Parking problem
-
ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్
షాపింగ్ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్ ట్రాఫిక్.. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్‌కు అంతరాయం. పోలీసుల కంట్లో పడితే ఫైన్ కట్టక తప్పదు. అదే ఓ యాప్ ఉండి, దగ్గరలో పార్కింగ్ ఎక్కడుందో తెలిస్తే..? అదీ పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసేసుకోగలిగితే..? ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా.బిజీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు ఇలాంటి వెసులుబాట్లు తెస్తే.. వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచి్చంది. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించవచ్చని ప్రతిపాదన చేసింది.సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ నగరం ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఏటా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అవన్నీ రోడ్లపై తిరగడం సంగతి పక్కనపెడితే.. ఎక్కడో ఓ చోట పార్క్ చేయక తప్పదు. షాపింగ్ కోసం వెళ్లినా, ఏదైనా పని మీద వెళ్లినా.. పార్కింగ్ కోసం తిప్పలే. కార్లే కాదు బైకులు పెట్టడానికీ ఎక్కడా స్థలం లేని దుస్థితి. దీనితో షాపుల ముందు, రోడ్ల పక్కన, గల్లీల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటోంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, సాయంత్రాలు ఆహ్లాదంగా గడపడానికి వెళ్లే చోట్ల పార్కింగ్ పెద్ద ప్రహసనంగా మారింది.ఎలా పనిచేస్తుంది..కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఈజీపార్క్ ఏఐ సంస్థ రూపొందించింది. ఆ వివరాల మేరకు.. పార్కింగ్ స్థలం నిర్వహించే వారికి ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఎన్ని వస్తున్నాయి? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతసేపు వాహనాలు పార్క్ చేస్తారన్న డేటాను దాని ద్వారా అందిస్తుంది. అలా అన్ని పార్కింగ్ స్థలాల వివరాలను ఒకచోట క్రోడీకరిస్తుంది.ఈ వివరాలను ఓ యాప్ సాయంతో వాహనదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్ ద్వారా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ముందుగానే పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించేయొచ్చు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లకపోతే.. స్లాట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్రదేశాల్లో ఇంటర్నెట్ ఆధారిత కెమెరాలతో నిఘా ఉంటుంది. వాహనానికి సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. దొంగతనం, మరేదైనా జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు వెళ్లిపోయి పార్కింగ్ స్లాట్లు ఖాళీ అయితే.. వెంటనే యాప్‌లో అప్డేట్ అయి ఖాళీగా చూపిస్తుంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు బయటికి వెళ్లడం, లోపలికి రావడం ప్రత్యేక పరికరాలతో నమోదవుతూ ఉంటుంది. ఆటోమేటిగ్గా వాటి నంబర్లను గుర్తించి అప్డేట్ చేసే వ్యవస్థ ఉంటుంది.మల్టీలెవల్ పార్కింగ్తో.. అలాగే హైదరాబాద్‌లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలకు కొరత ఉండటంతో.. మలీ్టలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఏర్పాటు చేసినా.. అవి ఎక్కడున్నాయో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలిసినా పార్కింగ్ ఖాళీగా ఉందో లేదో తెలియదు. అక్కడిదాకా వెళ్లి ఖాళీ లేకుంటే.. మళ్లీ మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్ ఖాళీగా ఉందో, లేదో తెలిసి.. ముందే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ముందుకొచి్చంది. ఇటీవల దీనిపై రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది.భవనాల్లో పార్కింగ్ సరిగా లేక.. హైదరాబాద్‌లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. కార్లు, టూ వీలర్లతోపాటు విద్యాసంస్థల వాహనాలు, ఆటోలు వంటివీ భారీగా ఉన్నాయి. ఇందులో కార్లు, టూవీలర్ల పార్కింగ్ కోసం ఇబ్బంది వస్తోంది. ట్రాఫిక్‌లో ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న వాహనదారులకు పార్కింగ్ విషయంలో తిప్పలు తప్పట్లేదు. పార్కింగ్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.పార్కింగ్ సమస్యపై జనం ఏమంటున్నారు?సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఓ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. ‘ఈజీపార్క్ఏఐ’ సంస్థ ప్రజెంటేషన్ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఐటీని వినియోగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు కూడా. ఎక్కడికెళ్లినా పార్కింగ్‌కు ఇబ్బందే.. హైదరాబాద్‌లో, ముఖ్యంగా బిజీ ఏరియాల్లో పార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటోంది. చాలాసేపు వెతికితే కానీ బండి పెట్టుకోవడానికి ప్లేస్ కనబడటం లేదు. