Parvathi Nair
-
హీరోయిన్ పెళ్లి వీడియో, ఒంటినిండా నగలతో దబిడి దిబిడి బ్యూటీ
ఛావా సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక మందన్నాపెళ్లి వీడియో షేర్ చేసిన పార్వతి నాయర్గ్రీన్ స్వెట్షర్ట్లో శ్రీలీలషాపింగ్మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దబిడి దిబిడి ఐటం సాంగ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాస్టెప్పులతో అదరగొట్టిన ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Alex (@alexander.mcube) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
నా పనిమనిషి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడేమో..: నటి ఆవేదన
ప్రముఖ మలయాళ నటి, మోడల్ పార్వతి నాయర్, ఆమె పనిమనిషి మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న తెలిసిందే. ఇప్పటికే అతనిపై నటి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయంటూ పోలీసులను ఆశ్రయించింది పార్వతి నాయర్. ఆ తర్వాత సుభాష్ మీడియా ముందుకొచ్చి పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లోకి రాత్రిళ్లు ఎవరెవరో వస్తున్నారని ఆరోపించాడు. ఇది చూసిన కారణంగానే తనపై కక్ష కట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే సుభాష్ ఆరోపణలపై పార్వతి తాజాగా మీడియాతో వెల్లడించారు. (చదవండి: పనిమనిషి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటి పార్వతీనాయర్) పార్వతి నాయర్ మాట్లాడుతూ.. 'అక్టోబర్‌లో మా ఇంట్లో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు పోయాయి. నేను అప్పుడు షూటింగ్లో ఉన్నా. అప్పుడు ఇంట్లో ఉన్నది సుభాష్ ఉన్నాడని పోలీసులకు చెప్పా. ఆ తర్వాత నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. మొదట్లో నేను భయపడ్డా. తర్వాత అతడి మాటలు పట్టించుకోలేదు. తప్పు చేయకపోతే అతను ఎందుకు భయపడుతున్నాడు. ఆమె మాట్లాడుతూ.. 'నా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు దావా కూడా వేశా. అతడు చెప్పిన ప్రతీ విషయం అబద్ధం. కేసును తప్పుదోవ పట్టించటానికి ఇలా చేశాడు. అతడు తప్పు చేశాడని నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను చట్టప్రకారం ముందుకు వెళ్లాలని చూస్తున్నా. అతడు ఓ అనాథ అని నాకు మొదట్లో చెప్పాడు. ఇప్పుడు మాత్రం అతడి తరఫున వాళ్లు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నేను పని చేస్తున్న ప్రొడక్షన్ వాళ్లు నన్ను అడుగుతున్నారు. నాకు మానసికంగా ఇబ్బంది ఎదురవుతోంది' అని ఆవేదన వ్యక్తం చేసింది. -
నా మొదటి ప్రేమికుడాయనే!
తమిళసినిమా: నా మొదటి ప్రేమికుడు ఆయనే అని చెబుతోంది నటి పార్వతీ నాయర్. దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ మలయాళీ భామ తొలుత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో మాతృభాషా చిత్రాలకే పరిమితం అయినా ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది సినిమాను తిరగేస్తోంది. అయితే గ్లామర్‌కు హద్దులు లేవన్నట్లు అందాలారబోతకు సిద్ధం అంటున్నా, ఇంకా ఈ బ్యూటీకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. కోలీవుడ్‌లో జయంరవితో కలిసి నిమిర్న్దు నిల్ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన పార్వతీనాయర్ ఆ తరువాత అజిత్‌తో కలిసి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై అరిందాల్ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌లో నిమిర్, శాంతనుతో కోడిట్ట ఇడంగళై నిరంబుగ చిత్రాల్లో కథానాయకిగా నటించింది. ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నటించిన సీతాక్కాది చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో ప్రేమ గురించి మాట్లాడుతూ తనకు పాఠశాలలో చదువుకునే వయసులోన పలువురిపై ప్రేమ పుట్టిందని చెప్పింది. అలా తన మొదటి ప్రేమికుడు నటుడు అజిత్‌నేనని పేర్కొంది. అలాంటిది తాను ఆయనతో ఎన్నైఅరిందాల్ చిత్రంలో నటించే అకాశం కలగడం మరచిపోలేని అనుభవం అని అంది. సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా నటుడు అజిత్‌తో కలిసి ఒక్క చిత్రంలో ఒక్క సన్నివేశంలోనైనా నటించాలన్న ఆశ ఉంటుంది. నటి పార్వతీనాయర్ కూడా అలాంటి కోరికతోనే ఎన్నై అరిందాల్ చిత్రంలో అజిత్‌తో కాకపోయినా ఆయన చిత్రంలో తానుండాలని, నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించిదట. అజిత్ అంటే సినీమా హీరోయిన్లే కాదు సాధారణ యువతులు ఇష్టపడతారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది మరి. -
ఫస్ట్ హీరోతో 34 ఏళ్ల తర్వాత!
ఒకటి కాదు... రెండు కాదు.. 34 ఏళ్లు పట్టింది మోహన్‌లాల్, నదియా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి. మోహన్‌లాల్ హీరోగా ఆల్మోస్ట్ 34 ఏళ్ల క్రితం ‘నోక్కెద దూరత్తు కన్నుమ్ నాట్టు’ సినిమాతోనే మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నదియా. ఆ తర్వాత తన తొలి హీరో మోహన్‌లాల్ సరసన ఆమె నటించలేదు. నిజానికి మాతృభాష మలయాళంలోకన్నా తమిళంలోనే నదియా ఎక్కువ సినిమాలు చేశారు. తమిళ చిత్రం ‘ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’తో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మారి, వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న నదియా ‘మిర్చి’తో తెలుగులో మోస్ట్ వాంటెడ్ వదిన, అమ్మ అయ్యారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు తన తొలి హీరో మోహన్‌లాల్‌తో ఆమె ‘నీరలి’ అనే సినిమా చేయనున్నారు. అయితే జంటగా కాదని సమాచారం. ఓ కీలక పాత్రకు నదియాను తీసుకున్నారట. ఈ చిత్రంలో పార్వతీ నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. అజయ్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మోహన్‌లాల్ స్లిమ్ లుక్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. -
ఎన్నై అరిందాల్ అంటున్న అజిత్
నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా ఇది ఆయన 55వ చిత్రం కావడం మరో విశేషం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు. అందాలభామలు అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే చిత్రంలో అదనంగా కేరళ కుట్టి పార్వతి నాయర్ వచ్చి చేరింది. ఈ అమ్మడి చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోందట. ఈ చిత్రం టైటిల్ ఏమిటన్న విషయం గురించి చాలాకాలంగా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవేమీ చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించినవి కావు. తాజాగా అజిత్ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ఎన్నై అరిందాల్ అనే పేరును ఖరారు చేశారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకోవడంతో, వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం మళ్లీ అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వీరం చిత్రం ఫేమ్ శివ దర్శకత్వం వహించనున్నారు.