Panjab government
-
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం భగవంత్‌మాన్
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని సర్కార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సభ్యుల గోల నడుమ, బీజేపీ సభ్యుల వాకౌట్ నిరసనల మధ్య తీర్మానం ప్రవేశపెట్టారాయన. స్పీకర్ కుల్టార్‌సింగ్ సంధ్వాన్ అసెంబ్లీలో మాన్ ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మాన ప్రకటన చేయడంతో.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్ష, ఇతర పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో నిర్ణయించినట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 22వ తేదీనే ప్రత్యేక సమావేశాల కోసం ఆప్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. కేవలం విశ్వాస తీర్మానం కోసమని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అందుకు అంగీకరించలేదు. సభ నిబంధనలు అందుకు అంగీకరించవని బీజేపీ, కాంగ్రెస్ గవర్నర్‌ను కోరడంతో.. ఆయన న్యాయ అభిప్రాయం తీసుకున్నారు. ఈలోపు ఆప్ ప్రభుత్వం గవర్నర్ నిర్ణయంపై, కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడింది. మరోవైపు బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే.. విశ్వాస తీర్మానంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ప్రభుత్వం నివేదించడంతో.. గవర్నర్ సెప్టెంబర్ 27(ఇవాళ) నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. బీజేపీ తమ పార్టీలోని కనీసం పది మంది ఎమ్మెల్యేలను బీజేపీ పాతిక కోట్ల చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చి పార్టీ మార్పించేందుకు ప్రయత్నించిందని, ఆపరేషన్ లోటస్‌ను తాము భగ్నం చేశామంటూ ఆప్ ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే బలనిరూపణకు సిద్ధపడింది కూడా. అయితే పంజాబ్ బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆరు నెలల ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నాటకాలాడుతోందని విమర్శించింది బీజేపీ. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీపై ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలతో ఈమధ్యే బలనిరూపణలో నెగ్గింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇదీ చదవండి: పాస్‌పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు -
వివాదాస్పదంగా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం
చంఢీగఢ్: ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కపుర్తాలా జిల్లాలోని ఫగ్వారా చెక్‌పోస్టుల వద్ద కాపలాగా ఉంచనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఫగ్వారా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సివిల్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు, కమ్యూనికేషన్ ఎక్సెంజ్లతో పాటు ఉపాధ్యాయులు కూడా రాత్రి 9 గంటల నుంచి 1 గంటల మధ్య చెక్ పాయింట్ల వద్ద డ్యూటీ చేయాలంటూ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం 24 మంది పాఠశాల ఉపాధ్యాయులను డిస్టిలరీలకు కాపాలాగా నియమించింది. కానీ దీనిని ఉపసంహరించిన నెల రోజులకే ప్రభుత్వం మరోసారి ఈ ఉత్తర్వును జారీ చేసింది. (వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు) దీనిపై శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడీ) పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డల్జిత్ సింగ్ చీమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘డిస్టిలరీల తరువాత ఇసుక తవ్వకాలను ఆపడానికి పంజాబ్ ప్రభుత్వం వివిధ పోలీసు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించింది. ఉపాధ్యాయులను మద్యం, ఇసుక మాఫియా కోసం ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఒక సిగ్గుమాలిన నిర్ణయం. ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా గత నెలలో గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వుపై ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. మద్యం సరఫరాపై నిఘా పెట్టడానికి 24 మంది ఉపాధ్యాయులను కర్మాగారాల్లో మోహరించింది. అయితే ప్రతిపక్షం ఆందోళనలతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. (ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్) -
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్న సిద్దూ!
ఢిల్లీ : పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఆయన పార్టీని వీడతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజాగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్.. సిద్దూ రావాలనుకుంటే తమ పార్టీ ఆయనకు స్వాగతం పలుకుతుంది అనడంతో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టయింది. గురువారం జరిగిన ఓ సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ తరపున సిద్దూతో ఎవరైనా చర్చలు జరుపుతున్నారా అని ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. 2017లో బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన సిద్దూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ తర్వాత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో వచ్చిన విబేధాల కారణంగా పార్టీ సమావేశాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఏడాది క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయనను ఆహ్వానించింది. అయితే కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా అప్పుడు చేరలేదు. ఈ ఏడాది మార్చిలో ఆమ్ ఆద్మీ పంజాబ్ ఛీప్ భగవంత్ మన్ కూడా సిద్దూని తమ పార్టీలోకి ఆహ్వానించారు. (గుజరాత్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ) అప్పటి ఎన్నికల్లో సిద్దూ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పార్టీ మారే విషయంలోనూ కీలకంగా మారినట్టు కనబడుతోంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఐడి), బీజేపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 117 స్థానాల్లో 77 సీట్లు గెలిచి అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. (కరోనా చికిత్సకు తాజా మార్గదర్శకాలు) -
‘బుగ్గ’తోపాటు భద్రత కూడా...
చండీగఢ్: బుగ్గ కార్లు ఉండరాదని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మంచి ప్రభావమే చూపుతోంది. భద్రత కోసం నాయకులకు, ఉన్నతాధికారులకు కేటా యించిన 2,000మంది పోలీసు సిబ్బందిని ఉపసం హరించుకుంటున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటిం చింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం తన భద్రతకున్న 1,392మంది సిబ్బందిలో 376 మందిని వారి వారి విభాగాలకు పంపించారు. మరోసారి సమీ క్షించాక దీన్నింకా తగ్గిస్తారట. ప్రస్తుత భద్రతా విధా నాన్ని లోతుగా సమీక్షించి సరిచేయాలని రాష్ట్ర హోం శాఖను అమరీందర్ ఆదేశించారు. తాను వెళ్లే తోవ పొడవునా పోలీసు పహారా ఉండటాన్ని ఆయన ఇప్ప టికే రద్దు చేయించారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు బయటికొస్తే రోడ్లపై ఎంత షో జరుగుతుందో పౌరులందరికీ నిత్యానుభవం. ఇది ఏ కాస్త తగ్గినా మంచిదే అనుకోవాలి.