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఉండట్లేదు. అంతా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అది ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోంది. – నరేశ్‌గౌడ్ లోడి, అంబర్పేటప్రభుత్వం చొరవ తీసుకోవాలి హైదరాబాద్‌లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ విషయంలో ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించాలి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలకు, వాహనదారులకు అవగాహన కలి్పంచాలి. అప్పుడే నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కల్యాణ్, దిల్సుఖ్నగర్ -
పేరుకే అతిపెద్ద స్క్రీన్.. ఐమాక్స్‌లో సినిమా కష్టాలు
సాక్షి, ఖైరతాబాద్: ఏ కొత్త సినిమా విడుదలైనా ప్రజలు ఐమాక్స్‌కు క్యూ కడతారు. అయితే నిర్వాహకులు సినిమాకు వచ్చే వారి వద్ద టికెట్ డబ్బులు వసూలు చేయడం తప్ప సందర్శకుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. సినిమాకు వచ్చేవారు సరైన పార్కింగ్ సదుపాయం లేక నరక యాతన పడుతున్నా యాజమాన్యం నో పార్కింగ్, పార్కింగ్ ఫుల్ అంటూ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటోంది. పార్కింగ్ నిండిపోయిందని షో పూర్తయ్యే వరకు వేచి ఉండాలంటూ సెక్యురిటీ సిబ్బంది చెబుతుండటంతో సందర్శకులు దిక్కు తోచని స్థితిలో రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేసి హడావిడిగా షో టైం అవుతోందని పరుగులు తీస్తున్నారు. దీంతో ఐమాక్స్ నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ట్రాఫిక్ జాం అవుతోంది. గతంలో ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ స్థలంలో కార్లను పార్కింగ్ చేసుకునేవారు. ప్రస్తుతం ఆ స్థలంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో సదరు స్థలంలో పార్కింగ్ చేసుకునేందుకు వీలులేకుండా పోయింది. ఐమాక్స్ ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో స్థలంలోనూ ఖైరతాబాద్ ప్రాంత వాసులకోసం మల్టీ లెవల్ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ స్థలంలో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు బైక్‌కు రూ. 30, కార్లకు రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఐమాక్స్‌లో అతిపెద్ద సినిమా థియేటర్‌తో పాటు మొత్తం 6 థియేటర్లు ఉంటాయి. ఇవన్నీ నిండితే ఒకేసారి 500 పైగా కార్లు, బైక్‌లు వస్తాయి. ఐమాక్స్ సెల్లార్లో కేవలం 100 నుంచి 150 కార్లు, బైక్‌లకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. దీంతో మిగతా వాహనాలను రోడ్డుపై పార్క్ చేసుకోవాల్సిందే. యాజమాన్యం సందర్శకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదనేందుకు గురువారం రాత్రి జరిగిన సంఘటనే నిదర్శనం. రాత్రి 11.15 నిమిషాలకు చివరి షోకు సందర్శకులు ఎస్కలేటర్ మీదుగా వెళ్తుండగా, అటు వైపు నుంచి షో ముగించుకొని వచ్చిన వారు ఎదురుగా రావడంతో ఎస్కలేటర్‌పై ఉన్న వారు ముందుకు వెళ్లేందుకు స్థలం లేక కేకలు వేశారు. వెంటనే ఎస్కలేటర్‌ను ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ఫ్లై ఓవర్ల కింద స్మార్ట్ పార్కింగ్.. ప్రస్తుతానికి వీరికే అవకాశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పార్కింగ్ అవస్థల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల్లో కొత్త పార్కింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి తెస్తామని నేతలు ప్రకటిస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఓవైపు ప్రజలకు సదుపాయంతో పాటు మరోవైపు ఉన్న స్థలాన్నే సద్వినియోగం చేసుకొని జీహెచ్ఎంసీకి ఆదాయం కూడా సమకూరేలా స్మార్ట్‌పార్కింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది. గ్లోబల్‌సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్‌తో గందరగోళం ఉండదు. వేచి ఉండాల్సిన పరిస్థితులుండవు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు సౌకర్య వంతంగా ఉంటుంది. వీరి కోసం కొన్ని స్లాట్స్ రిజర్వుగా ఉంటాయి. యాప్‌లోనే ముందస్తుగా స్లాట్ బుకింగ్ అవకాశం ఉండటంతో దూరం నుంచి వచ్చేవారికి సదుపాయం. ఆన్లైన్ పేమెంట్ విధానంతో ‘చిల్లర’ గొడవలుండవు. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్‌లోని సుజనా ఫోరం మాల్ ఎదుట ఫ్లైఓవర్ కింద వాహనాలు పార్కింగ్ చేస్తుండటాన్ని గుర్తించిన అధికారులు.. ఆ స్థలంలోనే స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే స్మార్ట్ పార్కింగ్. పీపీపీ విధానంలో పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభోత్సవం జరగనుంది. ప్రత్యేకతలివీ.. పార్కింగ్ ప్రదేశంలోనే అయినా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా పార్కింగ్ చేయడం కుదరదు. పార్కింగ్ ప్రదేశానికి గేట్‌వేతో పాటు బొల్లార్డ్స్, సెన్సార్లు ఉండటంతో నిరీ్ణత ప్రదేశంలోనే పార్కింగ్ చేస్తారు. వాహనం వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు స్కానింగ్ జరుగుతుంది. వాహనం పోతుందనే.. దొంగల భయం ఉండదు. వాహనాల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఏడాది వరకు క్లౌడ్ స్టోరేజిలో ఉంటాయి. జీహెచ్ఎంసీకి ఆదాయం లభిస్తుంది. సిస్టమేటిక్ పార్కింగ్తో రద్దీ సమయాల్లో రోడ్లపై ట్రాఫిక్‌జామ్ తగ్గుతుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో çపర్యావరణ పరంగా మేలు. పైలట్ ప్రాజెక్టుగా దీని అనుభవంతో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు అన్నింటినీ అనుసంధానం చేసే వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచనలున్నాయి. -
పార్కింగ్ లేకున్నా యథేచ్ఛగా పర్మిషన్లు
కరీంనగర్ కార్పొరేషన్: హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్.. ఇలా జనసందోహం ఎక్కువగా వచ్చిపోయే వ్యాపారాలకు పార్కింగ్ స్థలాలు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులకు ఇవేమి కనిపించడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆక్రమణలు తొలగిస్తున్నట్లు హడావిడి చేస్తున్న అధికారులు చిన్నా చితకా వ్యాపారులపై ప్రతాపం చూపెడుతూ బడా వ్యాపారులను వదిలేస్తున్నారు. దీంతో స్వామి కార్యం.. స్వకార్యం రెండూ సిద్ధిస్తున్నాయి. ఇలా చూసీచూడనట్లు వదిలేయడంతో మున్సిపల్ అధికారులకు కాసుల వర్షం కురుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలానెలా ఇంత అంటూ వసూళ్లు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్కింగ్లు లేకపోయినా నడిరోడ్డుపై వాహనాలు నిలుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న దుకాణాలపై చర్యలు చేపట్టాల్సింది పోయి వారికే వత్తాసు పలుకడం చర్చనీయాంశంగా మారింది. పార్కింగ్‌లపై దృష్టేదీ.. కరీంనగర్ స్మార్ట్‌సిటీగా అవతరించిన తర్వాత దేశంలో ఒక మంచి నగరంగా గుర్తింపు పొందేలా తయారు చేయాల్సిన అధికారులు ఆ వైపుగా ఆలోచించడం లేదు. రోడ్లు, డ్రెయినేజీ కడితేనే స్మార్ట్‌సిటీ అనుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగించడం తమ బాధ్యతే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్ల ముందు చేసే పార్కింగ్‌లను ఒక ఆర్డర్లో పెట్టేందుకు కనీసం ఒక వాచ్మెన్ నియమించుకోవాలన్నా ఇంగిత జ్ఞానం కూడా ఆయా వ్యాపారులకు లేకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్షణ చర్యలు కరువు టిఫిన్ సెంటర్ల వద్దకు వచ్చే వాహనదారులు రోడ్డుపైనే పార్కింగ్లు చేయాల్సి వస్తోంది. దీంతో వారి వాహనాలకు రక్షణ లేకుండా పోతోంది. వాహనాలు దొంగతనం జరగడం, ఒకరి వాహనాలు ఒకరు తీసుకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసినా రూంలో మాత్రమే పెట్టుకొని బయట వాహనాలను గాలికి వదిలేయడం వంటివి జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగినప్పటికీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో కనీసం తమ వాహనం దొంగతనం జరిగిందా.. ఎవరైనా తమ వాహనం అని మర్చిపోయి తీసుకెళ్లారా? అనే విషయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తమ వాహనం ఇతరులు తీసుకెళ్తే వారు తెచ్చి ఇచ్చే వరకు టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు మానుకొని తమ వాహనం కోసం తిరగాల్సి వస్తోంది. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయం. అధికారుల నిర్లక్ష్యం.. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు పార్కింగ్‌ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్కింగ్లు లేకపోయినా.. రోడ్డుపై అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కమాన్‌చౌరస్తా, బస్టాండ్ వద్ద, తెలంగాణచౌక్‌లో, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఇలా ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ల సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత మంది వ్యాపారులైతే పార్కింగ్లు క్రమపద్ధతిలో పెట్టుకునేందుకు సెక్యూరిటీని కూడా నియమించడం లేదు. పైగా కష్టమర్లయిన వాహనదారులపైనే దురుసుగా ప్రవర్థిస్తుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పార్కింగ్లు లేని వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘మెట్రో’ రైలు సీన్ రివర్స్!
హైటెక్ నగరిలో అద్భుత ఆవిష్కరణ అంటూ వచ్చిన ‘మెట్రో’ రైలు చతికిలబడుతోంది. ఈ రైళ్ల రాకతో ఆర్టీసీ ప్రయాణికులు తగ్గుతారని భావిస్తే బస్సుల్లో మాత్రం ఆక్యుపెన్సీ అమాంతం పెరిగింది. పైగా మెట్రోకు సమాంతరంగా నడిచే సిటీ బస్సుల్లో ప్రయాణికులు రెండు శాతం పెరగడం గమనార్హం. మెట్రో జర్నీ, ఈ రూట్లలో ఆర్టీసీ సర్వీసులపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో ఇది స్పష్టమైంది. గతేడాది నవంబరులో నగరంలోని రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రెండు నెలలు రోజూ లక్షల మంది వీటిలో ప్రయాణం చేయడాన్ని చూసిన అధికారులు.. ఇదే ఆదరణ ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం మెట్రోల్లో ప్రయాణికులు 50 వేలు మించడం లేదు. ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెట్రో స్టేషన్లు బోసిపోతున్నాయి. అధిక చార్జీలు, పార్కింగ్ సమస్యలతో వివిధ వర్గాలు మెట్రో జర్నీకి ‘నో’ చెబుతున్నాయి. మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే సిటీ బస్సులకు ఆదరణ తగ్గుతున్న అంచనాలు తలకిందులయ్యాయి. రెండు కారిడార్లలో మొత్తం 1700 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా, రోజూ 15 లక్షల మంది సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ రెండు రూట్లలో అద్భుతమైన ఆక్యుపెన్సీ నమోదైంది. నెల రోజుల్లోనే ఆక్యుపెన్సీ 66 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. మెట్రో రాకతో ఆర్టీసీ అధికారులు సైతం మేల్కొని పలుప్రాంతాలకు అదనపు బస్సులను నడపడం.. మెట్రో రూట్లోని సమీప కాలనీల నుంచి నేరుగా గమ్యస్థానాలకు బస్సులనుతిప్పున్నారు. పైగా లాంగ్ రూట్ సర్వీసులను సైతం పెంచారు. కొన్ని బస్తీలకు ఫీడర్ బస్సులను కూడా తిప్పుతుండడంతోఆర్టీసీకి ప్రజాదరణ మెరుగుపడింది. పైగా మెట్రో జర్నీ కంటే ఆర్టీసీ చార్జీలు తక్కువగా ఉండడంతో సగటు మధ్యతరగతి ప్రయాణికుడు సిటీబస్సుకే ‘జై’ కొడుతున్నాడు. సాక్షి, సిటీబ్యూరో/మియాపూర్/ఉప్పల్/సికింద్రాబాద్ :మెట్రో కలలు కరిగిపోతున్నాయి. ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది నవంబరులో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రెండునెలలు జాయ్‌రైడ్స్‌తో సిటీజన్లు ఎంజాయ్ చేసినా.. ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. నిత్యం మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య సరాసరి 50 వేలకు మించడం లేదు. ఆదివారం, ఇతర సెలవురోజుల్లో రద్దీ సుమారు 70 వేలుగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు మెట్రో స్టేషన్లు ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. అధిక చార్జీలు, పార్కింగ్ చార్జీల మోత కారణంగా వివిధ వర్గాలు మెట్రో జర్నీపై ఆసక్తి కనబర్చడంలేదు. నాగోల్– అమీర్‌పేట్ (17కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్ (13కి.మీ) రెండురూట్లలో సుమారు రెండు లక్షలమంది నిత్యం ప్రయాణం చేస్తారనుకున్న అంచనాలు ఇప్పుడు తల్లకిందులవడం గమనార్హం. అంతేకాదు రోజువారీగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అల్పాదాయ, మధ్యాదాయ, అసంఘటిత రంగ కార్మికులు, వేతనజీవులు ఇప్పటికీ సింహభాగం ఆర్టీసీ బస్సులు, వ్యక్తిగత బైక్‌లనే వినియోగిస్తున్నట్లు ‘సాక్షి’ బృందం మెట్రో రూట్లలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో సుస్పష్టమైంది. వ్యక్తిగత పనులు, వివిధ శుభకార్యాల నిమిత్తం బంధుమిత్రులను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వారు చాలా మంది మెట్రోలో జాయ్‌రైడ్స్ చేస్తుండడం గమనార్హం. మెట్రో జర్నీ విముఖతకు కారణాలివే.. ⇔ నగరంలో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, మార్కెటింగ్‌రంగం, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, చిరుద్యోగులు అధిక మెట్రో చార్జీలు, పార్కింగ్ ఫీజులు తడిసి మోపడవుతున్న కారణంగా మెట్రో జర్నీకి వెనుకంజ వేస్తున్నారు. మెట్రోలో కనీసం రూ.10,గరిష్టంగా రూ.60 టికెట్ చార్జీలు వసూలు చేస్తున్న విషయం విదితమే. ⇔ ప్రధానంగా రూ.25 వేలలోపు ఆర్జిస్తున్న వేతనజీవులు, కార్మికులు వ్యక్తిగత వాహనాలను వినియోగించడంతోపాటు, ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ పాస్‌లతోనే రాకపోకలు సాగిస్తున్నారు. ⇔ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆర్టీసీ మినీ బస్సులు అందుబాటులో లేకపోవడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కల్పించడంలో ప్రభుత్వం, మెట్రో అధికారులు విఫలమవడం శాపంగా పరిణమిస్తోంది. ⇔ ఉదాహరణకు మియాపూర్ నుంచి ఉప్పల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో చార్జీ రూ.30 అవుతోంది. అదే మెట్రో రైల్లో రూ.80 చార్జీ అవుతోంది. బస్సు కంటే రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు అంటున్నారు. ⇔ ఇక నలుగురు సభ్యులున్న కుటుంబం ఉప్పల్ నుంచి ప్యారడైజ్ వరకు వెళ్లేందుకు.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లి అక్కడ తమ కారు పార్కింగ్ చేసి.. ఆ తర్వాత మెట్రోలో జర్నీ చేసి.. షాపింగ్ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వస్తే ఖర్చు రూ.300కుపైమాటే. అదే క్యాబ్‌లో ఇంటి నుంచి నేరుగా షాపింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటే ఖర్చు రూ.200 మాత్రమే. దీంతో చాలామంది కుటుంబ సమేతంగా క్యాబ్ జర్నీ వైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం. ⇔ ఇక శని, ఆదివారాలు, ఇతర సెలవురోజుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇతర జిల్లాల నుంచి నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రయాణికులు మెట్రో రైళ్లలో జాయ్‌రైడ్స్ చేసి ఆనందిస్తున్నారు. వామ్మో మెట్రో పార్కింగ్..! రెండు రూట్లలో 17 పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. పలు పార్కింగ్ స్థలాలు ప్రధాన రహదారికి ఆనుకొనే ఉన్నాయి. ఇక్కడ వాహనాలను సురక్షితంగా నిలుపుకొనేందుకు ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనాలను ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోందని. దీంతో వాహనాలు దుమ్ముకొట్టుకుపోవడంతోపాటు అందులోని ఇంధనం ఎండకు ఆవిరవుతోందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇక పార్కింగ్ రుసుము బైక్‌కు రెండు గంటలకు రూ.5, అదనంగా మరో గంటకు రూ.2 చెల్లించాల్సి వస్తోంది. సుమారు 8 గంటలు బైక్ పార్కింగ్ చేస్తే ఖర్చు రూ.17 తథ్యం. డెయిలీ పాస్ ద్వారా ఏడు గంటలకు రూ.15, మంత్లీ పాస్ తీసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంది. కారుకు రెండు గంటలకు రూ.12, అదనంగా ప్రతీ గంటకు రూ.6 చెల్లించాల్సి వస్తోంది. డెయిలీ కార్ పాస్ అయితే ఏడు గంటలకు రూ.40, మంత్లీ పాస్ అయితే నెలకు రూ.750 చొప్పున పార్కింగ్ రుసుము బాదేస్తుండడం గమనార్హం. స్మార్ట్కార్డులకుగిరాకీ నామమాత్రమే.. మెట్రో జర్నీని సులభతరం చేసేందుకు జారీ చేసిన నెబ్యులా స్మార్ట్‌కార్డులు ఇప్పటివరకు 2.50 లక్షలు విక్రయించారు. ఇందులో నెలవారీగా రీచార్జీ అవుతున్నవి రూ.30 వేలకు మించి లేకపోవడం గమనార్హం. ఈ కార్డులు కేవలం మెట్రో జర్నీకే పరిమితం కావడం, ఇతర సేవలు పొందేందుకు ప్రస్తుతానికి అవకాశం లేకపోవడంతో ఈ కార్డులను పలువురు ప్రయాణికులు ఇళ్లలో అలంకార ప్రాయంగానే వీటిని పెట్టినట్లు తెలుస్తోంది. స్మార్ట్ సైకిళ్లకుఆదరణ అంతంతే.. మియాపూర్, జేఎన్టీయూ, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లతోపాటు మియాపూర్ ఎక్స్ రోడ్డు, సైబర్ టవర్స్, జేఎన్టీయూ యూనివర్సిటీ గేటు దగ్గర స్మార్ట్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడు స్టేషన్లలో 75 స్మార్ట్ సైకిళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని రోజువారీగా వినియోగిస్తున్నవారు 400కు మించకపోవడం గమనార్హం. ఈ సైకిళ్లను వినియోగించాలనుకున్నవారు మొదటగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సైకిల్ వినియోగించే వారు రూ. 500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధార్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ మొబైల్ యాప్‌లోకి వెళ్లి సైకిల్ వెనక ఉండే ఆన్ బోర్డు కంప్యూటర్‌పై చూపిస్తే కోడ్ వస్తోంది. దానిని అక్కడ నమోదు చేస్తే సైకిల్‌కు ఉన్న తాళం తెరుచుకుంటుంది. మెట్రో కార్డు ద్వారా కూడా ఈ సిస్టమ్ పనిచేస్తోంది. ఒక స్టేషన్లో తీసుకొని మరో స్టేషన్లో అమర్చే వరకు తిరిగే సమయాన్ని లెక్కిస్తోంది. రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మొదటి అర గంట ప్రతిరోజు ఉచితం. ఆ తర్వాత అరగంట నుంచి రూ.10 అద్దె చెల్లించాల్సిందే. ఇక వారం రోజుల పాటు పాస్ తీసుకుంటే రూ.199, నెలకు రూ.399, ఆరు నెలలకు రూ.1199, ఏడాదికి రూ.1999 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, పాస్ లేకపోతే మొదటి అరగంటకు కూడా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ బైక్స్దీ అదే దారి.. మెట్రో బైక్స్ సంస్థ రూపొందించిన మెట్రో బైక్స్‌ను వినియోగించడానికి మొబైల్లో మెట్రో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని బైక్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఠీఠీఠీ. ఝ్ఛ్టటౌbజీజ్ఛుట. జీn వైబ్ సైట్ ద్వారా బైక్‌లను పొందవచ్చు. ప్రయాణికులు బైక్‌ను పొందేందుకు ఆధార్ కార్డు, లైసెన్స్ అవసరమవుతాయి. 