ఎన్నై అరిందాల్ అంటున్న అజిత్
నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా ఇది ఆయన 55వ చిత్రం కావడం మరో విశేషం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు. అందాలభామలు అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే చిత్రంలో అదనంగా కేరళ కుట్టి పార్వతి నాయర్ వచ్చి చేరింది. ఈ అమ్మడి చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోందట.
ఈ చిత్రం టైటిల్ ఏమిటన్న విషయం గురించి చాలాకాలంగా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవేమీ చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించినవి కావు. తాజాగా అజిత్ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ఎన్నై అరిందాల్ అనే పేరును ఖరారు చేశారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకోవడంతో, వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం మళ్లీ అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వీరం చిత్రం ఫేమ్ శివ దర్శకత్వం వహించనున్నారు.