సీతానగరంలో పత్రిజీ పుష్కర స్నానం
సీతానగరం (తాడేపల్లి రూరల్): మహానాడు మానససరోవరం జ్ఞానమందిరం సభ్యులు బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో శనివారం సీతానగరం ఘాట్ వద్ద కష్ణానదిలో పుష్కరస్నానాలు చేశారు. ఈ సందర్భంగా మానస సరోవరం సభ్యులందరూ మహానాడు, సుందరయ్యనగర్, సీతానగరం తదితర ప్రాంతాలలో పుష్కరాలపై ప్రచారం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీతానగరం వద్ద ఘాట్లో పుష్కరస్నానాలు చేసి ధ్యానంలో పాల్గొన్నారు. పుష్కరస్నానాల ప్రాముఖ్యతను భక్తులకు బ్రహ్మర్షి పత్రీజీ వివరించారు.