18ఏళ్లు నిండిన వారికి బైక్స్‌ను వినియోగించడానికి అవకాశం ఉంది. మియాపూర్, నాగోల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో 20 మెట్రో బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిత్యం వినియోగిస్తున్నవారు 250కి మించి లేకపోవడం గమనార్హం. వీటి వినియోగానికి కిలో మీటరుకు రూ.4 చొప్పున బైక్స్ అద్దెకు ఇస్తున్నారు. ఒక్క రోజు అద్దె రూ.300, వారం రోజులకు రూ.1500, నెలకు రూ.4,500 చెల్లించాలి. వారం, నెల పాస్ తీసుకున్నవారు బైక్‌లో పెట్రోల్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. జీపీఎస్ పద్ధతి ద్వారా ఎక్కడ ఉందో ఎంత దూరం ప్రయాణించిందో తెలుసుకోవచ్చు. తగ్గని ఆదరణ మెట్రో రూట్లలో ఆర్టీసీకి సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజారవాణా వ్యవస్థలో గ్రేటర్ ఆర్టీసీ స్థానం చెక్కుచెదరలేదు. లక్షలాది మంది ప్రయాణికులతో సిటీ బస్సులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే సిటీ బస్సులకు ఆదరణ తగ్గుతుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. రెండు కారిడార్లలో మొత్తం 1,700 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం 15 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ రెండు రూట్లలో 68 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ ‘సాక్షి’తో చెప్పారు. నెల రోజుల్లోనే 2 శాతం ఆక్యుపెన్సీ అదనంగా నమోదై 66 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. అన్ని వేళల్లో ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండడం, సమీప కాలనీల నుంచి నేరుగా గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే సదుపాయం ఉండడం ఆర్టీసీకి బాగా కలిసివచ్చింది. మరోవైపు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన లక్షలాది మంది బస్సుపాస్ వినియోగదారులు సిటీ బస్సులపైనే ఆధారపడి ఉన్నారు. ఎల్బీనగర్ నుంచి నేరుగా మియాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెట్రో రైళ్ల కంటే సిటీ బస్సులే ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పైగా పేద, అల్పాదాయ వర్గాలకుఅనుకూలంగా ఉన్న ఆర్టీసీ చార్జీలు కూడా ఇందుకు మరో కారణం. అంచనాలు తారుమారు.. మెట్రో రాకతో సిటీ బస్సులపై ప్రభావం పడొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు లాంగ్ రూట్ బస్సులపై ప్రధానంగా దృష్టి సారించారు. హయత్‌నగర్ నుంచి నేరుగా కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, సికింద్రాబాద్, జూబ్లీబస్‌స్టేషన్ వంటి దూరప్రాంతాల బస్సుల రాకపోకలపై అధ్యయనం చేశారు. ఉప్పల్– సికింద్రాబాద్, తార్నాక– సికింద్రాబాద్, మియాపూర్– కూకట్పల్లి, సికింద్రాబాద్– అమీర్‌పేట్– మియాపూర్ తదితర మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీని గమనించారు. మెట్రో రైళ్లు ప్రారంభించిన తొలి నెలరోజుల పాటు ఆర్టీసీ ఆక్యుపెన్సీ స్వల్పంగా తగ్గినప్పటికీ తక్కువ వ్యవధిలోనే తిరిగి పుంజుకుంది. నాగోల్ నుంచి సికింద్రాబాద్ వరకు 740 బస్సులు, అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు 960 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో రాకకు ముందు నుంచి కూడా రెండు రూట్లలో మొత్తం 1,700 బస్సులు ప్రతిరోజు 8 వేల ట్రిప్పులకుపైగా తిరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు ఈ రెండు రూట్లలో ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. నాగోల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులు చాలా వరకు నాగోల్ చౌరస్తా నుంచే కాకుండా సమీపంలోని కొత్తపేట్, దిల్సుఖ్నగర్, బండ్లగూడ, జైపురి కాలనీ, తట్టిఅన్నారం ప్రాంతాల నుంచి నేరుగా బయలుదేరడంతో ప్రయాణికులు ఇంటి నుంచి నేరుగా వెళ్లేందుకు అవకాశం లభిస్తోంది. అలాగే మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలోనూ వందలాది కాలనీలకు నేరుగా సిటీ బస్సు సదుపాయం ఉంది. ఫీడర్ రూట్లలో 85 బస్సులు.. మరోవైపు మెట్రో కారిడార్లకు రెండు వైపుల కాలనీల నుంచి ప్రయాణికులకు మెట్రో స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఫీడర్ బస్సులు కూడా పెరిగాయి. గతంలో రెండు మార్గాల్లో 75 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని 85కు పెంచారు. మియాపూర్, జేఎన్టీయూ, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో బస్సుల సంఖ్య పెంచినట్లు అధికారులు తెలిపారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. -
ప్రయాణం ఓకే.. పార్కింగ్‌తోనే పరేషానీ!
