Panchayati Raj Minister
-
నేడు మంత్రి అయ్యన్న పాత్రుడు రాక
అనంతపురం అర్బన్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్.అయ్యన్న పాత్రుడు బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో ఉంటూ స్థానికంగా ఏర్పాటు చేసిన కారక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం పెనుకొండ చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేస్తారు. 29వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ధర్మవరంలోని పెద్దకోట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి బెంగుళూరు వెళతారు. -
తెలంగాణ ఏర్పాటుపై కేరళీయుల ఆసక్తి
రాష్ట్ర ప్రభుత్వ పాలనను వివరించిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన అంశాలపై కేరళ పంచాయతీరాజ్ అధికారులు అమితాసక్తిని కనబరిచారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన మంత్రి జూపల్లి తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం త్రిశూర్ జిల్లా వెంకిటంగు గ్రామపంచాయతీని సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ సాగించిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి మంత్రి వివరించారు. కేరళ స్థానిక పరిపాలన శాఖ మంత్రి కేటీ జలీల్‌తోనూ జూపల్లి బృందం సమావేశమయింది. పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూకుమారి, జాయింట్ కమిషనర్ వెస్లీ ఉన్నారు. -
నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటి ?
ఏలూరు: తమకు అనుకూలమైన అధికారులకే బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ... 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నామని....ఆ సమయంలో అధికారులు బదిలీలపై తాము ఎవరిని ప్రశ్నించలేదన్నారు. ప్రస్తుతం తమకు నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తనకు, తన సొంత జిల్లాకు చెందిన మంత్రి గంటా మధ్య ఎలాంటి విబేధాలు లేవని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అది అంతా మీడియా సృష్టే అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. -
అమాత్యుల రాక నేడు
- జిల్లాకు మంత్రులు ఈటెల, కేటీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు - తెలంగాణ చౌక్‌లో బహిరంగ సభ, ధూంధాం కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం జిల్లాకు రానున్నారు. రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్న మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... మంత్రులు హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళవారం సాయంత్రం 4గంటలకు జిల్లా సరిహద్దులోని శనిగరం చేరుకుంటారు. అక్కడ హుస్నాబాద్, మానకొండూర్ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బెజ్జంకి క్రాసింగ్ వద్ద నుంచి భారీ బైక్‌ర్యాలీతో మంత్రులకు స్వాగతం పలుకనున్నారు. అల్గునూరులోని పెద్దమ్మ దేవాలయంలో మంత్రులు పూజలు నిర్వహిస్తారు. అక్కడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గ సరిహద్దులోని మానేరు బ్రిడ్జి వద్ద స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పార్టీ నేతలు మంత్రులకు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడినుంచి భారీ ఊరేగింపుతో నగరంలోకి ప్రవేశించి మహాత్మా జ్యోతిరావుపూలే, మహాత్మగాంధీ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం నగరంలోని తెలంగాణ చౌక్‌లో రాత్రి 7గంటలకు నిర్వహించే బహిరంగసభ, ధూంధాంలో మంత్రులతో పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీమయం చేశారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికేందుకు, యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించేందుకు స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటనను విజయంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కోరారు.