the parliament
-
భం భం భోలె... నగారా మోగెలే
‘గ్రేటర్’లో ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు 24 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలకు.. ఓటు వేయనున్న 74.56 లక్షల ఓటర్లు అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి రంగంలో తొమ్మిది {పధాన పార్టీలు మొదలైన ఎన్నికల వేడి సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మహానగర పరిధిలో ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహప్రతివ్యూహాలు, అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరో 55 రోజుల్లో పోలింగ్ జరగనుంది. కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సాక్షి, సిటీబ్యూరో: మహానగరం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కౌంట్‌డౌన్‌కు తెరతీసింది. ఏకకాలంలో పార్లమెంటు, అసెం బ్లీలకు ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. గ్రేటర్ పరిధిలో ఈసారి మొత్తంగా 74,55,934 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 39,96,827, మహిళలు 34,59,107 మంది ఉన్నారు. ప్రధాన నగరంలో 15 శాసనసభ స్థానాలకు, శివార్లలో 9 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదేరోజు ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాలు పూర్తిగా గ్రేటర్ పరిధి లోనివే. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, నల్లగొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో గ్రేటర్ శివార్లు పాక్షికంగానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం, ఎంఐఎం, టీఆర్ఎస్, లోక్‌సత్తా, వామపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మహానగరంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. గెలుపుగుర్రాల అన్వేషణ, నియోజకవర్గాల వారీగా ఎన్నికల మేనిఫెస్టోలు, హామీల రూపకల్పనలో పార్టీలు నిమగ్నమయ్యాయి. ‘కోడ్’ కూసింది ఎన్నికల షెడ్యూలు విడుదలయిన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల బదిలీలతోపాటు నూతన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. నిబంధనావళి అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి లేకుండా బదిలీలు చేయడానికి వీల్లేదు. అత్యధికం.. అత్యల్పం ఇక్కడే గ్రేటర్ పరిధిలో అత్యధికంగా కుత్బుల్లాపూర్ శాసనసభా నియోజకవర్గంలో 5,58,742 మంది ఓటర్లు ఈ సారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యల్పంగా చార్మినార్ శాసనసభ స్థానంలో 1,72,566 మంది ఓటు వేయనున్నారు. నేడు సమీక్ష.. గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక కమిషనర్ రాహుల్ బొజ్జా గురువారం సమీక్షించనున్నారు. బుధవారమే ఆయన జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్(ఎన్నికలు)గా బాధ్యతలు చేపట్టారు. -
గీత దాటొద్దు
అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారం చేయరాదు 24 గంటల్లోపు రాజకీయ పార్టీల ఫ్లైక్సీలు తొలగించాలి {పజాప్రతినిధుల వద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వెనక్కి కలెక్టర్ రాంగోపాల్ చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్ స్పష్టం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన క్రమంలో బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయని, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజకీయ నాయకులు, శాసనసభ్యులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారాలు వద్దు మతసంబంధమైన ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రచారం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ఆయా కమిటీలకు వాగ్దానాలు చేయడం, హామీలివ్వడం, పనులు చేపట్టరాదన్నారు. కుల, మత ప్రాతిపదికపై ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఫ్లెక్సీలు తొలగించాలి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ నాయకుల, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లోపు తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్, పంచాయతీ చట్టాల మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు అయ్యేవరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల యం త్రాంగం ఆధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయించి నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రతినిధుల వద్ద విధుల కోసం డెప్యుటేషన్‌పై వెళ్లిన ప్రభుత్వ అధికారులు వారి మాతృశాఖకు తిరిగి రావాలని ఆదేశించారు. నూతన పనులు చేపట్టరాదు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుంచి ఎలాంటి నూతన పనులూ చేపట్టరాదని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన పనులనే పూర్తి చేయాలన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే ఏదైనా చర్యలు చేపట్టాలంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. బోరు, మోటారు రిపేరులాంటి పనులు చేపట్టవచ్చునని, వీటికి నిధులు సమస్య లేదని అన్నారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య, ఎన్నికల విభాగం అధికారులు పార్థసారథి, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనస్వాగతం
ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్న నాయకులు నినాదాలతో మార్మోగిన కాజీపేట జంక్షన్ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఢిల్లీకి వెళ్లిని జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు.. బిల్లు ఆమోదం పొందిన తర్వాత విజయదరహాసంతో గురువారం ఢిల్లీ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్నారు. నాయకుల రాకను తెలుసుకున్న ఉద్యోగులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వారికి ఘనస్వాగతం పలికారు. ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణవాదులతో కాజీపేట రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. తెలంగాణ నినాదాలతో కాజీపేట జంక్షన్ ప్రాంగణం మార్మోగింది. తెలంగాణ రాష్ర్టం.. అమరులకు అంకితం కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్‌లో ఉద్యోగ సంఘాల ఐకాస చైర్మన్ పరిటాల సుబ్బారావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులకే అంకితం అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్, యావత్తు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యోమంలో కలిసి వచ్చిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు కోలా రాజేష్‌గౌడ్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి జగన్మోహ న్‌రావు, టీఎన్జీవోఎస్ సిటీ అధ్యక్షుడు రాంకిషన్‌నాయక్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉన్నారు. కాజీపేట జంక్షన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ కాజీపేట జంక్షన్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఉద్యోగ సంఘాల నాయకుల ర్యాలీ నిర్వహించారు. కాజీపేట జంక్షన్ నుంచి చౌరస్తా, పాతీమానగర్ జంక్షన్, సుబేదారి మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు.