విభజనపై చివరి దశ సమీక్షలు
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై చివరి దశ సమీక్షలు రాజ్భవన్లో కొనసాగుతున్నాయి. ఈ సమీక్షా సమావేశానికి గవర్నర్ సలహాదారు రాయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితోపాటు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ట్రయలర్ రన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమీక్షా సమావేశాలకు గవర్నర్ నరసింహన్ అధ్యక్షత వహించారు.
ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. అయితే ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. అపాయింటెడ్ తేది జూన్ 2 లోపల పనులు పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.