Park Hayat
-
పార్క్‌హయత్ పక్కన పేలుళ్లపై వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో వంశీరాం బిల్డర్స్ పేలుళ్లు జరపడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వంశీరాం బిల్డర్స్ పేలుళ్లు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పార్క్‌హయత్ హోటల్ జనరల్ మేనేజర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ ఆరోపణలపై వివరాలు అందజేయాలని సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు. పేలుళ్ల వల్ల హోటల్లో బసచేసే వారికే కాకుండా చుట్టుపక్కల వారికీ ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదించారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు. -
పెళ్లి బాజా...
మంచువారి సొట్టబుగ్గల సిన్నోడు మనోజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడండోయ్. ఈ విషయం మనోజే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కాబోయే జీవిత భాగస్వామి ప్రణతి ఫొటోకు జతగా ‘మై లైఫ్ ఈజ్ లవ్ ప్రణతి’ అంటూ ఆమెను పరిచయం చేశాడు. ఈ నెల 4న పార్క్ హయత్‌లో నిశ్చితార్థం జరగనుందని ప్రకటించాడు. మనోడి పోస్ట్‌కు ఫ్యాన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చేసింది. కొత్త జంటకు నటి ప్రియమణి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘షి ఈజ్ ప్రెట్టీ’ అని ట్వీటింది. అభినందనలు తెలిపిన మిత్రులు, అభిమానులకు మనోజ్ ధన్యవాదాలు చెబుతూ రీట్వీటాడు. My life's Love Pranathi :-) engagement on 4th:) -
నాన్న లాలన
పిల్లలను పెంచడమంటే ఓ కళ. ఆ కళ అమ్మలకే కాదు... నాన్నలకూ ఉండాలనేది నిపుణుల మాట. పేరెంటింగ్‌లో కష్టాలు, ఇబ్బందులు, సవాళ్లపై అవగాహన కల్పిస్తూ... పిల్లల్ని పాలించడమే కాదు... ఆడించి... లాలించడంలోనూ తండ్రులకూ సమాన బాధ్యత ఉందని చెబుతూ హిమాలయ డ్రగ్ కంపెనీ వర్క్‌షాప్ నిర్వహించింది. సోమాజిగూడ హోటల్ పార్క్ హయత్‌లో మంగళవారం జరిగిన ఈ ‘నాపీ మే హ్యాపీ’ వర్క్‌షాప్‌లో వినోదాత్మక పోటీ ఏర్పాటు చేసింది. తండ్రులు తమ చిన్నారులకు డయాపర్లు మార్చాలి. అందరి కంటే తక్కువ సమయంలో మార్చిన వారికి బహుమతులు ఇచ్చారు. ఇందులో తండ్రులు ఎంతో ఉత్సాహంగా పోటీపడ్డారు. ‘కుటుంబంలో నాన్న పాత్ర డబ్బులు సంపాదించటమే కాదు.. పిల్లల ఆలనపాలన బాధ్యతలనూ షేర్ చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల తండ్రుల పాత్రపై మరింత అవగాహన పెరిగింది’ అంటున్నారు పోటీలో పాల్గొన్న తండ్రులు. - సాక్షి, సిటీ ప్లస్