Passports issue
-
వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి?, భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ప్రక్రియను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ వ్యతిరేకించారు. మరికొద్దిరోజుల్లో జీ7 సమ్మిట్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీ 7 సమ్మిట్ కు సంబంధించి ఆయా దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హర్షవర్దన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను వ్యతిరేకిస్తున్నట్లు హర్ష వర్ధన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఇవ్వడం దేశాలపట్ల వివక్షత చూపినట్లే అవుతుందన్నారు. దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడం, సంబంధిత సమస్యలను పరిష్కరించడం, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల సరఫరా మరియు పంపిణీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని హర్షవర్దన్ అన్నారు.ఇక వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమలు అంటే దేశాల పట్ల వివక్షత చూపినట్లేనని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని భారత్ స్పష్టం చేస్తోందని చెప్పారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే కోవిడ్-19 నేపథ్యంలో ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పని సరిగా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారు సంబంధింత వివరాల్ని అధికారిక పాస్ పోర్ట్ వెబ్ సైట్లలో నమోదు చేసుకోవాలి. అలా ఎవరైతే పాస్ పోర్ట్ వెబ్ సైట్లో నమోదు చేసుకుంటారో వారికి ఆయా దేశాల పాస్ పోర్ట్ అధికారులు వ్యాక్సిన్ డీటెయిల్స్ తో సర్టిఫికెట్స్ ను అందిస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. దీన్నే ఇప్పుడు భారత్ వ్యతిరేకిస్తుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి ఇజ్రాయెల్ దేశం ఈ వ్యాక్సినేషన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరి దగ్గర ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉంటే వాళ్లు మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉండే వెసలు బాటు కల్పించింది. ఇజ్రాయెల్ బాటలో మరికొన్నిదేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చాయి. చదవండి : లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
‘కర్తార్‌పూర్’పై పాక్ వేర్వేరు ప్రకటనలు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్ కాడిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాక్ భిన్నమైన సమాచారమిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. కర్తార్‌పూర్ కారిడార్ సందర్శనకు వచ్చే భారతీయ యాత్రీకులు పాస్‌పోర్ట్‌ను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని, ఏదైనా చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం తెచ్చుకుంటే చాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నారు. తాజాగా, భద్రతా కారణాల రీత్యా భారతీయ యాత్రీకులు తమ వెంట పాస్‌పోర్ట్ తెచ్చుకోవాల్సిందేనని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. పాక్ తీరుపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందం అంశాలను పాక్ అమలు చేయాలని కోరింది. కాగా, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూకు శనివారం జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాకిస్తాన్ తరఫున పాల్గొనడానికి ప్రభుత్వం గురువారం రాజకీయ అనుమతి ఇచ్చింది. -
బంగ్లాదేశీయులకు హైదరాబాదీ పాస్‌పోర్టులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపుకార్డులతో ముగ్గురు బంగ్లాదేశీయులు నగరం నుంచి పాస్‌పోర్టులు తీసుకున్న సంగతి తాజాగా వెలుగు చూసింది. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, కొన్నాళ్లుగా ఇక్కడే ఉంటూ ఇక్కడి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు పొందారు. వీటిని వినియోగించి దుబాయ్ వెళ్లిన ఈ ముగ్గురు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కారు. దీంతో వీరిని కొచ్చికి డిపోర్టేషన్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి వ్యవహారంపై ఇక్కడి పోలీసులూ ఆరా తీస్తున్నారు. త్వరలో ఓ బృందం ఎర్నాకుళం వెళ్లనుంది. జల్పాయ్గురివాసులుగా చెప్పుకుంటూ.. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు చెందిన అజయ్ చౌదరి, షుబ్రో బరువా, అవి ముఖర్జీ సమీప బంధువులు. కొన్నాళ్ల క్రితమే వీరు అక్రమంగా వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇక్కడే ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఓటర్ ఐడీ, ఆధార్, పాన్‌కార్డ్ పొందినట్లు తేలింది. దీనికోసం షుబ్రో మినహా మిగిలిన ఇద్దరూ తమ ఇంటి పేర్లు మార్చేసి నమోదు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన ఇతర పత్రాల తయారీ, ప్రాసెసింగ్ బాధ్యతల్ని వారు కోల్‌కతాకు చెందిన ఓ ఏజెంట్‌కు అప్పగించారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసిన ఆ ఏజెంట్ వారికి సహకరించాడు. పాస్‌పోర్టుల దరఖాస్తుల్లో వీరం తా తమ స్వస్థలం పశ్చి మ బెంగాల్‌లోని జల్పాయ్గురిగా పేర్కొన్నారు. ఇలా వీరిలో చౌదరి, ముఖర్జీలకు ఈ ఏడాది మార్చ్ 5న, బరువాకు ఆగస్టు 6న పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. వీటి తో వారు గత బుధవారం దుబాయ్‌కు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి సెర్బియా మీదుగా దుబాయ్ చేరుకున్నారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ తనిఖీలో వీరు పట్టుబడ్డారు. దీంతో దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.దీంతో వారిని అక్కడినుంచి తిప్పి పంపారు. ముందస్తు సమాచారంతో కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు నేడుంబస్సేరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద ఉన్న పాస్‌పోర్టులు అసలైనవేనని ఎర్నాకుళం క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ కేఎస్ ఉదయభాను గుర్తించారు. మారు పేర్లతో ఉన్న ఆధార్, పాన్, ఓటర్ కార్డులను స్వాధీనం చేసు కున్నారు. వివరాల కోసం ఎర్నాకుళం క్రైమ్ బ్రాంచ్ విభాగం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేఖ రాసింది. పోలీసులు కొచ్చి ఇమ్మిగ్రేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, కేరళ ఇంటెలిజెన్స్ అధికారులు విచారించారు. వీరి వ్యవహారంలో ఉగ్రవాద కోణం ఉందా? అనే అనుమానాలను కూడా కేరళ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని కస్టడీకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. -
నీరవ్‌పై మౌనం వీడిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఒక్క వాలిడ్ పాస్‌పోర్టు మించి అతని దగ్గర ఇంకేమీ లేవవి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న రిపోర్టులను కొట్టిపారేసిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్, ఊహాగానాలకు చెక్ పెట్టాలని సూచించారు. ప్రతీసారి ముందస్తు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేసిన అనంతరమే, మోదీకి కొత్త పాస్‌పోర్టును జారీ చేసేవారమని తెలిపారు. ఇతర దేశాల పాస్‌పోర్టులతో నీరవ్ మోదీ గతవారం బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాలను సందర్శించినట్లు రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. నీరవ్‌ను పట్టుకునేందుకు సహకరించాలని పలు యూరోపియన్ దేశాలకు లేఖలు రాసినట్లు తెలిపారు. పాస్పోర్టుతో పాటు మూడు ముఖ్యమైన విషయాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. ఫిబ్రవరిలోనే మోదీ పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆల్ఇండియా మిషన్లకు ఆదేశించామని, ఇదే విషయాన్ని సంబంధిత దేశాలకు భారత రాయబారులు తెలిపారని చెప్పారు. రెండోది.. నీరవ్ మోదీని పట్టుకునేందుకు సహకరించాలని ఎంపిక చేసిన దేశాలకు తాజాగా లేఖలు రాసినట్టు తెలిపారు. వారి భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఒకవేళ వారి దేశంలో ఉన్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరినట్టు కూడా చెప్పారు. ఇక మూడోది... ఏజెన్సీల నుంచి నీరవ్ మోదీని అప్పగించాలని ఎలాంటి అభ్యర్థన రాలేదని తెలిపారు. నీరవ్ అప్పగింత ప్రక్రియను చేపట్టాలని ముంబై కోర్టు ఈ వారంలో ఈడీకి అనుమతి జారీచేసింది. కానీ ఇప్పటి వరకు ఈడీ, విదేశాంగ శాఖను సంప్రదించలేదు. నీరవ్ ఎక్కడున్నారనే కచ్చితమైన ప్రదేశం తెలియకుండా.. మంత్రిత్వ శాఖ కూడా ఏం చేయలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనంతవరకు విదేశాల్లో నీరవ్ మోదీని అరెస్ట్ చేయడం సాధ్యం కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.