Paternity Case
-
ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ
తమిళ స్టార్ ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ధనుష్ తమ కొడుకేనంటూ ఓ వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధనుష్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా ధనుష్ తమ కొడుకేనంటూ కతిసేరన్, మీనాక్షి అనే దంపతులు 2016లో మదురై జిల్లాలోని మేలూర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొన్ని ఏళ్లుగా కోర్టులో కేసు పెండింగ్‌లోనే ఉంది. ధనుష్ సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు ఫేక్ అని ఆరోపిస్తూ కేసు వేశారు. ధనుష్ తమ మూడో కొడుకని, సినిమాల్లో నటించేందుకు చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయి చెన్నై వచ్చాడని పిటిషన్లో పేర్కొన్నారు. ధనుష్ అసలైన తల్లిదండ్రులమని, అతని నుంచి రూ. 65 వేలు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఇందుకు సదరు దంపతులు ధనుష్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మెమో, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్‌ను కూడా సమర్పించారు. దీంతో కేసును పరిష్కరించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలని కోర్టు సూచించగా.. ధనుష్, అతని తరపు న్యాయవాది ఈ అభ్యర్థనను తిరస్కరించారు. అయితే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ సరిపోతాయో లేదో చెక్ చేసేందుకు ధనుష్‌కు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వైద్య పరీక్షల ఫలితాలు ధనుష్‌కు అనుకూలంగా రావడంతో దంపతుల ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2020లో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు కాగా జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ కతిసేరన్ దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసులతో విచారణ జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ ధనుష్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ధనుష్ కొట్టిపారేశాడు. తాను తమిళ నిర్మాత కస్తూరి రాజా, విజయలక్ష్మిల కుమారుడినంటూ పేర్కొన్నారు. తన నుంచి డబ్బులు రాబట్టే ఉద్ధ్యేశంతో తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నాడు. చదవండి: Pooja Bhatt: నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
హీరో ధనుష్‌కి మధురై హైకోర్టు షాక్
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు మధురై కోర్టు షాకిచ్చింది. గత మూడేళ్ళుగా ధనుష్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ధనుష్ తమ కొడుకే అని చిన్నతనంలో అతనిని మందలిస్తే ఇంటి నుంచి వెళ్లిపోయాడంటూ మదురైకి చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ధనుష్ జనన, విద్య, నివాసానికి సంబంధించిన ధృవ పత్రాలను అసలెందుకు తీసుకురాలేదంటూ ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అతనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను కోర్టుకు అందజేయాలని చెన్నై కార్పోరేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మీరు ఎవరో తెలియదు అంటుంటే గుండె తరుక్కుపోతోందని కదిరేషన్ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ వారు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అయితే ధనుష్ ఇది వరకు పుట్టుమచ్చలను కూడా తొలగించుకున్నాడనే వ్యవహారం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే దీనిపై ధనుష్ స్పందిస్తూ.. వృత్తిలో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందంటూ చెప్తుండటం గమనార్హం. -
ఇద్దరు కవలలు.. ఇద్దరు తండ్రులు
న్యూయార్క్: ఓ తల్లి గర్భం నుంచి కొన్ని సెకన్ల తేడాతో జన్మించిన కవల పిల్లలకు తండ్రి మాత్రం ఒక్కరు కాదు. ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు. ఈ అసాధారణమైన సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. రెండేళ్ల క్రితం తన భార్య ద్వారా జన్మించిన కవలల్లలో ఒకరికే తాను తండ్రిని, ఆ పిల్లాడి సంరక్షణ బాధ్యత మాత్రమే చూస్తానని తండ్రి స్పష్టం చేశాడు. తల్లి మాత్రం ఇద్దరి సంరక్షణ చూడాలని పట్టుబట్టింది. పితృత్వ గొడవ కోర్టు దాకా వెళ్లింది. కోర్టు రికార్డుల్లో భర్త పేరును 'ఏ ఎస్'గా, భార్య పేరును 'టీ ఎమ్'గా నమోదు చేశారు. కోర్టులో భార్యభర్తలు తమ వాదనే నిజమని చెప్పారు. అయితే భార్య జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఒకే వారంలో భర్తతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు కవలలకు తండ్రి ఒకరు కాదని, వేర్వేరని తేలింది. రుతుస్రావ సమయంలో ఆమె వారం వ్యవధిలో ఇద్దరితో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి ద్వారా తల్లి అయినట్టు వైద్యులు పేర్కొన్నారు. వైద్య శాస్త్రంలో ఇది అరుదైన సంఘటన అని చెప్పారు.