‘బుగ్గ’తోపాటు భద్రత కూడా... | Security along with the Red beacons | Sakshi
Sakshi News home page

‘బుగ్గ’తోపాటు భద్రత కూడా...

Published Sun, Apr 23 2017 2:01 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

‘బుగ్గ’తోపాటు భద్రత కూడా... - Sakshi

‘బుగ్గ’తోపాటు భద్రత కూడా...

చండీగఢ్‌: బుగ్గ కార్లు ఉండరాదని కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మంచి ప్రభావమే చూపుతోంది. భద్రత కోసం నాయకులకు, ఉన్నతాధికారులకు కేటా యించిన 2,000మంది పోలీసు సిబ్బందిని ఉపసం హరించుకుంటున్నట్టు పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటిం  చింది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సైతం తన భద్రతకున్న 1,392మంది సిబ్బందిలో 376 మందిని వారి వారి విభాగాలకు పంపించారు.

మరోసారి సమీ క్షించాక దీన్నింకా తగ్గిస్తారట. ప్రస్తుత భద్రతా విధా నాన్ని లోతుగా సమీక్షించి సరిచేయాలని రాష్ట్ర హోం శాఖను అమరీందర్‌ ఆదేశించారు. తాను వెళ్లే తోవ పొడవునా పోలీసు పహారా ఉండటాన్ని ఆయన ఇప్ప టికే రద్దు చేయించారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు బయటికొస్తే రోడ్లపై ఎంత షో జరుగుతుందో పౌరులందరికీ నిత్యానుభవం. ఇది ఏ కాస్త తగ్గినా మంచిదే అనుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement