patta
-
భూమి ఆక్రమిస్తున్నారని..
నర్మెట: తమ పట్టాభూమి ఆక్రమణకు గురవుతోందని మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దంపతులు పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసు కోవడం కలకలం రేపింది. జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండతండాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాలో ఇరువర్గాల మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. 257, 258, 259, 263 సర్వే నంబర్లలో అసైన్డ్ భూమి తో పాటు పట్టాభూమి ఉంది. ఇందులో భూక్య ఈర్యా, మేగ్యా, కిష్ట, మోహిలా సోదరులకు 258 సర్వే నంబర్లో 12.18 గుంటల పట్టాభూమి ఉంది. వీరికి 12 మంది వారసులు ఉన్నారు. మరోవర్గంలో భూక్యా పాపా వారసులు చంద్రు, లక్ష్మా, సకృ, రాములు, జయరాంలకు 257 సర్వేనంబర్ లో పట్టా భూమితో పాటు అసైన్డ్ భూమి ఉంది. కాగా, భూక్య జయరాం.. ఇటీవల హిటాచీతో భూమి చదును చేపట్టడంతో మరో వర్గానికి చెందిన మేగ్యా కుమారుడు భూక్య గురు, జయరాంల మధ్య తగాదా ఏర్పడింది. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించగా భూమి సర్వేకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న సర్వే నిర్వహించిన అధికారులు 257, 258 సర్వేనంబర్లకు హద్దులు గుర్తించి, 14న పత్రాలు అందిస్తామని చెప్పి వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఈ భూమిని పరిశీలించిన పోలీసులు సర్వే రిపో ర్టులు వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని చెప్పినా, జయరాం 258 సర్వేనంబర్‌లో హిటాచీతో భూమి చదును చేయించాడు. దీంతో తమకు న్యాయం జరగదని ఆందోళనకు గురైన భూక్య గురు, సునీత దంపతులు పురుగు మందుతాగడంతో అది గమనించిన తండావాసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వీరికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ దేవేందర్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి వివరించారు. -
బతికున్న మనిషి చనిపోయినట్లు నమ్మించి..
తిరువళ్లూరు(చెన్నై): బతికి ఉన్న వృద్ధురాలు మృతి చెందినట్లు నమ్మించి 30 ఎకరాల ఆస్తిని కాజేసిన వారిపై చర్యలు తీసుకుని, తమ భూములను అప్పగించాలని ఒకే కుటుంబానికి చెందిన బాధితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం వెలుగుచూసింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదువల్లూరు నయపాక్కం గ్రామానికి చెందిన పచ్చయప్పన్‌కు అదే గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. గత 40 ఏళ్ల క్రితం కుటుంబ తగాదాల కారణంగా పుదువల్లూరు నయపాక్కం నుంచి పాక్కంకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల క్రితం పచ్చయప్పన్ మృతి చెందాడు. అతని కుమారులు కృష్ణన్, రాజన్ కలిసి తహసీల్దార్‌ను సంప్రదించారు. అయితే అప్పటికే పట్టాభూమితో సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల పేరిట మారినట్లు తెలిసి షాక్‌కు గురయ్యారు. పచ్చయప్పన్ భార్య మృతి చెందినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి డెత్ సర్టిఫికెట్తో పాటు మొత్తం రికార్డులను మార్చేసి కబ్జా చేసినట్లు నిర్ధారించారు. దీంతో పచ్చయప్పన్ భార్య సుశీల, ఇద్దరు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు కలిసి తిరువళ్లూరు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌తో సహా పలువురు ఉన్నతాధికారులకు గత ఏడేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో ఆవేదన చెందిన వారు గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
పోడు భూములకు పట్టాలతో ఆనందం
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న కొండపోడు భూములపై హక్కులు లేక గిరిజనులు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఆ భూములపై వారికి హక్కులు లేవంటూ అటవీ అధికారులు వేధించేవారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆ భూముల్లో సాగు చేసిన పంటలను అటవీశాఖ సిబ్బంది నాశనం చేసేవారు. పోడు భూములను ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ అక్కడ గిరిజనులు ఏర్పాటు చేసుకున్న మకాంలు తగులబెట్టి బెంబేలెత్తించేవారు. ఏమీ చేయలేని నిస్సహాయతతో గిరిజనులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొనే వారు. వీరికి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలివ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారి బతుకులకు భరోసా ఏర్పడింది. రంపచోడవరం: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రంపచోడవరం నియోజకవర్గంలో 17,661 మంది గిరిజనులకు 45,871. 23 ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించారు. పోడు పట్టాలు అందజేసి వరి కళ్లల్లో ఆనందం నింపారు. దీంతో పాటు స్థానిక గిరిజనులకు కమ్యూనిటీ పట్టాలు అందజేశారు. తద్వారా ఆ భూముల్లో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇలా రంపచోడవరం డివిజన్లో 12,334 మంది గిరిజనులకు 49,508 ఎకరాలపై కమ్యూనిటీ హక్కులు కల్పించారు. దీంతో తమ కల నెరవేరిందంటూ ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అండగా.. గిరిజనులకు అండగా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు అండగా నిలిచారు. వారి సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. హక్కు పట్టాలు మంజూరులో వారు కీలకపాత్ర పోషించారు. పోడు భూమి ఖాళీ చేయమన్నారు నా భర్తకు అనారోగ్యం. ముగ్గురు పిల్లలతో బొల్లికొండలో పోడు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్నాం. పోడు వదిలి వెళ్లిపోవాలని అటవీ సిబ్బంది బెదిరించారు. అలా ఇబ్బంది పడుతూనే పోడు పట్టాల కోసం ఎదురు చూశా. సీఎం జగనన్న వచ్చిన తరువాత 3 ఎకరాల 85 సెంట్ల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. అందులో కందులు, కొర్రలు వేశాను. జీడిమామిడి మొక్కలు పెంచుకుంటున్నాను. –మర్రిక సీత, దాకరాయి, రాజవొమ్మంగి మండలం నిబంధనల మేరకు పట్టాలు అటవీ హక్కుల చట్టం ద్వారా అర్హత ఉన్న ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలు మంజూరు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తరువాత పట్టాలు మంజూరు చేస్తాం. అటవీ హక్కుల చట్టం నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఏజెన్సీలో ఇప్పటికే పోడు భూములు సాగు చేసుకుంటున్న అనేక మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చాం. –కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్, రంపచోడవరం స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నా గత 25 ఏళ్ల నుంచి దాకరాయి దగ్గర బొల్లికొండలో నివాసం ఉంటూ అక్కడే కొండపోడు సాగు చేసుకుంటున్నాను. బుడములు, చోళ్లు , సామలు జీడిమామిడి మొక్కలు పెంచుకుంటుండగా అటవీ అధికారులు అనేక ఇబ్బందులు పెట్టారు. జగనన్న సీఎం అయిన తరువాత 8 ఎకరాల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. రెండు సార్లు రైతు భరోసా పొందాను. ప్రభుత్వ సాయం ఎన్నటికీ మరువలేను. –మర్రి లక్ష్మయ్య, దాకరాయి, రాజవొమ్మంగి మండలం -
సంపూర్ణ హక్కుతో నిశ్చింత
‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం(జేఎస్‌జీహెచ్‌పీ) కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న లక్షల మంది పేదలకు భారీ లబ్ధి చేకూరుతోంది. పేదల ఆస్తుల విలువ పెరగడంతో పాటు పూర్తి భద్రత దక్కుతోంది. పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ నిర్మించిన ఇళ్లకు గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అత్యధికంగా పొజిషన్ సర్టిఫికెట్స్ గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న పేదల్లో పొజిషన్ సర్టిఫికెట్, డీ పట్టాదారులే ఎక్కువ మంది ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ వద్ద ఉన్న 51.8 లక్షల మంది వివరాలను మునిసిపాలిటీలు/పంచాయతీలకు బదిలీ చేసింది. వీరిలో 45.5 లక్షల మంది వివరాలను గ్రామ/వార్డు సచివాలయాలకు ట్యాగ్ చేశారు. వలంటీర్లు, మునిసిపల్, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలు, స్థల స్వభావాన్ని గుర్తిస్తున్నారు. 