సాక్షి, హైదరాబాద్: రెండో రోజూ నగర సిటిజన్లలో మెట్రో జోష్ కనిపించింది. తొలిరోజే 2 లక్షల మంది ప్రయాణికుల జర్నీతో ఇతర మెట్రోల రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదే జోరుతో రెండోరోజు గురువారం కూడా నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో సుమారు రెండు లక్షల మంది ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... ఈ రెండు మార్గాల్లోని 24 స్టేషన్లకుగాను ఐదు చోట్ల మాత్రమే పార్కింగ్ సదుపాయాలుండడంతో మిగతా చోట్ల పార్కింగ్ తిప్పలు నగరవాసులకు చుక్కలు చూపాయి. పార్కింగ్ సదుపాయం ఉన్న చోట చార్జీల బాదుడు.. లేని చోట స్టేషన్ల కింద, సమీప ప్రాంతాల్లో బైక్‌లు, కార్లు పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి ఒక్కొక్కరి నుంచి వందల రూపాయలు జరినామా విధించారు. ట్రాఫిక్ పోలీసుల బాదుడు అదనం... ఇక ప్రధాన రహదారులపై ఉన్న మెట్రో స్టేషన్ల కింద, సమీప ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను గురువారం ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బైక్‌లు, కార్లను సమీప ట్రాఫిక్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఒకేరోజు సుమారు వెయ్యి వాహనాలను సీజ్‌చేసి ఒక్కో ద్విచక్రవాహనం నుంచి రూ.250.. కార్లపై రూ.350 జరిమానా విధించడం గమనార్హం. కిటకిటలాడిన మెట్రో స్టేషన్లు.. మెట్రో ‘సెకండ్’డే జర్నీ సైతం అదుర్స్ అనిపించింది. ప్రధానంగా ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, బేగంపేట, ప్రకాష్‌నగర్, రసూల్‌పురా, పరేడ్‌గ్రౌండ్స్ మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఎక్కడా లేనంత రద్దీ అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లో కనిపించింది. ఈ నేపథ్యంలో స్టేషన్లలో, మెట్రో రైలులో సెల్పీలు దిగి జనం మురిసిపోయారు. కాగా మియాపూర్ స్టేషన్ ఆవరణలో 25 సైకిళ్లతో ఏర్పాటు చేసిన సైకిల్‌స్టేషన్ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. సాంకేతిక కారణాల కారణంగా రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభించలేదని ఈ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. టికెట్ కన్నా.. పార్కింగ్ చార్జీయే అధికం.. ప్రస్తుతం అందుబాటులోఉన్న ఐదు పార్కింగ్ ప్రాంతాల్లో బైక్‌లకు తొలి 2 గంటలు రూ.6, ఆ తరువాత ప్రతి గంట కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన పది గంటలపాటు బైక్‌ను మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన వారు రూ.24 సమర్పించుకోవాలి. ఇక కార్లకు తొలి 2 గంటలకు రూ.12.. ఆపై ప్రతి గంటకు రూ.6 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన మెట్రో స్టేషన్ వద్ద కారును పది గంటల పాటు పార్క్ చేస్తే రూ.48 చెల్లించాలి. అంటే నాగోల్–అమీర్‌పేట్ టికెట్ చార్జీ రూ.45 కాగా.. పార్కింగ్ చార్జీ రూ.48 అన్నమాట. మరోవైపు మెట్రో అధికారులు మరో ఆరు పార్కింగ్ కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా.. ఇంకా కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. మెట్రో.. ఎంతో థ్రిల్... మెట్రో మొదటి అనుభవం ఎంతో థ్రిల్‌నిచ్చింది. అయితే మహిళలకు టికెట్ కౌంటర్ల వద్ద విడిగా క్యూలైన్ గానీ, రైలులో విడిగా సీట్లు గానీ లేకపోవడం కొంచెం బాధ కలిగించింది. –రామసుధ, అమీర్‌పేట్ చార్జీ భారంగా మారింది నాగోలు నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో ప్రయాణం చేశా. జర్నీ బాగుంది కానీ చార్జీ భారంగా మారింది. అలాగే స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేక వాహనం ఎక్కడ పెట్టాలో అర్ధం కాలేదు. –సాయి -
