pat
-
‘పాట్’ అమలులో ఏపీ ఉత్తమం
సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో డీకార్బనైజేషన్ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పాట్ సైకిల్–1లో 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివాలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల సుమారు 31 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్ సైకిల్–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా పాట్ సైకిల్–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేశాయని చెప్పారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్టైల్స్, పవర్ప్లాంట్లు, ఎరువులు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, క్లోర్–ఆల్కల్ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘పాట్’లో మరిన్ని పరిశ్రమలు
సాక్షి, అమరావతి: ఇంధన వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం పరిధిలోకి కొత్తగా మరికొన్ని పరిశ్రమలు, సెక్టార్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పథకం పరిధిలో ఉన్న సెక్టార్ల నుంచి కొత్తగా 143 పరిశ్రమలను గుర్తించారు. అదనంగా 4›పారిశ్రామిక సెక్టార్లను పాట్ పథకంలోకి తేవడం ద్వారా మరో 85 పరిశ్రమలకు పథకం వర్తిస్తుంది. బీఈఈకి ప్రతిపాదనలు పరిశ్రమల్లో విద్యుత్, ఇతర ఇంధన వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ ఉత్పత్తి సాధించేందుకు వీలవుతుంది. తద్వారా పారిశ్రామిక రంగంలో 2031 నాటికి దేశవ్యాప్తంగా 47.5 ఎంటీవోఈ (మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్) ఇంధనం ఆదా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలో 36 భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలు చేయటం ద్వారా రూ.5709 కోట్ల విలువైన 0. 818 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయగలిగారు. క్లోర్–ఆల్కలీ, స్టీల్, సిమెంట్, వాణిజ్య భవనాలు (ఎయిర్ పోర్ట్, హోటళ్లు), టెక్స్టైల్స్ తదితర సెక్టార్లలో కొత్తగా 143 పరిశ్రమలను పాట్ పథకంలోకి తీసుకొస్తోంది. కొత్తగా ఫార్మా, ఇంజనీరింగ్ , ఆటోమొబైల్, సిరామిక్స్, ఆహారం, మత్స్య పరిశ్రమల సెక్టార్లకు చెందిన 85 పరిశ్రమలను పాట్ పథకంలోకి తెచ్చేందుకు బీఈఈకి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పాట్ ప్రగతి నివేదిక విడుదల ఆంధ్రప్రదేశ్‌లో పాట్ పథకం ప్రగతి నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదివారం విడుదల చేశారు. అన్ని శాఖల్లో ఇంధన పరిరక్షణ విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, శాఖల విభాగాధిపతులకు సూచించారు. ఏపీఎస్ఈసీఎం, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. -
చెత్త రూల్స్: బాలిక డ్రెస్సు కత్తిరించిన టీచర్
రాయ్‌పూర్ : పరీక్షలలో కాపీ జరగకుండా ఉండేందుకు పెట్టే నిబంధనలు రోజురోజుకు హద్దు మిరుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాజ్‌నందగావ్‌లో గురువారం ఛత్తీస్‌ఘడ్ ప్రీ అగ్రికల్చర్ టెస్ట్ నిర్వహించారు. ఆ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలిక పొడువాటి డ్రెస్ చేతులను(స్లివ్స్) పరీక్షను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుడే కత్తెరతో కత్తిరించడం వివాదస్పదమైంది. పరీక్షల పేరుతో ఇలాంటి చెత్త చెత్త నిబంధనలను పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన ఆ జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు ఉపాధ్యయుడిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా గతంలో మన రాష్ట్రంలో జరిగిన చాలా ప్రవేశ పరీక్షలకు ఇలాంటి అసంబంధమైన నిబంధనలు పెట్టి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బంగారు ఆభరణాలను తొలగించుట, లో దుస్తులను తీయించుట లాంటి సంఘటనలు తీవ్ర దుమారాన్నే లేపాయి. -
దూసుకుపోయిన 'హీరో'
న్యూఢిల్లీ : టూవీలర్ దిగ్గజం హీరో మోటార్ కార్పొ, స్ట్రీట్ అంచనాలను అధిగమించి రయ్‌మని దూసుకుపోయింది. బుధవారం వెలువరిచిన రెండో క్వార్టర్ ఫలితాల్లో పన్నుల అనంతరం లాభాల్లో 28 శాతం వృద్ధి సాధించి, రూ.1,004 కోట్ల లాభాలను నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.772 కోట్లగా ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం హీరో మోటార్ కార్పొ ఈ క్వార్టర్లో కేవలం రూ.926 కోట్ల లాభాలను మాత్రమే రికార్డు చేస్తుందని తెలిసింది. కానీ అంచనాలు మించి హీరో మోటార్ కార్పొ దూసుకుపోయింది. అన్ని త్రైమాసిక ఫలితాల్లో కెల్లా ఇవే అత్యంత ఉత్తమమైన క్వార్టర్లీ ఫలితాలుగా హీరో మోటార్ కార్పొకు నిలిచాయి. ఈ త్రైమాసికంలో హీరో మోటార్ కార్పొ రికార్డు స్థాయిల్లో 18,23,498 మోటార్ సైకిల్స్ విక్రయాలను చేపట్టినట్టు ప్రకటించింది. ఇవి గతేడాది కంటే 15.8 శాతం వృద్ధి అని కంపెనీ వెల్లడించింది. కాగ, కంపెనీ రూ.1000కోట్లకు పైగా క్వార్టర్లీ లాభాలను నమోదుచేయడం ఇదే మొదటిసారని హీరో మోటార్ కార్పొ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ తెలిపారు. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.7,386 కోట్లగా ఉన్న కంపెనీ రెవెన్యూలు, ఈ త్రైమాసికంలో 15 శాతం ఎగిసి, రూ.8,449 కోట్లగా నమోదయ్యాయి. -
కళ్లనీళ్లు పెట్టుకున్న అద్వానీ
న్యూఢిల్లీ: లలిత్‌మోదీ వ్యవహారంపై లోక్‌సభలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సమాధానం ఇచ్చిన తీరుకు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ముగ్ధుడైపోయారట. దాదాపు అరగంట సేపు అనర్గళంగా ఆమె చేసిన ప్రసంగానికి ఆయన ఒక దశలో కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను శభాష్ అంటూ అభినందించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలు చేసిన దాడిని సుష్మా తిప్పికొట్టిన తీరు బీజేపీ అగ్రనేతను ఆకట్టుకుంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎక్కడా చలించకుండా తన వాగ్ధాటితో సభ్యులను కట్టడి చేసేందుకు సుష్మా శతవిధాలా ప్రయత్నించారు. సభలో ఆమె ప్రసంగం కొనసాగుతున్నపుడు అద్వానీ పక్కనే ఆశీనులయ్యారు. సీనియర్ పార్లమెంటు సభ్యుడుగా లోక్‌సభలో ఎన్నో వివాదాలకు, వేడివాడి చర్చలకు, చారిత్రక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచిన ఆయన.. సుష్మ వాదించిన తీరుకు చలించిపోయారు. తన వాదన ద్వారా పార్టీని, తనను తాను సమర్ధించుకున్న మహిళా ఎంపీని అభినందించారు. కాగా బుధవారం లలిత్ గేట్ వివాదంతో లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం నడించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను హోరెత్తించారు. అరుపులు కేకలతో సభ దద్దరిలిపోయింది.