76 శాతం మందికి పొజిషన్ సర్టిఫికెట్లు, 20 శాతం మందికి డీ పట్టాలుండగా కేవలం 4 శాతం మంది మాత్రమే రిజిస్టర్డ్ స్థలాలు కలిగిన వారున్నట్లు వెల్లడైంది. గతంలో వడ్డీ మాఫీలు మాత్రమే గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకున్న వారికి గత ప్రభుత్వాలు వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) కింద వడ్డీల్లో మాత్రమే రాయితీ ఇస్తూ వచ్చాయి. రాయితీ పోనూ రుణం చెల్లించిన వారికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చి తనఖాలో ఉన్న ధ్రువపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ రూపంలో అసలు, వడ్డీ రెండిటికి రాయితీ ఇవ్వడంతో పాటు పేదలకు ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కుల కల్పనకు శ్రీకారం చుట్టడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చార్జీలు, ఫీజులు లేకుండా యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా పేదలకు భారీ ఊరట లభించనుంది. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లలో విలువపై 7.5 శాతం ఫీజులు, చార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పుడు అవేవీ లేకుండా రుణగ్రహీతలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మునిసిపాల్టీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రయోజనాలు గృహ నిర్మాణ సంస్థ సహకారంతో రుణాలు తీసుకున్న వారంతా రోజువారీ కూలీలు, చిరువ్యాపారులు, ఇతర పనులకు వెళ్తూ పొట్టపోసుకునేవారే. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో డబ్బు అవసరమై బ్యాంకులకు వెళితే రుణాలు అందక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పూర్తి యాజమాన్య హక్కులు సంక్రమించడం వల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలకు మార్కెట్లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్టర్ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వం జారీ చేసే విక్రయపత్రం ద్వారా ఆస్తులను వారసుల పేర్లపై బదలాయించుకోవడంతో పాటు ఇతరులకు అమ్మడానికి హక్కులు లభించనున్నాయి. అమాయకులైన పేదలను మోసగించి తప్పుడు పత్రాలతో కబ్జాలకు పాల్పడే ఆస్కారం లేకుండా ఆస్తులకు పూర్తి భద్రత లభిస్తుంది. మా ఆస్తికి మరింత విలువ నా భర్త ముఠా కూలీ. డీ పట్టా స్థలంలో 2004–2008 మధ్య ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణ సంస్థ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం సుమారు రూ.40 వేలకు చేరుకుంది. ఇటీవల వలంటీర్, సచివాలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. రూ.15 వేలు చెల్లిస్తే ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే హక్కు పత్రం ద్వారా వారసులకు ఆస్తి బదలాయించడంతో పాటు ఇతరులకు అమ్ముకోవచ్చని చెప్పారు. యాజమాన్య హక్కులు కల్పిస్తే మా ఆస్తికి విలువ పెరుగుతుంది. మాకు బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. చాలా సంతోషంగా ఉంది. – మర్రి ప్రసన్నలక్ష్మి, తెనాలి, గుంటూరు జిల్లా -
పట్టాల మార్పుపై పీడీ విచారణ
నూకపల్లి హౌసింగ్‌బోర్డుకాలనీలో అక్రమాలు అధికారుల విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు జగిత్యాల రూరల్ : జగిత్యాల పట్టణ ంలోని నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన నూకపల్లి హౌసింగ్‌బోర్డుకాలనీలోని పట్టాల మార్పుపై విచారణ కొనసాగుతోంది. హౌసింగ్ పీడీ పి.నర్సింహరావు గురువారం కాలనీకి వచ్చి విచారణ చేపట్టారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో 4 వేల గృహాలకు పట్టాలివ్వగా ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 1,675 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు ఆన్లైన్లో నమోదు చేసినట్లు పీడీ తెలిపారు. వీరు మాత్రమే ఇళ్లు నిర్మించుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. గతంలోని పట్టాలు, ఇటీవల డీఈ పంపిణీ చేసిన పట్టాలు సైతం చెల్లవని ఆయన ప్రకటించారు. హౌసింగ్ ఈఈ శ్రీనివాస్, డీఈ రాజేశ్వర్, ఏఈ రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రొసీడింగ్‌లు గతంలో హౌసింగ్ డీఈగా పనిచేసిన అధికారి ప్రస్తుతం డెప్యూటేషన్‌పై హైదరాబాద్‌లోని జలమండలి శాఖకు బదిలీపై వెళ్లారు. సదరు అధికారి అనధికారికంగా ఇందిరమ్మ గృహాల పట్టాలను పంపిణీ చేస్తూ సుమారు రూ.30 లక్షల మేర వసూలు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయనతోపాటు నూకపల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తమ్ముడి పాత్ర ఉందని అధికారుల వద్ద సమాచారం ఉంది.