్ల ను అందించనున్నామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ పేర్కొన్నారు. -
13 శాతం పెరిగిన బజాజ్ ఆటో నికరలాభం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో బజాజ్ ఆటో లిమిటెడ్ నికరలాభంలో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.741 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.837 కోట్లకు పెరిగింది. రూపాయి మారకం విలువ క్షీణించడంతో ఎగుమతులు పెరిగాయని, దీంతో లాభాలు పెరిగినట్లు కంపెనీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమీక్షా కాలంలో అమ్మకాలు 5 శాతం పెరిగి రూ.4,817 కోట్ల నుంచి రూ.5,061 కోట్లకు చేరాయి. అదే వాహనాల పరంగా చూస్తే అమ్మకాలు 8 శాతం క్షీణించి 10,49,208 వాహనాల నుంచి 9,61,330 వాహనాలకు పడిపోయాయి. మొత్తం ఆదాయంలో 40 శాతం వాటా కలిగి వున్న ఎగుమతులు మాత్రం 26 శాతం వృద్ధితో రూ.1,686 కోట్ల నుంచి రూ.2,125 కోట్లకు చేరుకున్నాయి.