Panchayat workers protest
-
‘ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’
నాగర్‌కర్నూల్‌రూరల్: గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాం డ్ చేశారు. మంగళవారం పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది కార్మికులు, కారోబార్లు, ఎలక్ట్రిషియన్లు, స్వీపర్లు, కామటి తదితరు లకు కనీస వేతనం కల్పించా లని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ సహాయ కార్యదర్శి రామయ్య, పంచాయతీ కార్మికుల కృష్ణయ్య, చంద్రయ్య, నాగయ్య, స్వామి పాల్గొన్నారు. బిజినేపల్లిరూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జి ల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు. మంగళవారం బిజినేపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికులతో చేపట్టిన నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు నెలానెలా సబ్బు, నూనె అందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీ ను, శుభాకర్, చంద్రమౌళి, కృష్ణాజీ, కార్మికులు వెంకటేష్, కతాల్, కృష్ణయ్య, శ్రీనివాసులు, రాము పాల్గొన్నారు. సీపీఐ, కాంగ్రెస్ మద్దతు తెలకపల్లి: తహసీల్దార్ కార్యాలయం వద్ద శిబిరంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మామిళ్లపల్లి యాదయ్య, సీపీఐ మండల కార్యదర్శి గోపాస్ లక్ష్మణ్ మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రవికుమార్, జిల్లా కార్యదర్శి శంకర్‌గౌడ్, సాయిలు, వడ్డె రాములు, గోపాస్ లక్ష్మణ్, సుధాకర్, రషీద్, రాములు, ఉస్సేన్, మశమ్మ, పార్వతమ్మ, వెంకటమ్మ, రామస్వామి నాగయ్య, అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. తాడూరు: కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మీకి వినతి పత్రం అందించారు. వేతనం రూ. 15వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికులకు వేతనాలు పెంచి రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు వెంకటయ్య, బంగారయ్య, అన్వర్ తదితరులున్నారు. రెండో రోజుకు చేరిన వీఓఏల ధర్నా నాగర్‌కర్నూల్‌రూరల్: జిల్లాలో పనిచేస్తున్న వీఓఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐకేపీ వీఓఏల రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 18వేల వీఓఏలు ఏళ్ల తరబడి మహిళా సంఘాలకు వెట్టి చాకిరీ చేస్తే 2010లో నిర్వహించిన పోరాట ఫలితంగా రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని, దీంతో తమ కుటుంబాలను వెళ్లదీయలేకపోతున్నామని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు జడ్చర్ల సభలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారని, కానీ రూ.5వేల వేతనం ఇస్తామని చెప్పి హామీని అమలు చేయలేదని ఆరోపించారు. జెడ్పీటీసీ కొండా మణెమ్మ వారికి మద్దతు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుమలత, బాలీశ్వర్, వెంకటయ్య, జగన్, యాదగిరి, రామస్వామి, భగత్‌సింగ్, భాగ్య, నర్సింహ, జీ లేఖ తదితరులు పాల్గొన్నారు. -
వారే నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు
దిక్కుమాలినోళ్ల ఓట్లతోనే సీఎం అయ్యావని గుర్తుంచుకో * కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హెచ్చరిక * ఇందిరాపార్కు వద్ద పంచాయతీ కార్మికుల ధర్నా హైదరాబాద్: ‘‘కార్మిక సంఘాలు దిక్కుమాలినవా? టీఆర్ఎస్, కేసీఆర్ పుట్టక ముందు నుంచే కార్మిక సంఘాలున్నాయి. అధికారం చేతిలో ఉందని కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దిక్కుమాలిన వాళ్లు వేసిన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యావు. దిక్కుమాలిన వాళ్లే మూడున్నరేళ్ల తర్వాత నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. దిక్కులేనివాళ్లకు దిక్కు చూపించే చుక్కలు వామపక్షాలని, దిక్కు చూపించకుండా చుక్కలు చూపుతున్న తిక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. మంత్రులు ముఖ్యమంత్రితో మాట్లాడే కనీస ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదన్నారు. తమకు ప్రజాస్వామ్య, సామాజిక, జన తెలంగాణ కావాలే తప్ప.. దోరల తెలంగాణ, నియంతృత్వ తెలంగాణ కాదని, ఇదే మాదిరిగా కేసీఆర్ వ్యవహరిస్తే.. ఆయన పాలనకు ప్రజలు పాతర వేస్తారని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మిక, ఉద్యోగ జేఏసీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు మేరకు రాజధానికి భారీగా తరలివచ్చిన కార్మికులు.. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 43 రోజులుగా సమ్మె చేస్తున్నా.. మత్తులో ఉన్నాడో, చెవుల్లో సీసం పోసుకున్నాడో సీఎంకు వినపడటంలేదన్నారు. వామపక్షాల పంచాయతీల్లో ముందు జీతాలు పెంచాలన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇస్తే తాము అక్కడే తేల్చుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయా? అని ప్రశ్నించారు. ఉద్యమ సందర్భంగా తెలంగాణ వస్తే, ఎన్నిక ల ప్రచారంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అనే మాటే ఉండదని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం పర్మినెంట్ అనే మాటే లేదంటున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దోరల ఆలోచనలను పుణికి పుచ్చుకున్న కేసీఆర్ సమ్మె విరమించాలని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ ధనిక రాష్ట్రంలో ప్రజలు పేదలవుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు ఉయ్యాల్లో ఊగుతోందని విమర్శించారు. పంచాయతీ కార్మికుల కనీస వేతనాన్ని రూ. 15 వేలకు పెంచడంతో పాటు వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ శాసనసభపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీసీఎం శాసనసభాపక్షనేత సున్నం రాజయ్య, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క, సూర్యం (ఐఎప్టీయూ), నర్సింహన్ (ఏఐటీయూసీ), సాయిబాబా, పాలగుడు భాస్కర్, భూపాల్, రమ(సీఐటీయూ), జానకిరాములు(ఆర్ఎస్పీ), గోవర్ధన్, ఝాన్సీ (న్యూడెమోక్రసీ), ఎండీ గౌస్ (ఎంసీపీఐ), ఎంకే బోస్ (టీఎన్టీయూసీ), రాధాకష్ణ(బీఎంఎస్), మురహరి(ఎస్‌యూసీఐ) తదితరులు పాల్గొని మాట్లాడారు.