పార్కింగ్ కోసం ప్రత్యేక పాలసీ: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరంతోపాటు, ఇతర పట్టణాల్లో పార్కింగ్ కోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖాధికారులతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రజలకు ప్రధానంగా పార్కింగ్, రోడ్ల నిర్వహణ లోపాల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్లు, మున్సిపల్ శాఖా అధికారులతో పార్కింగ్ పాలసీ రూపకల్పనపైన సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ మేరకు రూపొందించిన పార్కింగ్ పాలసీ డ్రాప్ట్ పైనా అధికారులతో చర్చించారు. రోడ్లపైన వాహనాలు తిరిగేందుకు నిర్ధారించిన మార్గాన్ని కాపాడడం, రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీ ఉంటుందన్నారు. నగరంలోని ప్రణాళిక బద్దమైన అభివృద్ది దిశగా తీసుకుకెళ్లేందుకు ఈ పార్కింగ్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఎర్పాట్లతో పాటు ఖాళీ ప్రదేశాల్లోను పార్కింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఖాళీ ప్రదేశాల యాజమాన్యాలను చైతన్యవంతం చేసేలా అధికారులు ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ మేరకు పార్కింగ్ కోసం ముందుకు వచ్చే వారికి పలు ప్రొత్సాకాలను ఇస్తామన్నారు. నూతనంగా భవనాలు నిర్మాణం చేసేవారు పార్కింగ్ కోసం నిర్దారిత పార్కింగ్ కన్నా అధికంగా పార్కింగ్ కల్పిస్తే వారికి భవన నిర్మాణ అనుమతుల్లో కొన్ని సడలింపులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గతంలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశంలో నిర్మాణాలు చేసిన కాంప్లెక్స్ ల్లో కూల్చివేతలు వేంటనే చేపట్టాలని ఛీప్ టౌన్ ప్లానింగ్ అఫీసర్ కు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. -
పాతవాహనాలను రోడ్లపైకి రానీయొద్దు
జాతీయ హరిత ధర్మాసనం ఆదేశం - 15 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించొద్దు - ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయొద్దు - ఎన్జీటీ ఆదేశాలతో మాయం కానున్న పది లక్షల వాహనాలు - పార్కింగ్ సమస్యనుంచి స్వల్ప ఉపశమనం సాక్షి, న్యూఢిల్లీ: 15 ఏళ్లు దాటిన వాహనాలను నగర రహదారులపైకి రానీయొద్దని జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఆదేశించింది. నగరంలో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతుండడం, వాయు నాణ్యత తగ్గిపోతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని పై విధంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాల కారణంగా 10 లక్షల వాహనాలు నగర రహదారులపైనుంచి మాయం కానున్నాయి. ఇందువల్ల నగరంలో పార్కింగ్ సమస్యకు కూడా కొంతమేర పరిష్కారం లభించనుంది. జాతీయ రాజధానిలో వాయుకాలుష్యంపై వర్థమాన్ కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించిన అనంతరం మొత్తం 14 ఆదేశాలు జారీచేసింది. 15 సంవత్సరాలు దాటిన అన్ని రకాల వాహనాలపై నిషేధం వాటిలో ఒకటి, ఇటువంటి వాహనాలను గుర్తించినప్పుడు సంబంధిత అధికారులు వాటిని మోటారు వాహన చట్టం నిబంధనల కింద స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇటువంటి వాహనాలను బహిరంగ ప్రదేశాలలో నిలిపిఉంచినప్పుడు చలాన్ విధింపు, జప్తు చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించకూడదని, వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేయరాదని ఆదేశించింది. ఈ ఆదేశాల కారణంగా పాత వాహనాలు రహదారులపై ఇకమీదట కనుమరుగు కానున్నాయి. ఇందువల్ల కొత్తవాటికి డిమాండ్ పెరగనుంది. బహిరంగప్రదేశాలలో ప్లాస్టిక్, చెట్ల ఆకుల వంటివాటిని తగులబెట్టడాన్ని అనుమతించరాదని, అటువంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టరీత్యా తగిన చర్య తీసుకోవాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది.