Papaghni river
-
శరవేగంగా జరుగుతున్న పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జ్ పనులు
-
పాపాఘ్నిపై రూ.60 కోట్లతో కొత్త వంతెన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కమలాపురం సమీపంలోని పాపాఘ్ని నదిపై కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. పాపాఘ్ని నదిపై 1977లో నిర్మించిన భారీ వర్షాల కారణంగా నవంబర్ 20న కుంగిపోయిన విషయం తెలిసిందే. మూడు రోజులు వరద గరిష్ట స్థాయికి చేరడంతో ఆ వంతెన కుంగింది. అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే ఆ వంతెన పైనుంచి రాకపోకలను నిలిపేసింది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులు సమీపంలోని రైలు వంతెన మీద నుంచి నడిచి వెళ్లాల్సివచ్చింది. అది ప్రమాదకరమని గుర్తించిన ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. చదవండి: AP Police Academy: త్వరలో ‘అప్పా’ విభజన కూలిన పాపాఘ్ని వంతెనకు ఓ వైపున పలకలు వేసి పాదచారులు రాకపోకలు సాగించేందుకు అవకాశం కల్పించింది. ఇక శాశ్వత చర్యలు సూచించేందుకు చెన్నై ఐఐటీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణులు బి.నాగేశ్వరరావు, బాలసుబ్రమణియమ్‌లను రప్పించింది. వారిద్దరూ కుంగిన వంతెనను పరిశీలించారు. పాపాఘ్నిపై పాత వంతెనకు సమాంతరంగా కొత్త వంతెన నిర్మించాలని సూచించారు. దీంతో ఆర్ అండ్ బి శాఖ ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు పంపించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. దాదాపు రూ.60 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వంతెన నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్లు పిలిచి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెన్నా వంతెనపై మార్చి నాటికి పియర్ నిర్మాణం వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు వద్ద పెన్నానదిపై ఉన్న వంతెనలో కుంగిన శ్లాబ్ స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. ఇటీవల భారీ వర్షాలకు ఆ వంతెన ఒక పియర్ కుంగింది. వంతెనను పరిశీలించిన చెన్నై ఐఐటీ ఇంజినీరింగ్ నిపుణులు మిగిలిన భాగమంతా పటిష్టంగా ఉందని నివేదిక ఇచ్చారు. కుంగిన పియర్ స్థానంలో కొత్తగా శ్లాబ్ వేస్తే సరిపోతుందని సూచించారు. దీంతో రూ.10 కోట్లతో శ్లాబ్ వేయాలన్న ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పనులను త్వరలో మొదలు పెట్టి మార్చి నాటికి పూర్తిచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి పెన్నానదిలో డైవర్షన్ రోడ్డు నిర్మించి నదీ ప్రవాహాన్ని పైపుల ద్వారా మళ్లిస్తున్నారు.మార్చి నాటికి పియర్ నిర్మించి వంతెనపై రాకపోకలను అనుమతించాలని ఆర్అండ్బి శాఖ భావిస్తోంది. -
ప్రమాదకరంగా వైయస్సార్ జిల్లాలోని పాపాగ్ని నది
-
‘పాపా’గ్ని ఒడిలో..!
మూడు నెలల పాప..కమ్మని పాలు తాగుతూ..కన్నతల్లి వెచ్చని ఒడిలోకంటి నిండా నిద్రపోవాలి..కానీ..కసాయి తండ్రి కర్కోటకానికి బలైపోయింది.. అమ్మ ఒడికి దూరమైంది..పాపాగ్ని నదిలో కలసిపోయింది..భార్యపై ప్రేమను మరిచి..అనుమాన భూతాన్నిపెంచుకుని..కన్నబిడ్డను కంటిపాపలాచూసుకోవాల్సిన బాధ్యత వీడి..నిండు నూరేళ్ల జీవితాన్నిచిదిమేసిన కిరాతకుడి చర్య ఇది..ఆ కన్నతల్లికి కడుపుకోత మిగిల్చినసంఘటన ఇది..వేంపల్లె మండలంలో ఆదివారంవెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంట తడిపెట్టించింది.. వైఎస్ఆర్ జిల్లా,వేంపల్లె : భార్యపై అనుమానంతో కన్న కూతురు అని కూడా చూడకుండానే 3 నెలల పసికందును గొంతు నులిమి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణం వేంపల్లెలోని రాజీవ్ కాలనీలో వెలుగు చూసింది. వేంపల్లె అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలాఉన్నాయి. వేంపల్లె మండలం నందిపల్లె గ్రామానికి చెందిన కుసీద అనే మహిళకు, అదే గ్రామానికి చెందిన తమ బంధువుల వ్యక్తి మునీంద్రతో 8ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు 7ఏళ్ల కుమారుడు రాజకుళ్లాయప్ప ఉన్నాడు. ఆరేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం కుసీద అదే గ్రామంలో ఉన్న మల్లేల గజేంద్రను ప్రేమించి రెండో వివాహం చేసుకుంది. వీరిరువురు మొదటి భర్త కుమారుడు రాజకుళ్లాయప్పతో కలసి వేంపల్లె రాజీవ్ కాలనీలో నివాసముంటున్నారు. గజేంద్ర వేంపల్లె పట్టణంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా వీరికి మూడు నెలల క్రితం కుమార్తె జన్మించింది. ఈ నేపథ్యంలో గజేంద్రకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ బిడ్డ తనకు పుట్టలేదనే అనుమానం రోజురోజుకు బలపడింది. అనుమానం పెనుభూతమై ఈనెల 3న శుక్రవారం సాయంత్రం తన 3 నెలల కుమార్తెను ఇంటినుంచి తీసుకెళ్లి గొంతు నులిమి చంపి వేంపల్లె పాపాఘ్ని నదిలో పూడ్చిపెట్టాడు. భార్య కుసీద శనివారం తన బిడ్డ కనిపించలేదని వేంపల్లె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భర్త గజేంద్ర, కుమార్తె కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆదివారం గజేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా తన కూతురిని తానే చంపానని అంగీకరించాడు. పాపాఘ్ని నదిలో పూడ్చిన పాప మృతదేహాన్ని వేంపల్లె తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పోలీసులు వెలికితీశారు. -
చదువుకోవాలంటే నది దాటాల్సిందే..?
వేంపల్లె: చదువుకోవాలంటే నది దాటాల్సిందే.. వేంపల్లెలో పాపాఘ్ని నదిపై హైలెవెల్ వంతెన లేకపోవడం.. ఉన్న తాత్కాళిక వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో విద్యార్థులకు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అష్టకష్టాలు పడుతూ.. పెద్దల సాయంతో పిల్లలు నది దాటి బడికెళుతున్నారు. హైలెవెల్ వంతెన నిర్మించాలని అలవలపాడు, ఎగువ తువ్వపల్లె, దిగువ తువ్వపల్లె గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అలిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఆ మూడు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే.. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొనేందుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హై లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రూ.30.50 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం లేదు. ప్రతి నిత్యం వేంపల్లెకు రావాలంటే వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇటీవల వరుసగా భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాలనుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ నెల 9వ తేదీన తాత్కాలిక వంతెన తెగిపోయి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మూడు పల్లెల్లో 1500మందికిపైగా జనాభా ఉన్నారు. ఈ గ్రామాల ప్రజలు, విద్యార్థులు వేంపల్లెకు రావాలంటే నరకయాతన పడుతున్నారు.